'కేడీ బ్రదర్స్'... అర్ధరాత్రి జంక్షన్ లో దువ్వాడ హల్ చల్!

అవును... శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో అర్ధరాత్రి పూట హైడ్రామా చోటుచేసుకుంది. ఇందులో భాగంగా... అర్ధరాత్రి సమయంలో నిమ్మాడ జంక్షన్ వద్ద దువ్వాడ శ్రీనివాస్ ప్రత్యక్షమై ప్రత్యర్థులకు సవాళ్లు విసిరారు.;

Update: 2025-12-27 10:00 GMT

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ మాజీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం గత కొంతకాలంగా అటు మీడియాలోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో అర్ధరాత్రి ఆయన నడిరోడ్డుపై జంక్షన్ లో హల్ చల్ చేశారు. 'చంపాలనుకుంటే రండి.. నేను రెడీ!' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్ష నాయకులను ఏకతాటికి కట్టే ప్రయత్నం చేశారు దువ్వాడ!

అవును... శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో అర్ధరాత్రి పూట హైడ్రామా చోటుచేసుకుంది. ఇందులో భాగంగా... అర్ధరాత్రి సమయంలో నిమ్మాడ జంక్షన్ వద్ద దువ్వాడ శ్రీనివాస్ ప్రత్యక్షమై ప్రత్యర్థులకు సవాళ్లు విసిరారు. ఈ సందర్భంగా... రాష్ట్ర మంత్రులకు, ప్రత్యర్థులకు బహిరంగ సవాల్ విసరడం జిల్లావ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ క్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ లను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

ఈ సందర్భంగా... నిమ్మడ జంక్షన్ వద్ద దువ్వాడ మాట్లాడుతూ... తనను హత్య చేయడానికి ఉద్దేశపూర్వక కుట్ర జరుగుతుందని, కింజారపు అప్పన్న అనే వ్యక్తి తనకు సమాచారం అందించాడని, అన్నారు. తనపై జరుగుతున్న ఈ హత్య కుట్ర ఆరోపణలపై త్వరలో పోలీసు సూపరింటెండెంట్‌ కు అధికారికంగా ఫిర్యాదు చేస్తానని, మీడియాకు వెళ్లడిస్తానని ఆయన తెలిపారు. ఇదే సమయంలో తాను చావుకి భయపడనని దువ్వాడ చెప్పారు.

ఇదే సమయంలో.. తనను చంపాలనుకుంటే తాను ఇక్కడే ఉన్నానని.. దమ్ముంటే రావాలని.. తాను హైదరాబాద్ నుంచి ఇప్పుడే వచ్చానని.. తాను దేనికైనా సిద్ధంగా ఉన్నానని అంటూ దువ్వాడ శ్రీనివాస్ తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నిస్తే చంపేస్తారా అంటూ ఆయన నిలదీశారు. తాను బెదిరింపులకు భయపడే రకం కాదని.. తాను ఇక్కడే హైవేపైనే రెండు గంటలు ఉంటానని భీషించుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక అధికార, విపక్ష నాయకులిద్దరినీ విమర్శించారు దువ్వాడ.

ఇందులో భాగంగా... మంత్రి అచ్చెన్నాయుడు, వైసీపీ మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ లను "కేడీ బ్రదర్స్"గా అభివర్ణించిన దువ్వాడ శ్రీనివాస్.. వీరిద్దరూ కలిసి జిల్లా రాజకీయాలను భ్రష్టు పట్టించారని విమర్శించారు. వాస్తవానికి వీరిలో ఒకరు అధికార పార్టీలో, మరొకరు విపక్షంలో ఉన్నప్పటికీ.. ఇద్దరు కలిసి జిల్లా రాజకీయాలను దిగజార్చారని ఆరోపించారు. ఇలా అర్ధరాత్రి సమయంలో నడిరోడ్డుపై దువ్వాడ చేసిన హల్ చల్ ఒక్కసారిగా సంచలనంగా మారింది.



Tags:    

Similar News