ఇదేం పని భువనా? రూ.9 లక్షల ప్యాకేజీ జాబ్ దొరికినా ఆత్మహత్యనా?

పదో తరగతిలో టౌన్ ఫస్ట్.. ఇంటర్ లో అత్యుత్తమ మార్కులు.. బీటెక్ పూర్తి కాకుండానే రూ.9లక్షల ప్యాకేజీతో మంచి కంపెనీలో జాబ్.. ఇదంతా చదివితే.. ఇంతకుమించి ఇంకేం కావాలన్న మాట మదిలో మెదులుతుంది.;

Update: 2026-02-25 04:46 GMT

పదో తరగతిలో టౌన్ ఫస్ట్.. ఇంటర్ లో అత్యుత్తమ మార్కులు.. బీటెక్ పూర్తి కాకుండానే రూ.9లక్షల ప్యాకేజీతో మంచి కంపెనీలో జాబ్.. ఇదంతా చదివితే.. ఇంతకుమించి ఇంకేం కావాలన్న మాట మదిలో మెదులుతుంది. కానీ.. అన్ని సాధించిన 22 ఏళ్ల భువన తాజాగా ఆత్మహత్యకు పాల్పడిన వైనం షాకింగ్ గా మారింది. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రంగంపేటలోని సినీ నటుడు మోహన్ బాబుకు చెందిన కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న భువన.. ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న వైనం షాకింగ్ గా మారింది.

పుంగనూరు మండలం మంగళం గ్రామానికి చెందిన సురేంద్రరెడ్డి. జానమ్మలకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె భువన బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. కొద్దిరోజుల క్రితం కాలేజీలో జరిగిన క్యాంపస్ సెలక్షన్ లో రూ.9 లక్షల ప్యాకేజీతో జాబ్ ను సొంతం చేసుకుంది. మేలో ఆమె జాబ్ లో చేరాల్సి ఉంది. రెండు రోజుల క్రితం ఇంటికి వెళ్లిన ఆమె సంతోషంగా గడిపింది. జాబ్ వచ్చిన ఆనందాన్ని ఇంట్లో వారితో షేర్ చేసుకుంది.

సోమవారం కాలేజీకి వెళ్లిన ఆమె.. తన గదిలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరి వేసుకొని చనిపోయిన వైనం షాకింగ్ గా మారింది. కుమార్తె సూసైడ్ వార్త తెలియటంతో తల్లిదండ్రులు హుటాహుటిన కాలేజీకి చేరుకున్నారు. కూతురు డెడ్ బాడీని చూసుకొని కన్నీరుమున్నీరు అవుతున్నారు. చలాకీగా ఉంటూ.. చదువులోనూ.. కెరీర్ లో మెరుగ్గా ఉన్న భువన ఎందుకు ఆత్మహత్య చేసుకుందన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. ఆమె గురించి తెలిసిన వారంతా.. ఇలా చేశావేంటి భువనా అని వేదన చెందుతున్న పరిస్థితి.

Tags:    

Similar News