వైసీపీలోకి ఆమంచి ముహూర్తం పెడుతున్నారా ..!
పొలిటికల్ ఫైర్ బ్రాండ్ నాయకుడు ఆమంచి కృష్ణమోహన్ త్వరలోనే వైసీపీలోకి చేరేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది.;
పొలిటికల్ ఫైర్ బ్రాండ్ నాయకుడు ఆమంచి కృష్ణమోహన్ త్వరలోనే వైసీపీలోకి చేరేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. గత ఎన్నికలకు ముందు వరకు ఆయన వైసీపీలోనే ఉన్నారు. అయితే అనూహ్యంగా ఆయన వైసీపీని వదిలేసి కాంగ్రెస్‌కు మద్దతు పలికారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున చీరాల నియోజకవర్గం నుంచి పోటీచేసి పరాజయం పాలై పాలయ్యారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా పోటీ చేసిన కాంగ్రెస్ నాయకుల్లో ఒక్క ఆమంచి కృష్ణమోహన్ మాత్రమే కనీసం డిపాజిట్ దక్కించుకుని... రికార్డును సొంతం చేసుకున్నారు.
మిగిలిన కాంగ్రెస్ నాయకులు అందరూ డిపాజిట్లు సైతం కోల్పోయారు. తాజాగా మారుతున్న పరిణామాల క్రమంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం లేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఎవరు ఆ పార్టీలో కొనసాగాలని భావించటం లేదు. అవకాశం లేనివారు మాత్రమే కాంగ్రెస్ లో ఉంటున్నా రు. ఈ నేపథ్యంలో ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్‌ను వదిలేసి.. రాజకీయంగా జనసేన వైపు వెళ్లాలని ముందు భావించినప్పటికీ చీరాలలో పరిస్థితులు జనసేనకు అనుకూలంగా లేకపోవడంతో ఆయన వైసీపీ వైపు చూస్తున్నారు.
ముఖ్యంగా బలమైన టిడిపి నాయకులు ఉండటం అదేవిధంగా ఒకవేళ జనసేనలోకి వెళ్లినప్పటికీ టికెట్ వస్తుందో రాదో అన్న ఆలోచన కూడా ఆమంచిలో ఏర్పడింది. ఈ నేపథ్యంలో గత ఎన్నికలకు ముందు వదిలేసిన పార్టీని తిరిగి ఆలింగనం చేసుకునేందుకు కండువా కప్పుకునేందుకు ఆయన సిద్ధమయ్యారు. దీనికి వైసీపీ నాయకులు కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే అటు జనసేన ఇటు టిడిపిని బలంగా ఎదుర్కోవాలంటే చీరాలలో బలమైన ఆమంచి కృష్ణమోహన్ అయితే సరైన నాయకుడిని భావిస్తున్నారు.
వాస్తవానికి కరణం బలరాం కృష్ణమూర్తి వైసీపీలో ఉన్నట్టుగానే అనిపిస్తున్న ఆయన ఏక్షణమైనా టిడిపిలోకి వెళ్ళిపోతారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమంచికి తిరిగి వైసిపి రెడ్ కార్పెట్ పరిచేందుకు సిద్ధపడిందన్నది రాజకీయంగా నాయకులు మధ్య చర్చ జరుగుతోంది. దీనిపై వైసీపీ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చిందని, త్వరలోనే ఆమంచికి ఆహ్వానం అందుతుందని అంటున్నారు. ఇదే జరిగితే చీరాలలో మళ్ళీ వైసీపీ పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.