నో డెడ్ జోన్... ఎలాన్ మస్క్ 'స్టార్ లింక్' పై కీలక అప్ డేట్!

అవును... ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ కు చెందిన స్పేస్‌ ఎక్స్‌ అనుబంధ సంస్థ అయిన స్టార్‌ లింక్‌ పలు దేశాల్లో ఇప్పటికే ఇంటర్నెట్ సర్వీసులను అందిస్తోన్న సంగతి తెలిసిందే.;

Update: 2025-07-25 02:30 GMT

భారతదేశంలో శాటిలైట్‌ ఆధారిత ఇంటర్నెట్‌ సేవలు అందించేందుకు ఎలాన్‌ మస్క్‌ కు చెందిన 'స్టార్‌ లింక్‌'కు ఇటీవల గ్రీన్‌ సిగ్నల్‌ లభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా... ఈ సేవలు ప్రారంభించేందుకు అవసరమైన లైసెన్సును టెలికాం విభాగం జారీ చేసింది. ఈ నేపథ్యంలో స్టార్ లింక్ చరిత్ర సృష్టిస్తుందని చెబుతూ... దీనికి సంబంధించిన కీలక అప్ డేట్ ఎలాన్ మస్క్ నుంచి వెలువడింది.

అవును... ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ కు చెందిన స్పేస్‌ ఎక్స్‌ అనుబంధ సంస్థ అయిన స్టార్‌ లింక్‌ పలు దేశాల్లో ఇప్పటికే ఇంటర్నెట్ సర్వీసులను అందిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... సంప్రదాయ ఉపగ్రహ సేవల మాదిరిగా కాకుండా.. లియో (లో ఎర్త్‌ ఆర్బిట్‌) ఉపగ్రహాల ద్వారా స్టార్‌ లింక్‌ ఈ సేవలను అందిస్తోంది.

ఈ క్రమంలో... భూమికి 550 కిలోమీటర్లు ఎత్తులో ఉండే కక్ష్యలో స్టార్‌ లింక్‌ కు చెందిన 6,000 ఉపగ్రహాలు పరిభ్రమిస్తుంటాయి. ఇవి భూమి నుంచి తక్కువ దూరంలో ఉండడం వల్ల తక్కువ లేటెన్సీతో ఇంటర్నెట్‌ సేవలను అందిస్తాయి. ఫలితంగా... మారుమూల ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సేవలందించేందుకు స్టార్‌ లింక్‌ ఉపయోగపడుతుంది.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ విషయంపై స్పందించిన ఎలాన్ మస్క్... స్టార్‌ లింక్ ఉపగ్రహాలు మీ మొబైల్‌ లకు సిగ్నల్స్ నేరుగా ప్రసారం చేయగలవని.. మీ సెల్ ఫోన్‌ కు ప్రపంచంలో ఎక్కడా డెడ్‌ జోన్ అనేది ఉండదని.. సెల్ టవర్లు లేకపోయినా మీ ఫోన్ పనిచేస్తుందని స్పష్టం చేశారు. టీ-శాటిలైట్ ద్వారా దేశంలో ఎక్కడినుంచైనా మెసేజ్ లు చేయొచ్చని తెలిపారు.

కాగా... స్టార్‌ లింక్‌ కిట్‌ ధర భారతదేశంలో రూ.33,000 వరకు ఉండొచ్చని కథనాలు వెలువడుతున్న సంగతి తెలిసిందే! ఈ క్రమంలో నెలవారీ సబ్‌ స్క్రిప్షన్‌ రూ.3,000 నుంచి రూ.4,200 వరకు ఉండొచ్చని అంటున్నారు. ఇక, దేశంలో శాటిలైట్‌ సేవలను అందించడం కోసం ఇటీవలే భారతీ ఎయిర్‌ టెల్‌, రిలయన్స్‌ జియోతో స్టార్‌ లింక్‌ ఒప్పందం కుదుర్చుకుంది.

Tags:    

Similar News