• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కారు నంబర్ల కోసం ఇదేం...

కారు నంబర్ల కోసం ఇదేం క్రేజు రా నాయన!

| ఇప్పుడు తాజాగా మరోసారి తమకు కావాల్సిన కారు నంబర్ల కోసం వాహనదారులు భారీగా ఖర్చుపెట్టారు

By - Tupaki Desk
Update: 2023-09-06 14:00 GMT

చాలామందికి కార్లు అంటే ఇష్టం. దీనికి సాధారణ ప్రజలే కాకుండా సెలబ్రిటీలు, సినీ తారలు, రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, క్రీడాకారులు కూడా అతీతం కాదు. నచ్చిన కారు కోసం భారీగా వెచ్చించడం ఒక ఎత్తయితే.. నచ్చిన నంబర్‌ ను చేజిక్కించుకోవడం మరో ఎత్తు. నచ్చిన నంబర్‌ కోసం ఎన్ని లక్షలయినా ఖర్చు పెడతారు. ముఖ్యంగా 9 నంబర్‌ కు క్రేజ్‌ ఎక్కువ. ఈ నంబర్‌ కు ఇలాంటి, అలాంటి క్రేజు ఉండదు. గతంలో ప్రముఖ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ తన కొత్త లంబోర్గిని కారుకు TS 09 FS 9999 అనే నంబర్‌ కోసం ఏకంగా రూ.17 లక్షలు ఖర్చు పెట్టిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు తాజాగా మరోసారి తమకు కావాల్సిన కారు నంబర్ల కోసం వాహనదారులు భారీగా ఖర్చుపెట్టారు. హైదరాబాద్‌ లోని ఖైరతాబాద్‌ ఆర్టీఏ కార్యాలయంలో ఫ్యాన్సీ నంబర్ల కోసం వాహనదారులు ఎగబడ్డారు. తమకు నచ్చిన నంబర్‌ TS 11 EZ 9999 కోసం ఒక వ్యక్తి ఏకంగా రూపాయి తక్కువగా రూ.10 లక్షలు పెట్టడం విశేషం. ఈ నంబర్‌ను ఒక ఎడ్యుకేషనల్‌ సొసైటీకి విక్రయించారు.

అలాగే TS 11 FA 0001 నంబర్‌ ను సాయి శివనాగ్‌ అనే వ్యక్తి రూ.3 లక్షలకు దక్కించుకున్నాడు. అదేవిధంగా TS 11 FA 0011 నంబర్‌ 1.55 లక్షలకు అమ్ముడుబోయింది. ఈ నంబర్‌ ను రోహిత్‌ రెడ్డి అనే వ్యక్తి కొనుగోలు చేశాడు.

ఈ ఫ్యాన్సీ నంబర్లను ఫ్యాన్సీ ధరలకు వాహనదారులు కొనుగోలు చేయడంతో ఈ వేలం విక్రయాల ద్వారా మొత్తం రూ.18 లక్షలు సమకూరాయి. ఈ మేరకు ఖైరతాబాద్‌ ఆర్టీఏ వెల్లడించింది.

Tags:    
  • Cars 
  • Numberplates 
  • Vechilenumber 
  • Fancynumber 
  • Numberauction 
  • Carnumberplates 
  • Registrations 

Similar News

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

హైడ్రా రంగనాథ్ నెక్ట్స్ టార్గెట్ ఇదే..

2026-11-05 06:52 GMT

పాతపగలన్నీ మాని ట్రంప్ కు వేల కోట్లు ఇచ్చినా.. పాపం ఎలన్ మస్క్ పరిస్థితి ఇదీ

2026-11-05 06:37 GMT

ఇక.. 100 ప‌ర్సంట్ దూకుడే.. !

2026-11-05 06:27 GMT

Copyright @2026

Powered by Blink CMS