కాంగ్రెస్ మంత్రి పదవి ఆఫర్ చేసినా కాదన్నాను.. ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు

ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ఉండటమే తనకు ఇష్టమన్నారు. తనకు రాజకీయ భవిష్యత్ కల్పించిన కేసీఆర్ కు రుణపడి ఉంటానని పేర్కొన్నారు.

Update: 2024-05-10 12:14 GMT

వరంగల్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు కాంగ్రెస్ మంత్రి పదవి ఇస్తానన్న తాను పార్టీ మారలేదన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేస్తానని చెప్పారు. ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ఉండటమే తనకు ఇష్టమన్నారు. తనకు రాజకీయ భవిష్యత్ కల్పించిన కేసీఆర్ కు రుణపడి ఉంటానని పేర్కొన్నారు.

కడియం శ్రీహరి మోసకారి అన్నారు. అటు చంద్రబాబు ఇటు కేసీఆర్ ను మోసం చేసి కాంగ్రెస్ లో చేరారన్నారు. రాజకీయ భిక్ష పెట్టిన వారినే కాదని పార్టీ మారడం సరికాదన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలన్నారు. అంతేకాని పదవులు వస్తాయనే ఉద్దేశంతో కాంగ్రెస్ లోకి జంపు కావడం స్వార్థంతో కూడుకున్నదే అన్నారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పార్టీ మారితే రూ. వంద కోట్లు ఇస్తామని ఆఫర్ ఇచ్చినా కాదన్నానన్నారు. తనకు డబ్బు ముఖ్యం కాదని రాజకీయ విలువలకే ప్రాధాన్యం ఇస్తున్నానన్నారు. అందుకే తాను పార్టీ మారలేదని తన మనసులోని మాట వెల్లడించారు. అధికారంలో లేకున్నా కార్యకర్తలను కాపాడుకోవడం తన ధర్మమన్నారు.

తాను ఎప్పుడు కూడా చంద్రబాబు, ఎన్టీఆర్ ను తిట్టలేదన్నారు. తాను తెలుగుదేశంలో కూడా సుదీర్ఘ కాలం పనిచేశానన్నారు. జీవితాంతం కేసీఆర్ వెంటే ఉంటానని ధీమా వ్యక్తం చేశారు. ఇతరుల మాదిరి పార్టీ మారే వైఖరి తనది కాదని చెప్పారు. మా కార్యకర్తల జోలికి వస్తే ఊరుకోం. ఉరికించి తరిమికొడతాం. కాంగ్రెస్ పార్టీ నేతలు జాగ్రత్తగా ఉండకపోతే వారికే నష్టమని పేర్కొన్నారు.

బీఆర్ఎస్ నేతలకు వలలు వేస్తూ వారిని లాగుదామని చూస్తున్నారు. దీనికి మేం కూడా బదులు తీర్చుకుంటాం. మీ నాయకులను కూడా మా పార్టీలోకి తీసుకుంటాం. అప్పుడు ఏం చెబుతారో చూద్దాం అంటూ సవాలు విసిరారు. కాంగ్రెస్ నేతల తీరును తప్పుబడుతున్నారు. బీఆర్ఎస్ నేతలను కెలకొద్దని సూచించారు. దీంతో తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటామని హెచ్చరించారు.

Tags:    

Similar News