• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఆ 2 చోట్ల అప్పట్లో...

ఆ 2 చోట్ల అప్పట్లో తండ్రులు.. ఇప్పుడు కొడుకుల మధ్య ఎన్నికల 'వార్'

| ఈ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లా.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరుగుతున్న ఎన్నికల ఫైట్ ఆసక్తికరంగానే కాదు.. అందరిని ఆకర్షిస్తోంది.

By - Tupaki Desk
Update: 2023-11-14 04:12 GMT

తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకుంటున్నాయి. నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావటం.. ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ దిశగా పార్టీలు.. అభ్యర్థులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఎవరికి వారు తమదైన వ్యూహాల్ని అమలు చేస్తూ అడుగులు వేస్తున్నారు. గెలుపే ధ్యేయంగా సాగుతున్న ఈ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లా.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరుగుతున్న ఎన్నికల ఫైట్ ఆసక్తికరంగానే కాదు.. అందరిని ఆకర్షిస్తోంది.

ఎందుకంటే.. ఏళ్లకు ఏళ్లు గడిచినా ఈ రెండు నియోజకవర్గాల్లో ప్రత్యర్థులుగా ఒకే కుటుంబానికి చెందిన వారు తలపడటమే దీనికి కారణం. ఎన్నికలు ఎన్నిసార్లు జరిగినా.. ప్రత్యర్థులుగా వారే ఉండటం ఒక ఎత్తు అయితే.. గతంలో తండ్రుల మధ్య ఎన్నికల వార్ జరిగితే.. ఇప్పుడు వారి వారసులైన కొడుకుల మధ్య సాగుతున్న ఎన్నికల రణం.. రోటీన్ కు భిన్నంగా ఉందని చెప్పాలి. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి వస్తే.. ఈ నియోజకవర్గం జానారెడ్డి అడ్డా. 1983 నుంచి 2014 వరకు ఆయన ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తెలుగుదేశం.. కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో ఉమ్మడి ఏపీలో మంత్రిగా ఆయన సుదీర్ఘకాలం పని చేశారు.

2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా చాలకుర్తి నుంచి నాగార్జునసాగర్ నుంచి పోటీ చేస్తున్నారు. 2014, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున జానారెడ్డి.. బీఆర్ఎస్ తరఫున నోముల నర్సయ్య తలపడ్డారు. 2014లో నోములపై జానారెడ్డి గెలిస్తే.. 2018లో జానారెడ్డిపై నోముల నర్సింహయ్య విజయం సాధించారు. అయితే.. అనూహ్యంగా నోముల హఠాన్మరణంతో జరిగిన ఉప పోరులోనే జానారెడ్డిపై నోముల తనయుడు భరత్ పోటీ చేసి విజయం సాధించటం తెలిసిందే.

తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే భరత్ బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగితే.. కాంగ్రెస్ అభ్యర్థిగా జానారెడ్డి కుమారుడు జైవీర్ తొలిసారి ఎన్నికల గోదాలోకి దిగారు. దీంతో.. తండ్రుల మధ్య మొదలైన ఎన్నికల పోరు ఇప్పుడు కొడుకుల మధ్య కంటిన్యూ కావటం ఆసక్తికరంగా మారింది. ఈ పోరులో ఎవరు విజయం సాధిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ ఇలాంటి సీనే నడుస్తోంది. ఉద్యమాల పురిటిగడ్డగా పేరున్న కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో సాగుతున్న తాజా పోరు అందరిని ఆకర్షిస్తోంది.2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన కారణంగా ఏర్పడిన కోరుట్లలో మొదట్నించి వెలమ సామాజిక వర్గానిదే అధిపత్యం. నాలుసార్లు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు విజయాన్ని సాధించారు. ఒకప్పటి బీజేపీ కంచుకోటను గులాబీ పార్టీ ముట్టడించి.. స్వాధీనం చేసుకుంది.

2009 నుంచి గులాబీ పార్టీ హవానే నడుస్తోంది. తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2010 ఉప ఎన్నికల్లోనూఆ తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ తరఫున విద్యాసాగర్ రావు.. కాంగ్రెస్ తరఫున మాజీ మంత్రి జువ్వాది రత్నాకర్ రావులు తలపడ్డారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో విద్యాసాగర్ రావును జువ్వాది తనయుడు నర్సింగరావు ఢీ కొన్నారు. తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తనయుడు డాక్టర్ సంజయ్ బీఆర్ఎస్ తరఫున.. జువ్వాది నర్సింగరావు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకిదిగారు. నాడు తండ్రుల మధ్య సాగిన పోరుకు కొనసాగింపుగా నేడు కొడుకుల మధ్య ఎన్నికల వార్ నడుస్తోంది. మరి.. ఈసారి విజయం ఎవరిదన్నది ఆసక్తికరంగా మారింది.

Tags:    
  • Nalgonda 
  • Karimnagar 
  • Politicalnews 
  • Telanganaelections 
  • Brs 
  • Congressparty 
  • Politicalwar 

Similar News

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS