ప్రవాహానికి ఎదురెళ్లిన అవ్వ.. ఏం జరిగిందంటే..? వీడియో వైరల్..

ఈ ఘటన యాదాద్రి జిల్లాలో జరిగింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. దీని నుంచి మనం ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు.;

Update: 2025-09-19 10:33 GMT

స్వామి వివేకానంద ఒక విషయం చెప్పారు.. పెద్ద పెద్ద యూనివర్సిటీలో చదువుకంటే వ్యక్తిగత అనుభవం చాలా గొప్పద్దని (యువర్ లైఫ్ ఈజ్ బిగ్ యూనవర్సిటీ) అన్నారు. ఎన్ని చదువులు ఉన్నా.. అనుభవమే గొప్పది. ఇది చాలా విషయాల్లో చాలా సందర్భాల్లో రుజువు కూడా అవుతుంది. మన తాతలు, తండ్రులు అనేక విషయాలు చెప్తుంటారు. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు అనేక విషయాలు వారి అనుభవంతో చెప్తుంటారు. కానీ ఎప్పుడూ యంగ్ జనరేషన్ వారు విషయాలను పట్టించుకోరు.

వేప పుళ్లతో పళ్లు తోముకుంటే కలిగి ప్రయోజనాల నుంచి రాత్రి సంధ్య వేళకు ముందే భోజనం చేసే ప్రక్రియ వరకు అన్నీ చెప్తుంటారు. కానీ మనం వాటిలో దేన్నీ పట్టించుకోం. ఫలితంగా నూరేళ్ల జీవితం 40 నుంచి 50లోపే ముగుస్తుంది. వారి అనుభవాలను తెలుసుకుంటే.. వాటిని ఆచరిస్తే చక్కగా ఆనందంగా నూరేళ్లు బతకవచ్చు. ఈ విషయాన్ని ఇటీవల ఒక వీడియో గుర్తు చేసింది కూడా.. ఏదో చదువుకున్నాం.. నాకే తెలుసు అనే గర్వంతో ఒక యువకుడు ప్రమాదానికి గురైతే.. అనుభవం, ఆలోచన ఉన్న ఒక వృద్ధురాలు ప్రమాదం నుంచి తప్పించుకుంది.

ఈ ఘటన యాదాద్రి జిల్లాలో జరిగింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. దీని నుంచి మనం ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు. వీడియోలో ఒక వృద్ధురాలు వరద వచ్చిన సందర్భంలో వాగులో పారుతున్న నీటిని అనుసరించి ముందుకెళ్తుంది. ఆమె వెనకనే ఒక యువకుడు నడుస్తున్నాడు. అయితే ఇద్దరిలో ఒక తేడా ఉంది. వృద్ధురాలు ఎంతో అనుభవంతో నడుస్తుండగా.. యువకుడు మాత్రం అనుభవం లేక ఇష్టం వచ్చినట్లు నడుస్తూ ప్రమాదంలో పడ్డాడు.

సాధారణంగా ప్రవాహం పారుతున్న సందర్భంలో ఒక పక్క నుంచి మరో పక్కకు నడవడం అంటే ప్రాణాలతో చెలగాటం ఆడడమే. కానీ కొంత ఆలోచనతో ప్రవాహంను ఎదుర్కొనవచ్చు. ప్రవాహనంలో నడిచే సందర్భంలో అడుగులను దగ్గరదగ్గరగా వేయాలి. కాలు ఎట్టి పరిస్థితుల్లో ప్రవాహం పై వరకు లేపద్దు. అలాగైతే కింద ఉన్న కాలుపై నీటి ఒత్తిడి పెరిగి నీరు ముందుకు తోస్తుంది. దీంతో ప్రవాహనంలో కొట్టుకుపోతారు. ఈ విషయం తెలిసిన వృద్ధురాలు ఒక్కొక్క అడుగు దగ్గర దగ్గరగా వేస్తూ.. జాగ్రత్తగా నడుస్తుంది. కానీ యువకుడు మాత్రం స్పీడుగా నడుస్తూ వెళ్లాగు. అలా నడుస్తున్న సందర్భంలో ప్రవాహంలో కొట్టుకుపోయాడు.

ప్రవాహానికి ఒక వైపు ఉన్న వ్యక్తులు ఈ ఇద్దరు నడుస్తున్న తీరును వీడియో తీసి ఎక్స్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

Tags:    

Similar News