ఏపీ డిప్యూటీ సీఎంకు షాకిచ్చిన ఉద్యోగులు... పోలీసులు ఎంట్రీ!

వివరాళ్లోకి వెళ్తే... తాడేపల్లిగూడెంలో అసెంబ్లీ నియోజకవర్గంలో మరోసారి అదృష్టం పరీక్షించుకుంటున్న డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణకు తాజాగా ప్రభుత్వ ఉద్యోగుల చేతిలో ఘోర అవమానం ఎదురైంది.

Update: 2024-05-09 13:20 GMT

ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా... తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం కు ప్రభుత్వ ఉద్యోగులు షాకిచ్చారు. పోలీసులు చెప్పినా తగ్గేదేలే అంటూ డిప్యూటీ సీఎంను ఘెరావ్ చేశారు! ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారింది. ప్రభుత్వానికి - ఉద్యోగులకూ మధ్య ఉన్న గ్యాప్ ని ఈ విషయం రుజువు చేస్తుందా అనే చర్చ ఈ సందర్భంగా తెరపైకి వచ్చింది.

అవును... సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు సమయం దగ్గరపడుతున్న వేళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ ప్రభుత్వానికీ, ప్రభుత్వ ఉద్యోగులకూ మధ్య ఈ ఐదేళ్లలో చిన్న గ్యాప్ ఉందని.. ఆ ప్రభావం ఈ ఎన్నికలపై పడేలా కనిపిస్తోందనే కామెంట్లు వినిపిస్తున్న నేపథ్యంలో... ఒక కీలక ఘటన చోటుచేసుకుంది. ఇప్పుడు ఈ విషయం వైరల్ గా మారింది!

వివరాళ్లోకి వెళ్తే... తాడేపల్లిగూడెంలో అసెంబ్లీ నియోజకవర్గంలో మరోసారి అదృష్టం పరీక్షించుకుంటున్న డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణకు తాజాగా ప్రభుత్వ ఉద్యోగుల చేతిలో ఘోర అవమానం ఎదురైంది. ఇందులో భాగంగా.. తాడేపల్లిగూడెంలో ఇవాళ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేస్తున్న ఉద్యోగులను మంత్రి కొట్టు సత్యనారాయణ బెదిరించటంతో ఉద్యోగులు తిరగబడ్డారని తెలుస్తుంది! బెదిరిస్తే బెదిరిపోయే రోజులు పోయాయంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం!

Read more!

ప్రధానంగా... పోలింగ్ స్టేషన్ నుంచి బయటకు పోతావా లేదా అంటూ ఉద్యోగులు ఆయన్ను ప్రశ్నించడం వైరల్ గా మారింది. ఏమైనా ఫోటోలు తీసుకోవాలంటే గేటు బయటకు వెళ్లాలని వారు ఘాటుగా సూచించారు. ఈ సమయంలో అక్కడే ఉన్న పోలీసులు జోక్యం చేసుకుని ఉద్యోగులను సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ ఉద్యోగులు మాత్రం వారి మాట కూడా వినలేదు.

ఈ క్రమంలో కాసేపు కొట్టు సత్యనారాయణకు, ఉద్యోగులకు మధ్య కాస్త మాటా మాటా పెరిగింది. ఈ క్రమంలో... మర్యాదగా మంత్రిని పోలింగ్ కేంద్రం నుంచి బయటకు పంపించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. దీంతో మంత్రి - డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ అక్కడి నుంచి బయటికి వెళ్లిపోయారు!

Full View
Tags:    

Similar News