ఢిల్లీ పేలుడు: పీఎం ఫస్ట్ రియాక్షన్.. ఏమన్నారంటే
ఢిల్లీలో సోమవారం రాత్రి జరిగిన కారు పేలుడు ఘటనలో దాదాపు 13 మంది మృతి చెందారని.. జాతీయ మీడియా పేర్కొంది.;
ఢిల్లీలో సోమవారం రాత్రి జరిగిన కారు పేలుడు ఘటనలో దాదాపు 13 మంది మృతి చెందారని.. జాతీయ మీడియా పేర్కొంది. మరింత మంది ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై గత రాత్రే.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా రియాక్ట్ అయ్యారు. వెంటనే ఆయన ఘటనా ప్రాంతాన్ని కూడా సందర్శించారు. ఇలాంటి దాడులు పిరికి చర్యలని పేర్కొన్నారు. ఇక, ప్రస్తుతం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.
ఇదిలావుంటే.. కారు పేలుడు ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రియాక్ట్ అయ్యారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ పేలుడు తనను తీవ్రంగా కలచి వేసిందన్న ఆయన.. దీని వెనుక ఎవరున్నా వదిలేది లేదని తేల్చి చెప్పారు. దేశ ప్రజలంతా ధైర్యంగా ఉండాలని..ఈ ఘటన వెనుక ఎలాంటి వారు ఉన్నా ఉపేక్షించబోమని తేల్చి చెప్పారు. దేశం యావత్తు ఒక్కటిగా ఉందని.. ఇలాంటి దాడులకు పాల్పడిన వారిని కఠినంగా అణిచి వేస్తామని చెప్పారు.
ఆత్మాహూతి దాడేనా?
ఢిల్లీ కారుపేలుడు ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ ఐఏ) విచారణను ముమ్మరం చేసింది. కారు యజమానిగా భాఆవిస్తున్న తారిఖ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా ఘటన ప్రాంతం వద్ద ఉన్న అన్ని సీసీకెమెరాలను పరిశీలించారు. ఆత్మాహుతి దాడిగా భావిస్తున్నట్టు జాతీయ మీడియాకు అధికారు లు తెలిపారు. ఉద్దేశ పూర్వకంగానే దీనిని అమర్చినట్టు తెలిపారు. ఫరీదాబాద్‌లో అరెస్టు చేసిన కొందరికి ఈ ఘటనతో ప్రత్యక్ష సంబంధం ఉందన్నారు.
హైదరాబాద్ డాక్టర్ మొయిద్దీన్‌ను కూడా పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈయన నుంచి మరింత సమాచారం సేకరిస్తున్నారు. చైనాలో ఎంబీబీఎస్ చేసిన మొయిద్దీన్.. హైదరాబాద్ కేంద్రంగా ఉగ్రవాదులతో కలిసి పనిచేస్తున్నట్టు గుర్తించారు. రేసిన్ అనే పదార్థాన్ని జనసమర్థం ఉన్న ప్రాంతాల్లో తాగనీరు, చెరువుల్లో కలపడం ద్వారా సామూహిక మరణాలకు ప్లాన్ చేసినట్టు గుర్తించారు. మొత్తంగా ఢిల్లీ కారు పేలుడు ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతోంది.