పిన్నెల్లి వ్యవహారంలో ఈసీ సీరియస్... అరెస్ట్ పై స్ట్రాంగ్ వ్యాఖ్యలు!

ఆ స్థాయిలో ఏపీలో రాజకీయాలు జనాలతో ఆ స్థాయిలో ముడిపడిపోయాయని చెబుతుంటారు.

Update: 2024-05-23 12:17 GMT

ఏపీలో ఎన్నికలు ఉన్నా లేకున్నా.. సమయం ఏదైనా, సందర్భం మరేదైనా నిత్యం రాజకీయాల్లో ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటుందని అంటుంటారు. అంటే... రాజకీయాలకు ఏపీ ప్రజలు దూరంగా ఉన్నా.. వారి నుంచి మాత్రం రాజకీయాలు దూరంగా ఉండవు అన్నట్లుగా అన్నమాట! ఆ స్థాయిలో ఏపీలో రాజకీయాలు జనాలతో ఆ స్థాయిలో ముడిపడిపోయాయని చెబుతుంటారు.

ఇక ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ మే 13న ముగిసిన సంగతి తెలిసిందే. నాడు జరిగిన కొన్ని సంఘటనలు ఇటీవల తెరపైకి వచ్చి హల్ చల్ చేస్తున్నాయి. ప్రధానంగా వీడియో తమ నుంచి లీకవలేదని ఎన్నికల కమిషన్ చెబుతున్న.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినదిగా చెబుతున్న వీడియో వ్యవహారం ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ లీకవ్వడం సంగతి కాసేపుపక్కనపెడితే జరిగిన ఘటనపై మాత్రం ఈసీ సీరియస్ గా ఉందని అంటున్నారు.

అవును... మాచర్ల నియోజకవర్గం పరిధిలోని పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం ఘటనపై ఎన్నికల కమిషన్ సీరియస్ గా ఉందని తెలుస్తుంది. ఇందులో భాగంగా... ఈ ఘటనలో సరైన సమాచారం ఇవ్వనందుకు విధుల్లో ఉన్న పీవో, ఏపీవోలను సస్పెండ్‌ చేయాలని ఆదేశాలిచ్చినట్టు సీఈవో ముకేశ్‌ కుమార్‌ మీనా తెలిపారు.

ఇక, ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేసేందుకు ఎస్పీ, డీఎస్పీలతో 8 పోలీసు బృందాలు పనిచేస్తున్నాయని చెప్పిన సీఈవో... పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు విషయంలో ఈసీ సీరియస్‌ గా ఉందని, త్వరలోనే ఆయనను అరెస్టు చేసి తీరుతామని స్పష్టం చేశారు.

Read more!

ఇదే క్రమంలో ఈనెల 25 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్ట్రాంగ్‌ రూమ్‌ లను పరిశీలించేందుకు వెళ్తామని చెప్పిన సీఈవో మీనా... జూన్‌ 4న ఓట్ల లెక్కింపునకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారులకు జారీ చేసినట్లు తెలిపారు. ఇదే సమయంలో... ఫలితాలను కచ్చితత్వంతో త్వరితగతిన ప్రకటించేలా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను సూచించారు.

ఈ మేరకు కౌంటింగ్‌ ఏర్పాట్లపై అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతోనూ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన సీఈవో ముకేష్ కుమార్ మీనా... కౌంటింగ్‌ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఓట్ల లెక్కింపులో ఎటువంటి వివాదాలకు తావు లేకుండా చూడాలని సూచించారు.

Tags:    

Similar News