• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  వేలిముద్రలు.. ఇది నిజంగా...

వేలిముద్రలు.. ఇది నిజంగా షాకింగే!

| సరికొత్త కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) సాయంతో పనిచేసే 'డీప్‌ కాంట్రాస్టివ్‌ నెట్‌ వర్క్‌' వ్యవస్థను కొలంబియా యూనివర్సిటీ ఇంజనీర్లు అభివృద్ధి చేశారు.

By - Tupaki Desk
Update: 2024-01-12 15:30 GMT

మనం క్రైమ్‌ సీరియళ్లు, మిస్టరీ నవలలు చూసినప్పుడు, చదివినప్పడు మనకు తెలిసే అంశం ఏమిటంటే.. ఒకరి వేలిముద్రలు మరొకరితో సరిపోలవు అని. ఎవరి వేలిముద్రలు వారికి మాత్రమే ప్రత్యేకమని.. వేరే వ్యక్తిని పోలి ఇంకో వ్యక్తి వేలిముద్రలు ఉండవనే ఇన్నాళ్లూ అందరూ నమ్ముతూ వచ్చారు. ఒకరి వేలిముద్రలు ఇంకో వ్యక్తితో మ్యాచ్‌ కావనే ఫోరెన్సిక్‌ నిపుణులు సైతం చెబుతూ వచ్చారు. చివరకు కవలలు (ట్విన్స్‌) అయినా ఒకరి వేలిముద్రలు ఒకరిని పోలి ఉండవని.. వేర్వేరుగానే ఉంటాయని భావించేవారు.

అయితే వేలిముద్రల గురించి మనకున్న అభిప్రాయాలు తప్పని ఒక పరిశోధన నిరూపించింది. తాజాగా అమెరికాలోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయం.. కొలంబియా యూనివర్సిటీ వేలిముద్రలకు సంబంధించి సంచలన విషయాలను వెల్లడించింది.

ఈ మేరకు కొలంబియా విశ్వవిద్యాలయం ఇంజినీర్లు పరిశోధన నిర్వహించారు. సరికొత్త కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) సాయంతో పనిచేసే 'డీప్‌ కాంట్రాస్టివ్‌ నెట్‌ వర్క్‌' వ్యవస్థను కొలంబియా యూనివర్సిటీ ఇంజనీర్లు అభివృద్ధి చేశారు.

ఈ క్రమంలో అమెరికా ప్రభుత్వ డేటాబేస్‌ నుంచి సేకరించిన 60 వేల వేలిముద్రలను.. డీప్‌ కాంట్రాస్టివ్‌ నెట్‌ వర్క్‌ తో విశ్లేషించారు. కొన్నిసార్లు వేర్వేరు వ్యక్తులకు చెందిన వేలిముద్రలను, మరికొన్నిసార్లు ఒకే వ్యక్తికి చెందిన వేళ్ల ముద్రలను పోల్చిచూస్తూ పరిశీలన చేశారు. ఈ పరిశోధనలో ఆశ్చర్యకర విషయాలు వెల్లడయ్యాయి.

ఆశ్చర్యకరంగా ఒకే వ్యక్తికి సంబంధించిన వేర్వేరు వేళ్ల ముద్రలు కొన్ని కేసుల్లో సరిపోలుతుండటాన్ని కొలంబియా యూనివర్సిటీ ఇంజనీర్లు గుర్తించారు. అయితే వేలిముద్రలను పోల్చడంలో సంప్రదాయ విధానాలను కాకుండా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ పద్ధతిని అనుసరించారు. ఈ నేపథ్యంలోనే కొలంబియా ఇంజినీర్లు నిర్ధారించిన కొత్త అంశంతో ఫోరెన్సిక్‌ నిపుణులు ఏకీభవించడం లేదు.

మరోవైపు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ఫోరెన్సిక్‌ ఖచ్చితత్వాన్ని మెరుగుపరుస్తుందని పరిశోధన చేసిన కొలంబియా విశ్వవిద్యాలయ బృందం తెలిపింది. ఇంజనీరింగ్‌ ప్రొఫెసర్‌ అయిన హాడ్‌ లిప్సన్‌ మాట్లాడుతూ.. తన విద్యార్థుల్లో ఒకరు సంవత్సరం క్రితం తన బయోమెట్రిక్‌ తో సంబంధం లేకుండానే తన ఆఫీసులోకి అతడి బయోమెట్రిక్‌ తో వెళ్లగలిగాడని తెలిపారు. ఈ నేపథ్యంలో అతడి వేలిముద్రలు తన వేలిముద్రలతో ఎలా సరిపోయాయో తెలుసుకోవడానికే ఈ పరిశోధన చేపట్టినట్టు తెలిపారు. ఈ పరిశోధనలో సంచలన విషయాలు వెల్లడయ్యాయని తెలిపారు.

Tags:    
  • Deepcontrastivenetwork 
  • Columbia 
  • University 
  • Fingerprints 
  • Artificialintelligence 
  • Ai 
  • Database 
  • Usgovernment 

Similar News

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

Copyright @2026

Powered by Blink CMS