దువ్వాడ మాధురికి మొయినాబాద్ పోలీసుల షాక్

తరచూ వార్తల్లో నిలిచే దువ్వాడ మాధురి శ్రీనివాస్ ను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.;

Update: 2025-12-12 03:46 GMT

తరచూ వార్తల్లో నిలిచే దువ్వాడ మాధురి శ్రీనివాస్ ను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఏపీ వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను పెళ్లి చేసుకున్న ఎపిసోడ్ కు కాస్త ముందు నుంచి ఆమె ఏదో విధంగా వార్తల్లో ఉంటున్నారు. ఈ మధ్యనే బిగ్ బాస్ తెలుగు షోలో పార్టిసిపేట్ చేసిన ఆమె మధ్యలో ఎలిమినేట్ అయి హౌస్ నుంచి బయటకు రావటం తెలిసిందే.

ఇదిలా ఉంటే తాజాగా హైదరాబాద్ మహానగర శివారు మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన బర్త్ డే పార్టీ సందర్భంగా అక్కడి స్పెషల్ పోలీసుల కారణంగా ఆమెకు షాక్ తగిలినట్లుగా చెబుతున్నారు. మొయినాబాద్ మున్సిపాలిటీ జేబీఐఈటీ ఎదురుగా ఉన్న ద పెండెంట్ ఫామ్ హౌస్ లో దువ్వాడ శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలు జరిగినట్లుగా చెబుతున్నారు. ఈ పార్టీకి పలువురు ప్రముఖులు హాజరైనట్లు సమాచారం.

ఇదిలా ఉండగా పార్టీని ఎస్ వోటీ పోలీసులు నిలిపివేసినట్లుగా తెలుస్తోంది. దీని కారణం ఈ పార్టీకి సంబంధించి ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదని చెబుతున్నారు. ఈ పార్టీలో అక్రమ మద్యాన్ని కూడా పోలీసులు పట్టుకున్నట్లుగా చెబుతున్నారు. దీనిపై పోలీసులు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. అనుమతి లేకుండా నిర్వహిస్తున్న ఈ పార్టీని మధ్యలో నిలిపేయటం ద్వారా మాధురి శ్రీనివాస్ కు బిగ్ షాక్ తగిలినట్లుగా చెబుతున్నారు.

ఈ పుట్టిన రోజు పార్టీలో పది స్కాచ్ బాటిళ్లు.. ఐదు హుక్కా బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం. ఈ ఉదంతంలో దువ్వాడ మాధురిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఉదంతంపై పోలీసులు అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది.

Tags:    

Similar News