జైలు గోడల మధ్య దర్శన్ ఉండాల్సిందేనా.. సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు!

ఇక సుప్రీం కోర్టులో.. న్యాయమూర్తి జస్టిస్ జేబీ పార్దీవాలా నేతృత్వంలో ధర్మాసనం విచారణ చేపట్టగా.. ఇరుపక్షాల వాదోపవాదనలను విన్న తర్వాత సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది.;

Update: 2025-08-14 10:37 GMT

కన్నడ స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్న దర్శన్ అభిమాని రేణుక స్వామి హత్య కేసులో నలిగిపోతున్న విషయం తెలిసిందే. ఏడాది కాలంగా ఈ కేసులో ఆయన ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు.. అలాంటి ఈయనకు ఇప్పుడు సుప్రీంకోర్టు మరో షాకింగ్ తీర్పు ఇచ్చింది. ఇక ఈ తీర్పును బట్టి చూస్తే.. దర్శన్ ఇకపై నాలుగు గోడల మధ్య ఉండాల్సిందే అని స్పష్టం అవుతోంది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

చిత్రదుర్గకి సంబంధించిన అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో దర్శన్ పై గత ఏడాది జూన్ 11వ తేదీన కేస్ ఫైల్ అయిన విషయం తెలిసిందే. అనారోగ్య సమస్యలతో బెయిల్ మీద బయటకు వచ్చారు దర్శన్. గత ఏడాది డిసెంబర్ 13వ తేదీన కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే తన కొడుకును కోల్పోయి తాము నరకం అనుభవిస్తుంటే.. హత్య చేసిన వ్యక్తులు మాత్రం ధైర్యంగా బయట తిరుగుతున్నారు అంటూ రేణుక స్వామి కుటుంబ సభ్యులు బెంగళూరు పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. దీంతో బెంగళూరు పోలీసులు హైకోర్ట్ తీర్పుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దర్శన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వేసిన పిటిషన్ నేడు విచారణకు వచ్చింది.

ఇక సుప్రీం కోర్టులో.. న్యాయమూర్తి జస్టిస్ జేబీ పార్దీవాలా నేతృత్వంలో ధర్మాసనం విచారణ చేపట్టగా.. ఇరుపక్షాల వాదోపవాదనలను విన్న తర్వాత సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. అందులో భాగంగానే దర్శన్ బెయిల్ ను కొట్టివేసింది. అంతేకాదు న్యాయస్థానం ముందు లొంగిపోవాల్సిందే అంటూ ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. ఇక సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హీరో దర్శన్ జైలు జీవితం గడపాల్సిందే అని స్పష్టమవుతోంది.

అసలు విషయంలోకి వెళ్తే.. కన్నడ హీరో దర్శన్ పలు చిత్రాలతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఆయనకు ఆల్రెడీ వివాహమైంది. పిల్లలు కూడా ఉన్నారు.. అయినా సరే ప్రముఖ నటి పవిత్ర గౌడతో రిలేషన్ కొనసాగించారు . ఈ విషయాన్ని పవిత్ర గౌడ తమ బంధానికి పదేళ్లు అంటూ.. దర్శన్ తో దిగిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. ఇది చూసిన దర్శన్ అభిమాని రేణుక స్వామి తట్టుకోలేక.. తమ అన్నయ్యకు అన్యాయం జరుగుతోంది.. వెంటనే వదిలి పెట్టాలని కోరుతూ అసభ్యకర పదజాలంతో పవిత్ర గౌడను దూషించారట. అంతేకాదు అభ్యంతరకరమైన పోస్ట్లు పెట్టి ఆమెను విసిగించినట్లు సమాచారం. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పవిత్ర గౌడ కక్ష పెట్టుకొని.. దర్శన్ తో కలిసి 15 మంది రౌడీలకు సుఫారీ ఇచ్చి మరీ రేణుక స్వామిని అత్యంత దారుణంగా హతమార్చినట్లు సమాచారం.

ముఖ్యంగా పోలీసులు ఈ విషయంపై 3 వేల కు పైగా పేజీలతో చార్జిషీటు ఫైల్ చేశారు. అందులో నిజా నిజాలు బయటపడ్డాయి. దీంతో ఏ వన్ గా పవిత్ర గౌడ , ఏ 2గా దర్శన్ ను చేర్చారు పోలీసులు. ఇక వీరందరికీ కూడా కర్ణాటక హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే దర్శన్ కి ఇచ్చిన బెయిల్ ను తిప్పికొడుతూ బెంగళూరు పోలీసులు సుప్రీంకోర్టులో కేసు వేయగా ఇప్పుడు ఆ కేసులో దర్శన్ జైలుకు వెళ్లేలా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినట్లు సమాచారం.

Tags:    

Similar News