• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ట్రబుల్ షూటర్ పై గాంధీ...

ట్రబుల్ షూటర్ పై గాంధీ ఫ్యామిలీ గుర్రు.. ఇప్పుడేం కానుంది?

| ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎంత దీనంగా ఉందన్న విషయం గడిచిన పదేళ్లుగా చూస్తున్నదే.

By - Tupaki Desk
Update: 2024-09-10 13:30 GMT

ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎంత దీనంగా ఉందన్న విషయం గడిచిన పదేళ్లుగా చూస్తున్నదే. మోడీ ఎంట్రీతో మారిన సమీకరణాలు ఒక వైపు.. వయసు మీద పడిన సోనియమ్మ.. రాహుల్, ప్రియాంకల ఫెర్ ఫార్మెన్స్ వెరసి ముసలైన పార్టీకి పెద్ద దిక్కు లేని పరిస్థితి. ఏదైనా సమస్య వస్తే.. తీర్చే నాథుడు లేకుండా పోయిన పరిస్థితి. గతంలో పెద్ద తలకాయలు భారీగా ఉండటమే కాదు.. విషయం ఏదైనా ఇట్టే ఎంట్రీ ఇచ్చి.. సమస్యను సాల్వ్ చేసే వాళ్లు అరడజను వరకు రెఢీగా ఉండేవారు. కాలక్రమంలో వారంతా పెద్దోళ్లు అయిపోవటం.. కొత్త తరంలో అలాంటి సమర్థులు లేని దుస్థితి.

ఈ మధ్యనే ఒక్కొక్కరుగా వెలుగు చూస్తున్నారు. అలా కాంగ్రెస్ పార్టీకి ట్రుబుల్ షూటర్ గా ఉన్నారు కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్. పని ఏదైనా సరే.. టాస్కు ఇచ్చి పంపిస్తే.. లెక్కలు తేల్చేసే రకం. ఆవలిస్తే పేగులు లెక్క పెట్టిన చందంగా.. దక్షిణాదిలోని కర్ణాటక, తెలంగాణల్లో పార్టీ అధికారంలో ఉందంటే ఆయన పుణ్యమని చెప్పాలి. అలాంటి డీకే.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఖంగుతినేలా వ్యవహరించారన్న ఆరోపణ హాట్ టాపిక్ గా మారింది.

ఇటీవల ఢిల్లీ వెళ్లిన ఆయన.. కాంగ్రెస్ అధిష్ఠానంతో పాటు.. పనిలో పనిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ కావటం పార్టీ అధినాయకత్వం షాక్ తినేలా చేసిందంటున్నారు. ‘ముడా’ ఇంటి స్థలాల వివాదంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్యను విచారించేందుకు గవర్నర్ అనుమతి ఇవ్వటం తెలిసిందే. ఈ అంశంపై పార్టీ ఢిల్లీ పెద్దలకు వివరణ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి సిద్ద.. డిప్యూటీ సీఎం డీకేలు ఆగస్టు మూడో వారంలో ఢిల్లీకి వెళ్లారు.

ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోడీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సొంత పార్టీ ముఖ్యమంత్రులకే భేటీలకు టైం ఇవ్వని మోడీ.. డీకేకు సమయం ఇవ్వటం ఏమిటన్నది బీజేపీలోనే కాదు కాంగ్రెస్ లోనూ చర్చనీయాంశంగా మారింది. ఏ చిన్న అవకాశం లభించినా..తాము టార్గెట్ చేసిన రాష్ట్రాల్లో ప్రభుత్వాల్ని ఏర్పాటు చేసే టాలెంట్ ఉన్న మోడీషాలకు.. డీకేలాంటోడు జత కలిస్తే.. అగ్నికి వాయువు తోడైనట్లు అవుతుంది. అందుకే..కాంగ్రెస్ అధిష్ఠానంలో కలవరపాటు మొదలైంది.

తమ అనుమతి లేకుండా ప్రధాని మోడీతో ఎలా భేటీ అవుతారంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. అయితే.. మంత్రిగా పలు డెవలప్ మెంట్ అంశాల మీదనే పీఎం మోడీని కలిశానని.. రాజకీయ ఉద్దేశం లేనట్లుగా వివరణ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. రాహుల్ అమెరికా టూర్ లో ఉన్న వేళ.. డీకే సైతం ఆ దేశానికి వెళ్లటం.. అక్కడ యువరాజా వారిని కలవటం ఎజెండా ఉందంటున్నారు.మొత్తానికి కాంగ్రెస్ కు ట్రబుల్ షూటర్ కాస్తా ట్రబుల్ అయ్యాడన్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

Tags:    
  • Dkshivakumar 
  • Modi 
  • Congress 
  • Karnatakadeputycm 
  • BJP 
  • Karnatakapolitics 
  • Narendramodi 
  • Rahulgandhi 

Similar News

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS