ఇండియాలోనే నంబర్ వన్ ముఖ్యమంత్రిగా డీకే రికార్డు
గద్దె ఎక్కుతూనే కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ ఒక అరుదైన రికార్డుని క్రియేట్ చేశారు. ఎందులో అంటే సంపదలో.
గద్దె ఎక్కుతూనే కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ ఒక అరుదైన రికార్డుని క్రియేట్ చేశారు. ఎందులో అంటే సంపదలో. అవును ఆయన దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రి. ఈ రోజున దేశంలో 28 రాష్ట్రాలు అలాగే చాలా కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. వీటిని ఏలే ముఖ్యమంత్రులు అందరిలోనూ డీకే నంబర్ వన్ ధనవంతుడుగా నిలవడం అంటే మామూలు విషయం కాదు. ఇంతకీ డీకే ఆస్తులు ఎన్ని ఏమిటా విశేషాలు అంటే వెరీ ఇంట్రెస్టింగ్ అని చెప్పాల్సి ఉంటుంది.
బాబుని పక్కకు నెట్టి :
ఇప్పటిదాకా చూస్తే దేశంలో రిచెస్ట్ సీఎం అంటే ఏపీ నుంచి చంద్రబాబు మాత్రమే కనిపించేవారు. డీకే తాజాగా సీఎం కావడంతో బాబు రికార్డుని సైతం పక్కకు నెట్టి ఆయన అగ్ర స్థానాన్ని ఆక్రమించారు. అయితే డీకేతో పాటుగా టాప్ త్రీ ధనవంతులైన ముఖ్యమంత్రులు అంతా దక్షిణ భారత దేశంలో ఉండడం మరో రికార్డుగా భావించాలి.కాంగ్రెస్ పార్టీలో అపర చాణక్యుడిగా ట్రబుల్ షూటర్ గా ఉన్న డీకే సీఎం గా ప్రమాణం చేసిన తరువాత ఆయన గురించిన అనేక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇక 2023 లో జరిగిన కర్ణాటక ఎన్నికల సమయంలో డీకే తన అఫిడవిట్ లో సమర్పించిన ఆస్తుల వివరాలు చూస్తే మొత్తం వాటి విలువ 1413 కోట్ల రూపాయలుగా చెబుతున్నారు. ఇందులో . వాణిజ్య ఆస్తులు, వ్యవసాయ భూములు, నివాస స్థలాలు, పెట్టుబడులు, షేర్లు సహా బ్యాంక్ డిపాజిట్లు ఉన్నాయి. అదే విధంగా బంగారంతో పాటు ఇతర ఆస్తులు కూడా ఉన్నాయి. చిత్రమేంటి అంటే డీకే ఆస్తులు 2008లో కేవలం 75 కోట్ల రూపాయలుఇగానే ఉండగా ఈ 19 ఏళ్ళ సమయంలోనే ఇరవై రెట్లు పెరిగాయన్నమాట. అయితే ఆయన పెట్టుబడులు భూముల విలువ పెరగడం వల్లనే ఇదంతా జరిగిందని అంటున్నారు.
తరువాత ప్లేస్ లో బాబు :
ఇక డీకే శివకుమార్ తరువాత రిచెస్ట్ సీఎం గా ఏపీ నుంచి చంద్రబాబు ఉన్నారు. ఆయన ఆస్తుల విలువ 931 కోట్ల రూపాయలు. 2024 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఈ వివరాలు ఉన్నాయి. ఆయన ఆస్తులలో అధిక భాగం అంతా హెరిటేజ్ ఫుడ్స్ షేర్ల ద్వారానే వచ్చిందని అంటున్నారు. బాబు తరువాత మూడవ ప్లేస్ లో చూస్తే ఇటీవలనే తమిళనాడుకు సీఎం అయిన జోసెఫ్ సి విజయ్ ఉన్నారు. ఆయన కుటుంబం ఆస్తుల విలువ 648 కోట్ల రూపాయలుగా ఉంది. విజయ్ కి సినిమా రంగం ద్వారా వచ్చిన ఆదాయంతో పాటు ఇతర స్థిరాస్తుల పెరుగుదల కూడా కారణంగా చెబుతున్నారు.
వీరంతా తరువాతనే :
ఇక ధనిక సీఎంల జాబితాలో నాలుగ ప్లేస్ లో అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండు ఉన్నారు. ఈయన ఆస్తుల విలువ 332 కోట్ల రూపాయలుగా ఉంది. ఈయన గత పదేళ్ళుగా అరుణాచల ప్రదేశ్ సీఎం గా ఉన్నారు. అయిదవ ప్లేస్ లో నాగాలాండ్ కి చెందిన ముఖ్యమంత్రి నెయిఫియు రియో ఉన్నారు. ఆయన ఆస్తుల విలువ 46 కోట్లుగా ఉంది. ఇక ఆ తరువాత ఆరవ స్థానంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ 42 కోట్లతో ఉంటే పుదుచ్చేరి సీఎం ఎన్ రంగస్వామి 38 కోట్లతో ఏడవ స్థానంలో ఉన్నారు తెలంగాణా సీఎం గా ఉన్న రేవంత్ రెడ్డి 30 కోట్ల రూపాయల ఆస్తులతో ఎనిమిదవ స్థానంలో ఉన్నారు. అలాగే తొమ్మిదవ ప్లేస్ లో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఉంటే పదవ ప్లేస్ లో గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ సంపద విషయంలో ఉన్నారు.