'క్యాన్సిల్ నెట్ ఫ్లిక్స్'... ఎలాన్ మస్క్ ఆగ్రహానికి కారణం ఇదే!
అవును... "ది బేబీ సిస్టర్స్ క్లబ్" అనే వెబ్ సిరీస్ లో ఓ పిల్లాడిని బాలికగా భావించి వైద్యం చేయాలని అడిగే సన్నివేశం దారుణం అంటూ ఓ ఎక్స్ యూజర్ ట్వీట్ చేశారు.;
ప్రపంచ కుబేరుడు, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ కు ఆగ్రహం వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ పై ఆయన ఫైరవుతున్నారు. అందుకు కారణం... నెట్ ఫ్లిక్స్ పిల్లల్లో ట్రాన్స్ జెండరిజాన్ని ప్రోత్సహిస్తుందని తెలుస్తోంది. ఈ మేరకు ఓ ఎక్స్ యూజర్ పెట్టిన ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ... "క్యాన్సిల్ నెట్ ఫ్లిక్స్" అని మస్క్ పిలుపునిచ్చారు. దీంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.
అవును... "ది బేబీ సిస్టర్స్ క్లబ్" అనే వెబ్ సిరీస్ లో ఓ పిల్లాడిని బాలికగా భావించి వైద్యం చేయాలని అడిగే సన్నివేశం దారుణం అంటూ ఓ ఎక్స్ యూజర్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు స్పందించిన మస్క్.. దాన్ని రీట్వీట్ చేసూ "క్యాన్సిల్ నెట్ ఫ్లిక్స్" అని పిలుపునిచ్చారు. ఏడేళ్ల పిల్లల కోసం ప్రమోట్ చేయబడిన షోలో ట్రాన్స్ జెండర్ థీమ్ లను విమర్శిస్తూ "ఇది సరైనది కాదు" అని ఆయన రాశారు.
ఇలా నెట్ ఫ్లిక్స్ ను రద్దు చేయాలనే టెక్ దిగ్గజం పిలుపు ఊపందుకుందనే చెప్పాలి. ఈ సందర్భంగా పలువురు వినియోగదారులు అతని అడుగుజాడల్లోనే నడుస్తామని చెబుతున్నారు. ఈ విషయం నెట్టింట వైరల్ గా మారింది.
మస్క్ కు కోపం తెప్పించిన హమీష్ స్టీల్ వ్యాఖ్యలు!:
పారానార్మల్ పార్క్ అనే యానిమేటెడ్ సిరీస్ సృష్టికర్త హమీష్ స్టీల్.. బ్లూస్కీలో పోస్ట్ చేసిన పోస్ట్ లో డోనాల్డ్ ట్రంప్ మిత్రుడు, రైట్ వింగ్ కార్యకర్త చార్లీ కిర్క్ గత నెలలో జరిగిన హత్యను అతను ఎగతాళి చేశాడని ఆరోపించారు. పోస్ట్ లో.. స్టీల్, కిర్క్ ను "నాజీ" అని సంబోధించాడు. అలాంటి ఒక ఆన్ లైన్ పోస్ట్ కు రిప్లై ఇస్తూ.. మస్క్ “ఇది సరైనది కాదు” అని రాశారు.
కాగా... గత నెలలో ఉతా వ్యాలీ విశ్వవిద్యాలయంలో జరిగిన దాడిలో చార్లీ కిర్క్ కాల్చి చంపబడిన సంగతి తెలిసిందే. దీంతో.. ఈ సంఘటనపై ఎలోన్ మస్క్ స్పందిస్తూ.. దీనిని "కోల్డ్ బ్లడెడ్ మర్డర్" అని పిలిచారు.