ఎవరు ‘తండ్రీ’ మీరు... విమానంలో ట్రే టేబుల్ పై డైపర్ మార్చితే..!
అవును.. డెల్టా ఎయిర్ లైన్స్ లో ఓ ప్రయాణికుడితో పాటు ఒక శిశువుకు కూడా ప్రయాణిస్తోంది.;
విమానంలో ప్రయాణించేటప్పుడు.. ప్రయాణికులు కొన్ని ప్రాథమిక మర్యాదలను పాటించాలనేది ఒకరు చెబితే తెలుసుకోవాల్సిన విషయం కాదు! తాము కంఫర్ట్ జర్నీని కోరుకుంటూనే.. చుట్టూ కూర్చున్న వారిని ఇబ్బంది పెట్టకుండా ప్రవర్తించాలి.. అందుకు తమ వంతు కృషి చేయాలి. అయితే.. తాజాగా డెల్టా విమానంలో ఓ వ్యక్తి అందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తించారు. ఇందులో భాగంగా ట్రే టేబుల్ పై డైపర్ మార్చారు!
అవును.. డెల్టా ఎయిర్ లైన్స్ లో ఓ ప్రయాణికుడితో పాటు ఒక శిశువుకు కూడా ప్రయాణిస్తోంది. ఈ క్రమంలో.. విమానం మధ్యలో శిశువుకు డైపర్ మార్చాల్సి వచ్చింది. ఈ సమయంలో ఆ పని కోసం లేచి టాయిలెట్ కి వెళ్లాల్సిన సదరు వ్యక్తి.. ట్రే టెబుల్ పైనే డైపర్ మార్చే పనికి పూనుకున్నాడు. ఈ సమయంలో ఈ విషయం గ్రహించిన విమాన సహాయకురాలు అతని వద్దకు వచ్చి, వద్దని వారించింది.
డైపర్ మార్చడానికి టాయిలెట్ లో టెబుల్ ఉంది సర్ అని చెప్పింది. ఆ సమయంలో కనీసం తల ఎత్తి ఆమె వైపు కూడా చూడని సదరు తండ్రి.. ఆల్ మోస్ట్ అయిపోయింది.. ఇక్కడే కంఫర్ట్ బుల్ గా ఉంది అని ప్రతిస్పందించాడు. అనంతరం మురికి డైపర్ ను సీటు పాకెట్ లో కాసేపు ఉంచి.. ఆ తర్వాత టాయిలెట్ కు తీసుకెళ్లాడు. తర్వాత తిరిగి వచ్చి టేబుల్ పై ఎలాంటి శానిటైజర్ వాడకుండానే పైకి ఫోల్డ్ చేశాడు.
ఆ సమయంలో విమానంలో డైపర్ మార్చిన దుర్వాసన వస్తూనే ఉందని చెబుతున్నారు. ఇది ఏమాత్రం సహేతుకమైన ప్రవర్తన కాదని అంటున్నారు. ఈ ఘటనలో తండ్రి ప్రవర్తన స్పష్టమైన గీతను దాటిందని అంటున్నారు. వాస్తవానికి ట్రే టేబుల్ పై డైపర్ లు మార్చడం ఇదే తొలిసారి కాదు! ఇలాంటి ఘటనలు ఇంటర్నెట్ లో పలు వెల్లువెత్తాయి. అయితే.. ఇది అత్యంత అసహ్యకరమైన పద్దతి అనే చెప్పాలి!
వాస్తవానికి చిన్న పిల్లలతో విమాన ప్రయాణం చేయడం అంత సులభం కాదనే చెప్పాలి. ముఖ్యంగా వారు అలసిపోయినప్పుడు, చిరాకుగా ఉన్నప్పుడు, ప్రధానంగా డైపర్ మార్చాల్సిన అవసరం వచ్చినప్పుడు ఈ సమస్య స్పష్టంగా కనిపిస్తుంది. ఆ సమయంలో తల్లితండ్రులు ఉన్నంతలో హుందాగా ప్రవర్తించాలని.. తమ తోటి ప్రయాణికుల సౌకర్యాన్ని గుర్తుంచుకోవాలి!
ఒక వేళ మీరు చిన్న పిల్లలతో ప్రయాణిస్తుంటే.. చాలా విమానాల్లో టాయిలెట్ లో దుస్తులు మార్చుకునే బల్లలు ఉంటాయని తెలుసుకోండి. ఒక వేళ అవి అందుబాటులో లేకపోతే... విమాన సహాయకుడిని వారికి నచ్చిన ఆల్టర్నేటివ్ కోసం అడగండి. అంతే తప్ప ట్రే టెబుల్ ని మాత్రం ఉపయోగించొద్దు. ఇంట్లో డైనింగ్ టేబుల్ కి ఇచ్చే విలువ, విమానాల్లోని ట్రే టేబుల్ కీ ఇవ్వండి!