కాలం చెల్లిన మెడిసిన్స్ పై కేంద్రం కీలక ప్రకటన

ఏ ఇంట్లో అయినా జ్వరానికి.. జలుబుకు.. ఇతరత్రా కొన్ని జబ్బులకు నయం చేసేందుకు వీలుగా మెడిసిన్స్ ను ఉంచుకోవటం మామూలే.;

Update: 2025-07-09 11:30 GMT

ఏ ఇంట్లో అయినా జ్వరానికి.. జలుబుకు.. ఇతరత్రా కొన్ని జబ్బులకు నయం చేసేందుకు వీలుగా మెడిసిన్స్ ను ఉంచుకోవటం మామూలే. అయితే.. ఇలా ఇంట్లో ఉండే మెడిసిన్స్ కాలం చెల్లిన తర్వాత చెత్తతో పాటు బయట పడేస్తుంటారు. అయితే.. ఇలాంటి పని అస్సలు చేయొద్దంటూ కేంద్రం తాజాగా ఒక కీలక ప్రకటన చేసింది. అంతేకాదు.. ఇంట్లో ఉండే కాలం చెల్లిన మెడిసిన్స్ విషయంలో మరింత కేర్ ఫుల్ గా ఉండాలని చెబుతోంది.

కాలం చెల్లిన ఔషధాల్ని ఆరు బయట పడేయటం ద్వారా.. ప్రజలకు.. జంతువులకు ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని చెబుతోంది. ఈ అంశంపై తాజాగా కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ కొత్త వార్నింగ్ అలెర్టును జారీ చేసింది. అత్యంత ప్రమాదకరమైన 17 రకాల ఔషధాలకు సంబంధించి కీలక సూచన చేసింది.

తీవ్రమైన నొప్పులు.. వ్యాకులత లాంటి రుగ్మతలను కంట్రోల్ చేసే ఔషధాల (ట్రమాడోల్.. టాపెంటాడోల్.. డయాజెపామ్.. ఆక్సికోడోన్.. ఫెంటానిల్)ను చించి.. అందులోని ట్యాబ్లెట్లను టాయిలెట్ లో వేసి ఫ్లష్ చేయాలని చెప్పింది. అంతే తప్పించి.. బయట చెత్తతో పాటు పడేస్తే పలువురికి అనారోగ్యానికి కారణమవుతుందని హెచ్చరించింది. సో.. మీ ఇంట్లో ఉండే మెడిసిన్స్ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

Tags:    

Similar News