• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  డాక్టర్లకు క్షమాపణలు...

డాక్టర్లకు క్షమాపణలు చెప్పిన జొమాటో వ్యవస్థాపకుడు.!

| జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ తన హెల్త్ డివైజ్ ‘టెంపుల్’పై విమర్శలు చేసిన వైద్యుల గురించి చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు. భారతీయ వైద్యులందరినీ ఒకేలా చూడటం తన తప్పని అంగీకరించారు. అయితే పరిశోధనలు చదవకుండానే పరికరాన్ని మోసమంటున్న కొందరు వైద్యులపై తన విమర్శలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

By - Priya Chowdhary Nuthalapti
Update: 2026-11-07 02:32 GMT

జొమాటో వ్యవస్థాపకుడు, ఎటర్నల్ మాజీ సీఈఓ దీపిందర్ గోయల్ మరోసారి వార్తల్లో నిలిచారు. తన కొత్త హెల్త్ డివైజ్ 'టెంపుల్'పై ప్రశ్నలు లేవనెత్తిన వైద్యుల గురించి గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి. దీంతో ఆయన తాజాగా భారతీయ వైద్యులకు క్షమాపణలు చెప్పారు. దేశంలోని డాక్టర్లందరినీ ఒకేలా చూడటం తన తప్పేనని అంగీకరించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

అసలు విషయానికి వస్తే..ఇటీవల దీపిందర్ గోయల్ టెంపుల్ పేరుతో ఓ కొత్త హెల్త్ ట్రాకింగ్ పరికరాన్ని తీసుకొచ్చారు. ఇది నుదుటిపై ధరించేలా ఉంటుంది. మెదడులో రక్తప్రసరణ, ఆక్సిజన్ స్థాయులు, శరీరంపై పడే ఒత్తిడికి సంబంధించిన వివరాలను గుర్తించగలదని కంపెనీ చెబుతోంది. అయితే ఈ పరికరం పనితీరుపై పలువురు వైద్యులు సందేహాలు వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి సరైన శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. అంతేకాకుండా రూ.85 వేల ధరపై కూడా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

ఈ విమర్శలకు స్పందిస్తూ నవంబర్ 5న గోయల్ ఎక్స్‌లో ఏడు అంశాలతో కూడిన సుదీర్ఘ పోస్టు పెట్టారు. టెంపుల్ ఒక మోసపూరిత ఉత్పత్తి కాదని, దానిని ఉపయోగించిన తర్వాత ప్రజలకే దాని పనితీరు అర్థమవుతుందని చెప్పారు. ఈ పరికరం తయారీ కోసం కంపెనీ 30 మిలియన్ డాలర్లు ఖర్చు చేసిందని, అందులో 20 మిలియన్ డాలర్లు తన సొంత డబ్బు అని వెల్లడించారు. అంతేకాకుండా ఎటర్నల్ సీఈఓ పదవిని వదిలి ఈ ప్రాజెక్టుపై దృష్టి పెట్టినట్లు తెలిపారు.

అయితే తన పోస్టులో భారతీయ వైద్యుల గురించి చేసిన వ్యాఖ్యలు మరింత వివాదానికి దారితీశాయి. తామే ఎంతో ఉన్నతులమని భావించే భారతీయ వైద్యులు తన పోస్టును పట్టించుకోవాల్సిన అవసరం లేదని కూడా వ్యాఖ్యానించారు. దీంతో పలువురు డాక్టర్లు ఆయన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

దీంతో తాజాగా మరో పోస్టు పెట్టిన గోయల్ తన తప్పును అంగీకరించారు. అందరు భారతీయ వైద్యులను ఒకే గాటన కట్టడం సరికాదని, అందుకు క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. తాను చాలామంది భారతీయ వైద్యులతో కలిసి పనిచేస్తున్నానని, తన అన్నయ్య కూడా డాక్టరేనని గుర్తుచేశారు.

అయితే తన విమర్శలు కొంతమంది వైద్యుల గురించి మాత్రమేనని స్పష్టం చేశారు. తన అభిప్రాయం ప్రకారం కొందరు డాక్టర్లు తమ వృత్తి కంటే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లుగా మారడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. కంపెనీ పరిశోధనలను పూర్తిగా చదవకుండానే టెంపుల్‌ను మోసమంటూ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

Tags:    
  • deepindergoyal 
  • zomato 
  • templedevice 
  • indiandoctors 
  • healthtech 

Similar News

విజయసాయిరెడ్డి క్లాస్...పార్టీ పేరూ క్లాసే !

2026-11-11 06:16 GMT

సరికొత్త క్యాబ్స్ : రేటు తక్కువ.. కార్లు కంఫర్ట్.. వియత్నం కార్లతో 30వేల జీతం..

2026-11-11 05:59 GMT

కాలేజీల్లో సినిమా ప్రమోషన్లకు తెలంగాణ ప్రభుత్వం చెక్?

2026-11-11 05:57 GMT

హెచ్1బీ వీసాదారులపై మరో పిడుగు.. ఐబీఎం షురూ చేసింది..

2026-11-11 04:56 GMT

టాప్ స్టోరి: న‌గ‌ర శివారులో స్టార్ హీరోల ఫామ్‌హౌస్‌ల విలాసాలు

2026-11-11 04:29 GMT

2008లో ఆస్ట్రేలియా వెళ్లిన భారతీయ యువకుడు.. ఇప్పుడు ఆయన సాధించిన ఘనత ఏంటో తెలుసా?

2026-11-11 04:28 GMT

ధర్మాన బ్రదర్స్ చేతుల్లో గుండ ఫ్యామిలీ పొలిటికల్ లైఫ్

2026-11-11 03:55 GMT

కోలగట్ల హవాకు చెక్ పడినట్లేనా ?

2026-11-11 03:55 GMT

జగన్ డెసిషన్ షాకింగ్ అంటున్న మహాసేన రాజేష్

2026-11-11 03:54 GMT

జగన్ గ్రౌండ్ లోకి దిగాల్సిందే...లేకపోతే కష్టమేనట !

2026-11-11 03:52 GMT

ఏపీ జనం తీర్పు... గుప్పిట పట్టి ఉండిపోయిందా ?

2026-11-11 01:48 GMT

బొత్స కూతుర్ని ఓడించిన నీరజకే జెడ్పీ పట్టం ?

2026-11-11 01:47 GMT

Copyright @2026

Powered by Blink CMS