ముచ్చట్లు తీర్చుకుంటున్న దువ్వాడ !

తాజాగా చూస్తే కనుక ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ దివ్వెల మాధురికి ఉంగరాలు తొడుగుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ సందడి చేస్తోంది.;

Update: 2025-05-17 17:26 GMT

ఆయన ఇపుడు ఫ్రీ బర్డ్. ఎలాంటి రాజకీయ జంజాటాలూ లేవు, తాను ఉన్న రాజకీయ పార్టీ ఏమి అనుకుంటుందో అన్న ఆలోచన అసలు అవసరం లేదు. ఇక రాజకీయ ప్రత్యర్ధులు సోషల్ మీడియాలో చెలరేగిపోయి సెటైర్లు వేస్తున్నారేంటి అన్న చింత అసలు అవసరం లేదు, అందుకే ఆయన తన మనసుకు నచ్చినట్లుగా ఉంటున్నారు. .ఇంతకీ ఆయన ఎవరో కాదు వైసీపీకి చెందిన మాజీ నాయకుడు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్.

ఆయనను వైసీపీ ఇటీవల సస్పెండ్ చేసింది. అయితే దానికి ఆయన ఒకింత బాధపడినా మరోవైపు సంతోషించారేమో అనిపిస్తుంది. ఆయన ఇపుడు హ్యాపీగానే ఉన్నారు. దువ్వాడ శ్రీనివాస్ కి మాధురి అన్న ఆమెతో స్నేహం ఉందని అందరికీ తెలుసు.ఈ జంట కూడా తమ మధ్య ఉన్న బంధాన్ని అసలు ఎక్కడా దాచుకోవడం లేదు. తాము కోరుకున్నట్లుగా ఉంటామని స్పష్టంగా చెబుతున్నారు.

అలాగే చేస్తున్నారు కూడా. తాజాగా చూస్తే కనుక ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ దివ్వెల మాధురికి ఉంగరాలు తొడుగుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ సందడి చేస్తోంది. ప్రత్యేకంగా డిజైన్ చేసిన రెండు ఉంగరాలను మాధురి చేతి వేళ్లకు తొడిగిన దువ్వాడ ఆమె ముఖంలో సంతోషం చూసి మురిసిపోయారు. ఆమె సైతం సంతోషంతో కనిపించారు.

ఈ వీడియోను సోషల్ మీడియాలో చూసిన నెటిజన్లు తమకు తోచిన తీరులో కామెంట్స్ చేస్తున్నారు. ఇద్దరికీ ఎంగేజ్మెంట్ అయిపోయి ఉంటుందని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. తన రాణీకి రింగ్ తొడుగుతున్న రాజా అని కాప్షన్ లు పెడుతున్నారు.

మరో వైపు చూస్తే కనుక ఈ ఇద్దరూ కలసి హైదరాబాద్ లో వస్త్ర వ్యాపారం కూడా స్టార్ట్ చేశారు. అంతే కాదు ఈ ఇద్దరూ కలసి ముందుకు సాగాలని కూడా గట్టిగా నిర్ణయించుకున్నారు. తమ బంధం దైవబంధం అని చెబుతున్న ఈ ఇద్దరూ తాజాగా మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. మరి ఈ రింగుల తొడగడం కాస్తా రానున్న రోజూల్లో మరిన్ని కొత్త వార్తలకు కారణం అవుతుందా అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News