కేసీఆర్‌ను వ్యతిరేకించారా? కాంగ్రెస్‌కు ఒక్క ఛాన్స్ ఇచ్చారా
నియోజవర్గంలో తమకు దగ్గరగా ఉన్న వ్యాపారులు.. ఇతర కార్యకర్తలు.. మహిళలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.;
ఔను.. తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను వ్యతిరేకించారా? లేక తెలంగాణ ఇచ్చామని.. సోనియమ్మ త్యాగం చేసిందని చెప్పిన మాటలకు ఫిదా అయి.. కాంగ్రెస్‌కు ఒక్క ఛాన్స్ ఇచ్చారా? ఇదీ.. ఇప్పుడు క్షేత్రస్తాయి లో బీఆర్ ఎస్ నాయకులు చేస్తున్న సర్వే. ``ఏం జరిగిందో తేల్చండి!`` అన్న కేసీఆర్ ఆదేశాలతో కీలక నాయకులు రంగంలోకి దిగారు. నియోజవర్గంలో తమకు దగ్గరగా ఉన్న వ్యాపారులు.. ఇతర కార్యకర్తలు.. మహిళలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.
``మీ మీ స్థాయిలో ఏం జరిగిందో చెప్పండి? కేసీఆర్ సార్‌ను వ్యతిరేకించారా? లేక.. కాంగ్రెస్‌కు ఒక్క ఛాన్స్ ఇచ్చారో.. అంచనా వేయండి`` అని నాయకులు తమ కింది స్తాయి కేడర్‌ను ప్రశ్నిస్తున్నారు. దీనికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. కాంగ్రెస్‌పై సింపతీతో అధికారం ఇచ్చి ఉంటే.. బీఆర్ ఎస్‌ను సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉండదు. నాయకుల పీఠాలకు(పార్టీలో) మార్పు ఉండదు.
పైగా కేసీఆర్ నాయకత్వానికి తిరుగులేదని.. కేవలం కాంగ్రెస్ ఏడుపును చూసి తెలంగాణ సమాజం అవకా శం ఇచ్చిందని చెప్పుకొనే అవకాశం ఉంటుంది. దీనినే ప్రధాన ప్రచారంగా చేసుకుని.. వచ్చే పార్లమెం టు ఎన్నికల్లో విజృంభించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవచ్చు. ప్రజలను తిరిగి బీఆర్ ఎస్ వైపు మళ్లిం చవచ్చు. అలా కాకుండా.. కేసీఆర్‌నే వ్యతిరేకించి ఉంటే? మాత్రం ఇది వచ్చే పార్లమెంటు ఎన్నికల సమయంలోనూ ప్రభావం చూపిస్తుంది.
అంతేకాదు.. పార్టీలోనూ కీలక పదవుల విషయంలో మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుంది. పార్టీని మరింత సంస్కరించి.. లోపాలను సరిదిద్దుకోవడంతోపాటు.. ప్రక్షళన దిశగా కూడా పరుగులు పెట్టాలి. ఈ పరిణామాల నేపథ్యంలోనే క్షేత్రస్థాయిలో బీఆర్ ఎస్ నాయకులు ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టారు. మరో నాలుగు మాసాల్లో కీలకమైన ఎన్నికలు ఉన్ననేపథ్యంలో ఈ విషయాన్ని తొందరగా తేల్చేయాలనేది.. కేసీఆర్ భావన. మరి ఏం చేస్తారో చూడాలి.