కన్ప్యూజన్.. ఈసారి దీపావళి ఎప్పుడు?

తరచూ ఏర్పడే కన్ఫ్యూజన్ మరో వారంలో వచ్చే దీపావళి సందర్భంలోనూ వచ్చేసింది. ఈసారి దీపావళిని ఎప్పుడు చేసుకోవాలన్న సంశయం వేధిస్తోంది.;

Update: 2025-10-15 11:54 GMT

తరచూ ఏర్పడే కన్ఫ్యూజన్ మరో వారంలో వచ్చే దీపావళి సందర్భంలోనూ వచ్చేసింది. ఈసారి దీపావళిని ఎప్పుడు చేసుకోవాలన్న సంశయం వేధిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సెలవుల జాబితాలో ఈ నెల 20న (సోమవారం) అని పేర్కొనగా.. 21న (మంగళవారం) చేసుకోవాలన్న వాదన బలంగా వినిపించటంతో.. దీపావళిని ఎప్పుడు చేసుకోవాలన్నది ఇప్పుడో ప్రశ్నగా మారింది. ఈ కన్ఫ్యూజన్ కు కారణం లేకపోలేదు.

క్యాలెండర్ లో చూస్తే దీపావళి పండక్కి కీలకమైన అమావాస్య తిధి అక్టోబరు 20వ తేదీ మధ్యాహ్నం దాటాక వచ్చి 21 సాయంత్రం వరకు ఉండటమే ఈ చర్చకు ప్రధాన కారణం. దీంతో పండుగను ఎప్పుడు చేసుకోవాలన్న మీమాంస ప్రజల్లో నెలకొంది. సూర్యోదయ సమయానికి 21వ తేదీన అమావాస్య కనిపిస్తుండటంతో 20వ తేదీ దీపావళి ఎలా జరుపుకుంటామన్నది ప్రశ్న.

దీపావళి అన్నంతనే టపాసుల పండుగ మాత్రమే కాదు.. ధనలక్ష్మీ పూజ.. కేదార వ్రతం.. నరక చతుర్ధశి నాడు చేసే అభ్యంగన స్నానం లాంటివి ఉంటాయి. పండితులు చెబుతున్న ప్రకారం సూర్యాస్తమయంలో అమావాస్య తిథి వ్యాప్తి ఉన్నప్పుడు ధనలక్ష్మీ పూజ చేసుకొని పండుగ చేసుకుంటారని చెబుతన్నారు కొందరు మాత్రం సూర్యోదయ సమయంలో కేదార వ్రతం చేసుకొని తర్వాత నుంచి పండుగగా పరిగణిస్తారని.. దీంతో.. 21న జరుపుకుంటారని చెబుతున్నారు.

ఈ కన్ఫ్యూజన్ నేపథ్యంలో పండితుల వాదన ప్రకారం దీపావళి పండుక్కి అమావాస్య ప్రధానం. ఆ తిథి 20వ తేదీ రాత్రి అంతా ఉందని.. 21వ తేదీ సాయంత్రానికి పాడ్యమి వచ్చేస్తుందని.. అందుకే అమావాస్య ఉన్న 20వ తేదీనే దీపావళి జరుపుకోవాలని చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే తెలంగాణ విద్వత్ సభ సైతం దీపావళిని అక్టోబరు 20న జరుపుకొని.. 21న కేదారవత్రం జరుపుకోవాలని సూచన చేస్తున్నారు. సో.. దీపావళిపై ఉన్న కన్ఫ్యూజన్ కు ఇదే క్లారిటీ అని చెబుతున్నారు.

Tags:    

Similar News