• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Automobiles >  కొత్త ఈవీ స్కూటర్ భలే...

కొత్త ఈవీ స్కూటర్ భలే ఉంది... సింగిల్ ఛార్జ్‌ తో 201కి.మీ!

| ఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఫుల్ డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇండియన్స్.. ఈ ఎలక్ట్రిక్ వాహనాలను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు

By - Tupaki Desk
Update: 2023-10-07 04:19 GMT

ఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఫుల్ డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇండియన్స్.. ఈ ఎలక్ట్రిక్ వాహనాలను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యలో తాజాగా భారత మార్కెట్లోకి హైదరాబాద్ ఆధారిత ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ కంపెనీ "ప్యూర్ ఈవీ" నుంచి "ఈప్లూటో 7జి మ్యాక్స్" అనే ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది. దీని ప్రత్యేకతలు ఏమిటి, ధర ఎంత అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.!


అవును... భారత మార్కెట్లోకి హైదరాబాద్ ఆధారిత ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ కంపెనీ "ప్యూర్ ఈవీ" నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది. ఈ ప్యూర్ ఈవీ.. 201 కిలోమీటర్ల రేంజ్ లో ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ ను విడుదల చేసింది. ఇది రివ‌ర్స్ మోడ్ కూడా క‌లిగిన స్కూట‌ర్ కావడం గమనార్హం.


ఎలక్ట్రిక్ స్కూటర్ హిల్ స్టార్ట్ అసిస్ట్, డౌన్‌ హిల్ అసిస్ట్, కోస్టింగ్ రీజెన్, రివర్స్ మోడ్, స్మార్ట్ ఏఐ వంటి ఫీచర్లతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫీచర్ల ద్వారా బ్యాటరీ హెల్త్ ఎక్కువ మన్నికగా ఉంటుందని కంపెనీ చెబుతోంది. ఈ ప్యూర్ ఈవీ 7జీ మ్యాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ కి.. ఎలక్ట్రిక్ మోటార్‌ కు కనెక్ట్ చేయ‌టంతో ఎంతో స్పెష‌ల్ రైడింగ్ ఎక్స్ పీరియ‌న్స్ ఇస్తుందని అంటున్నారు.

రెట్రో-థీమ్ ఎలక్ట్రిక్ స్కూటర్ మాత్రమే కాకుండా, మ‌రెన్నో స్పెష‌ల్ ఫీచర్లు కూడా అందుబాటులోకి తెచ్చింది ఈ కంపెనీ. ఇలా రెట్రో-థీమ్ ఎలక్ట్రిక్ స్కూటర్ గా తీర్చిదిద్దిన ఇపూటో 7జీ మ్యాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 201 కిలోమీట‌ర్ల నాన్ స్టాప్ గా ప‌రుగులు దీస్తుంది.

ఈ స్కూట‌ర్ కి క‌నెక్ట్ చేసిన ఎలక్ట్రిక్ మోటార్‌ కు 3.5 కేడబ్ల్యూహెచ్ లిథియం - అయాన్ బ్యాటరీ ప్యాక్ ను అనుసంధించ‌డం వల్ల.. ఇది 3.21 బి.హెచ్.పి. మేర‌.. అత్యధిక‌ శక్తినందిస్తుంది. ఈ ఏఐఎస్-156-సర్టిఫైడ్ బ్యాటరీ ప్యాక్‌ లో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) తో కూడిన స్మార్ట్ బ్యాటరీ దీని సామ‌ర్ధ్యాన్ని మ‌రింత మెరుగు ప‌రుస్తోందని చెబుతున్నారు కంపెనీ నిర్వాహ‌కులు.

ఇక ఈ ప్యూర్ ఈవీ ఇప్లూటో 7జీ మ్యాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ మాట్ బ్లాక్, రెడ్, గ్రే, వైట్.. ఇలా మొత్తం నాలుగు రంగుల్లో ల‌భ్యమ‌వుతోంది. ఈ నాలుగు రంగులతోనూ ఇండియన్ మార్కెట్లోకి విడుద‌లవుతోన్న ఈ కారు ఎక్స్- షోరూమ్ ధ‌ర‌.. రూ.1,14,999 గా కంపెనీ ఫిక్స్ చేసింది. కంపెనీ డీలర్ నెట్‌ వర్క్‌ ను అన్ని ప్రముఖ నగరాలు, పట్టణాలలో విస్తరిస్తోంది.

ఇదే సమయంలో... ఈ స్కూటర్ బుకింగ్ దేశవ్యాప్తంగా ఇప్పటికే ప్రారంభ‌మైంది. ప్లూటో వాహ‌నాన్ని బుక్ చేసుకున్న వారికి ఈ పండుగ సీజన్ నుంచి డెలివ‌రీ ఇవ్వనున్నారు. ఇదే క్రమంలో... రైడింగ్ ఎక్స్ పీరియ‌న్స్ ని మరింత మెరుగుపరచడానికి, మొత్తం మూడు రైడింగ్ మోడ్‌ లు ఉన్నాయని చెబుతున్నారు. దీంతో పాటు, ఈ ఈవీ స్కూటర్ 60 వేల‌ కిలోమీటర్ల వారంట్ తో రావడంతోపాటు.. 70 వేల‌ కిలోమీటర్ల వారంటీ కూడా అందుబాటులో ఉందని చెబుతున్నారు.

సో... బైక్ ల‌వ‌ర్స్.. "గో టు రైడ్.. గెట్ ద ప్రైడ్.. – ఓన్ ద మ్యాక్స్.. గెయిన్ ద మ్యాగ్జిమం ఎక్స్ పీరియ‌న్స్".. అనేది వీరి స్లోగ‌న్ గా క‌నిపిస్తోంది.

Tags:    
  • Pureev 
  • EPluto7Gmax 
  • Electricscooter 
  • Electricvehicles 
  • Evscooter 
  • Pureevscooter 
  • Electricmotor 
  • Artificialintelligence 

Similar News

ఫెయిల్ అయితే అంతే.. ఎలన్ మస్క్ భరించడు.. వదిలించుకుంటాడిలా..

2026-11-07 02:33 GMT

Hyundai Bayon 2026 Review: కొత్త SUVలో ఆకట్టుకునే ఫీచర్లు.. కొనేముందు తెలుసుకోవాల్సిన విషయాలు!

2026-10-27 05:28 GMT

స్టార్ హీరో గ్యారేజీలోకి మరో రాయల్ రైడ్!

2026-10-13 09:53 GMT

ముదురు రంగుల‌తో పోలిస్తే 'వైట్ కార్' ప్ర‌యోజ‌నం అదే!

2026-10-03 05:51 GMT

కారు కొని అల్లాడుతున్నారా? వినియోగదారుల కమిషన్ తీర్పు.. ఆటోమొబైల్ కంపెనీలకు గట్టి గుణపాఠం!

2026-09-29 00:30 GMT

మోడీ సర్కార్ చేసిన చిన్న మార్పు..దేశంలో 'కార్ల'ను ఎగబడి కొనేలా చేస్తోంది..

2026-09-24 02:30 GMT

పెట్రోల్‌ కార్ల కు నై.. ఈవీలకు జై.. భారత్ లో మారుతున్న ట్రెండ్

2026-08-07 17:08 GMT

మెగాస్టార్ దసరా సెంటిమెంట్ మళ్లీ వర్కవుట్ అవుతుందా?

2026-08-03 18:22 GMT

ఎలాన్ మస్క్ 'టెస్లా'.. అమ్మకాలు ఢమాల్.. మూసుకోవాల్సిందే

2026-07-18 09:34 GMT

కొత్త కారు ప్లానింగు ఉందా? ఈ నెలలోనే కొనేయండి.. లేదంటే?

2026-06-09 16:30 GMT

ల్యాండ్ రోవర్ ధరలు అంత భారీగా తగ్గనున్నయా?

2026-04-02 04:10 GMT

మెకానిక్ మ్యాజిక్.. మారుతీ టూ లంబోర్గిని!

2026-03-04 05:10 GMT

Copyright @2026

Powered by Blink CMS