• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఎమ్మెల్యే టికెట్...

ఎమ్మెల్యే టికెట్ దరఖాస్తుకు ఫీజులు... కాంగ్రెస్ లో కొత్త ట్రెండ్!

| ఉద్యోగ పరీక్షలకు ధరఖాస్తు చేసుకునే ఔత్సాహికులు డీడీ రూపంలోనూ, ఆన్ లైన్ పేమెంట్ రూపంలోనూ కొంత సొమ్ము ఫీజుగా చెల్లించాల్సి వస్తోంది.

By - Tupaki Desk
Update: 2023-08-15 05:44 GMT

ఉద్యోగ పరీక్షలకు ధరఖాస్తు చేసుకునే ఔత్సాహికులు డీడీ రూపంలోనూ, ఆన్ లైన్ పేమెంట్ రూపంలోనూ కొంత సొమ్ము ఫీజుగా చెల్లించాల్సి వస్తోంది. ఈ ఫీజులో రిజర్వేషన్స్ వారీగా చిన్న చిన్న మారుపులు ఉంటాయి. అయితే తాజాగా ఎమ్మెల్యే టిక్కెట్ కోసం చేసుకునే ధరఖాస్తుకు కూడా ఫీజు వచ్చింది.

అవును... కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం కొత్త ఉత్సాహం మీదున్న కాంగ్రెస్ పార్టీ... తెలంగాణలో ఈసారి అధికారంలోకి రావడం తథ్యం అనే నమ్మకంతో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో రాజకీయంగా కొత్త అడుగులువేస్తూ ఎమ్మెల్యే టికెట్ కోసం దరఖాస్తు చేసుకునే ప్రతి ఒక్కరూ నిర్ణీతమైన పీజు కూడా చెల్లించాల్సిందనే నిర్ణయం పెట్టింది.

పైగా అనూహ్యంగా కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం తెలంగాణలో బీజేపీ కాస్త తగ్గిందనే కామెట్లు రావడంతోపాటు.. కాంగ్రెస్ లో భారీ చేరికలు జరగడంతో పార్టీ టికెట్ల కోసం ఆశావహుల ఒత్తిడి చాలా ఎక్కువగా ఉందని అంటున్నారు. ఫీజులు పెట్టడం వల్ల ఆ ఒత్తిడి తగ్గదు గానీ.. పార్టీకి కాసుల వర్షం కురిసే అవకాశం అయితే ఉంది!

ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అనుకూల పవనాలు ఉన్నాయని.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అధికారంలోకి రావాలని కాంగ్రెస్ అనుకుంటోంది. ఇందులో భాగంగా... సెప్టెంబరు నెలలోనే అభ్యర్థుల మొదటి జాబితా ప్రకటించాలని భావిస్తోందని తెలుస్తోంది.

ఎన్నికలకు వీలైనంత ముందుగానే అభ్యర్థుల జాబితాను ప్రకటించడం వలన ఎడ్వాంటేజీ ఉంటుందని పార్టీ పెద్దలు భావిస్తున్నారని అంటున్నారు. ఫలితంగా.. ప్రచారంలో దూసుకువెళ్లేందుకు అవకాశం ఉండటంతో పాటు, నియోజకవర్గాల్లో అసంతృప్తులను బుజ్జగించడానికీ సమయం ఉంటుందని భావిస్తోన్నారట.

ఈ నేపథ్యంలో... ఈరోజు (ఆగస్టు 15) నుంచే దరఖాస్తులను స్వీకరించనున్నారు. దీనికోసం దరఖాస్తు రుసుములను కూడా నిర్వహించారు. దీనిప్రకారం... ఎమ్మెల్యే టికెట్ కోరే వ్యక్తి ఓసీ అయితే 10,000.. బీసీలు 5,000.. ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన వారు 2,500 రూపాయలు రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి.

అయితే ఈ ఫీజులే ఫైనల్ కాదనే మాటలూ వినిపిస్తున్నాయి. దామోదర రాజనర్సింహ నేతృత్వంలోని కమిటీ తుది ఫీజులను నిర్ణయిస్తుందని అంటున్నారు. వీటి ప్రకారం... ఓసీ అభ్యర్థులు 50,000.. బీసీ, ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన వారు 25,000 రూపాయల వంతున రుసుములు నిర్ణయించాలని భావిస్తున్నారని కథనాలొతున్నాయి.

Tags:    
  • CongressParty 
  • RevanthReddy 
  • Telangana 
  • MLAseats 
  • Politicalnews 

Similar News

దమ్ము చూపిన జక్కంపూడి రాజా.. స్టేట్ లోనే రికార్డు

2026-11-07 14:12 GMT

అయోడిన్ టాబ్లెట్లు పంచుతున్న ఇరాన్.. అసలేంటి కథ? ఎందుకిలా?

2026-11-07 14:09 GMT

ఇందిర ఎమర్జెన్సీ మీద సోనియా షాకింగ్ కామెంట్స్ !

2026-11-07 14:09 GMT

ఎవరికి ఎన్ని సీట్లు? జిల్లాల వారీగా గెలుపు లెక్కలు

2026-11-07 14:08 GMT

లోకల్ రిజల్ట్ : జనాలకు ఇంట్రెస్ట్ తగ్గిందా ?

2026-11-07 14:07 GMT

మాజీ గర్ల్‌ఫ్రెండ్ కోసం ఆరాటం.. ఆర్టీఐతో పోరాటం..ఇదో సాధారణ బ్రేకప్ స్టోరీ కాదు సామీ

2026-11-07 14:05 GMT

ఆధునిక రాజకీయ శకం...వందేళ్ళ అద్వానీకి వందనం

2026-11-07 14:03 GMT

ఓబీసీ క్రీమీలేయ‌ర్‌.. మ‌రింత క‌ఠిన‌మా? సుప్రీంకోర్టు ఏం చెప్పింది!

2026-11-07 13:45 GMT

షర్మిల ఓవర్ కాన్ఫిడెన్స్

2026-11-07 11:50 GMT

జెడ్పీ పీఠాల వాటాలు...కూటమిలో లెక్క సెట్ అయిందా ?

2026-11-07 11:49 GMT

ఇరాన్ ను కొట్టలేక.. పాపం అమెరికాకు ఎంత గతి పట్టింది?

2026-11-07 11:40 GMT

ఎన్నికల్లో విజయం.. ఎంపీటీసీ గెలుపు చూడకుండానే మరణం.. ఎంత దురదృష్టం..

2026-11-07 11:25 GMT

Copyright @2026

Powered by Blink CMS