ఒడిశా పీఠంపైన ధర్మేంద్ర ?

కేంద్ర విద్యా శాఖ మాజీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసిన తరువాత తన సొంత రాష్ట్రం ఒడిశాకు రావడం విశేషం.

Update: 2026-08-10 03:58 GMT

కేంద్ర విద్యా శాఖ మాజీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసిన తరువాత తన సొంత రాష్ట్రం ఒడిశాకు రావడం విశేషం. ఆయనకు అక్కడ అభిమాన గణం ఘన స్వాగతం పలికింది. ఇది రాష్ట్ర రాజకీయాలలో చర్చకు దారి తీసే పరిణామంగా మారింది. ధర్మేంద్ర కేంద్ర రాజకీయాల్లోకి వెళ్ళి అక్కడే సుదీర్ఘ కాలం ఉంటూ వచ్చారు. ఇక 2024 లో జరిగిన ఒడిశా ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు ఆయన ప్రధాన కారణంగా ఉన్నారు. ఒడిషాలో బీజేపీ మీద మంచి పట్టు ఉన్న ధర్మేంద్ర కేంద్ర మంత్రిగా కావాలని ఏరి కోరి కేంద్ర పెద్దలు ఆయనను కేబినెట్ లోకి తీసుకున్నారు. దాంతో ఒడిశా ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ ఈ కీలక పదవిని చేపట్టారు.

ధర్మేంద్ర ఎంట్రీతో :

అయితే అయిదేళ్ల పాటు మోహన్ చరణ్ మాఝీ ముఖ్యమంత్రి అని అంతా అనుకున్నారు. కానీ రెండేళ్ళకే అనూహ్యంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం ఆయన చూపు ఇపుడు రాష్ట్ర రాజకీయాల మీద పడడంతో ముఖ్యమంత్రి వర్గీయులలో కలవరం రేగుతోంది అని అంటున్నారు. ఇదిలా ఉంటే మోహన్ చరణ్ మాఝీ పంచాయతీ గ్రామ సర్పంచ్‌ స్థాయి నుంచి ఎది ఈ రోజున ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన సంతాల్ ఆదివాసీగా ఉన్నారు. ఆయన ఆర్ఎస్ఎస్ లో మొదటి నుంచి పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగారు. పార్టీ కోసం ఆయన ఎంతగానో కృషి చేశారు. దానికి గానూ ఆయనను మెచ్చి కేంద్ర బీజేపీ పెద్దలు ఈ కీలక పదవిని అప్పగించారు.

రాష్ట్ర రాజకీయాల్లోకి :

ఇక ఆయన పాలన మీద జనంలో అనుకూలత ఉంది. పార్టీలో కూడా సంతృప్తిగా ఉంది. అయితే సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి కేంద్ర పెద్దలతో మంచి రిలేషన్స్ కలిగిన ధర్మేంద్ర ప్రధాన్ ఇపుడు రాష్ట్ర రాజకీయాల్లోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు అన్న వార్తల నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాని అనుచర వర్గం చురుకుగా ముందుకు సాగుతోంది అని అంటున్నారు. ఇక ఒడిశాలో ధర్మేంద్ర ప్రధాన్ పర్యటించడం వెనక ఆంతర్యం ఏమిటి అన్న చర్చ కూడా సాగుతోంది.

పెద్దల ఆశీస్సులు ఉంటాయా :

మరో వైపు చూస్తే ధర్మేంద్ర ప్రధాని ప్రధాని నరేంద్ర మోడీ అలాగే హోం మంత్రి అమిత్ షాలకు అత్యంత సన్నిహితుడు అని అంటున్నారు. ఆయన కేంద్ర మంత్రి పదవిని ఎలాగైనా కొనసాగించాలని చేసిన ప్రయత్నాల వల్లనే విద్యార్ధుల ఉద్యమం తీవ్రతరం అయింది అని గుర్తు చేస్తున్నారు. మొత్తానికి ప్రధాన్ రాజీనామా జరిగిపోయింది. ఇక ఆయన నివాసానికి వెళ్ళి అమిత్ షా ఆయనతో భేటీ కావడం కూడా అప్పట్లో చర్చగా సాగింది. దాంతో ధర్మేంద్ర ప్రధాన్ ని మాజీ మంత్రిగా ఉంచుతారా లేక కీలకమైన రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి అప్పచెబుతారా అన్నది అయితే అంతా ఆలోచిస్తున్నారు.

జెన్ జీ మీద వ్యాఖ్యలు :

ఇక తన తాజా ఒడిశా పర్యటనలో ధర్మేంద్ర ప్రధాని జెన్ జీ మీద కీలక వ్యాఖ్యలు చేశారు. జెన్ జీ తరం కూడా మన పిల్లలే అన్నారు. అయితే వారిని కొంతమంది తప్పుదోవ పట్టించాలని చూశారని ఆయన మండిపడ్డారు. ఇక తనకు అయితే వారి మీద వ్యక్తిగతంగా ఎలాంటి సమస్యలు ఇబ్బందులు లేవని చెప్పారు. అంతే కాదు తనకు ఎలాంటి పదవి ముఖ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. మరో వైపు చూస్తే ఆయన మీద విపక్షం బీజేడీ కూడా విమర్శలు చేస్తోంది. రాష్ట్రానికి ఆయన అపఖ్యాతిని తీసుకుని వచ్చారని నిందిస్తోంది. మరి ఈ నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అన్నదే చర్చగా ఉంది.

Tags:    

Similar News