ఏపీ వైపు దూసుకొస్తున్న సెన్యార్ తుఫాన్
ఇది 48 గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలో సెన్యార్ అనే తుఫానుగా బలపడనుందని పేర్కొంది. ఈ తుపాను ప్రభావం ఏపీ, తమిళనాడు, కేరళ తీరాలతో పాటు అండమాన్ దీవులపై తీవ్రంగా ఉండనుందని హెచ్చరిస్తోంది.;
మొంథా తుఫాను ఎంతలా భయపెట్టి వణికించిందో అంతా చూశారు. మొంథా సరిగ్గా అక్టోబర్ నెలాఖరు లో వచ్చింది. ఇపుడు మరో భారీ తుఫాన్ రాబోతోంది. దాని పేరు సెన్యార్. ఇది నెమ్మదిగా బలపడుతూ ఏపీ వైపుగా దూసుకుని వస్తోంది. దీని ప్రభావంతో ఈ నెలాఖరు నాటికి ఏపీలో అనేక జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని అధికారులు చెబుతున్నారు
వాయుగుండం తోనే :
మలక్కా జలసంధి ప్రాంతాల్లో వాయుగుండం ప్రస్తుతం కొనసాగుతోంది. ఇది 48 గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలో సెన్యార్ అనే తుఫానుగా బలపడనుందని పేర్కొంది. ఈ తుపాను ప్రభావం ఏపీ, తమిళనాడు, కేరళ తీరాలతో పాటు అండమాన్ దీవులపై తీవ్రంగా ఉండనుందని హెచ్చరిస్తోంది. ఇక ఏపీలో అయితే అనేక జిల్లాలలో ఈ నెల 29, 30 తేదీలలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు చేస్తోంది. ఇక డిసెంబర్ 2 వరకూ కూడా రాయలసీమ కోస్తాంధ్రాలలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడిస్తోంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో గురువారం నుంచి మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అంతే కాదు రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని పొలాలలో చేసే వ్యవసాయ పనులలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచిస్తోంది.
పంటలు భద్రపరచుకోవాలి "
ప్రస్తురం రబీ సీజన్ కి సంబంధించి వరి కోతలు అన్ని చోట్లా కొనసాగుతున్నాయి. దీంతో పంట నష్టపోకుండా ఉండేందుకు వ్యవసాయ శాఖ అధికారులు సూచనలు చేస్తున్నారు. అల్పపీడనాలు, వాయుగుండాల ప్రభావంతో పంటలు తడిసిపోకుండా ఉండేందుకు రైతులు వెంటనే ధాన్యం కుప్పలు వేసుకోవాలని, అలాగే అలాగే ధాన్యాన్ని తడవకుండా టార్పాలిన్లు కప్పి సురక్షితంగా భద్రపరచుకోవాలని సూచిస్తున్నారు. వర్షం నీటిలో కనుక ధాన్యం తడిచి రంగు మారకుండా చూసుకోవాలని గినజ్లు మోలెకెత్తకుందా నాణ్యత కోల్పోకుండా కూడా తగిన చర్యలు తీసుకోవాలి దిశా నిర్దేశం చేస్తున్నారు.
మంత్రి అచ్చెన్న సూచన :
ఏపీకి భారీ తుఫాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో రైతులు అంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కోరారు. అండమాన్ సముద్రంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం, వాయుగుండంగా మారి రానున్న 48 గంటల్లో పెను తుపానుగా బలపడే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు తెలిపారు. అదే సమయంలో రైతులు మత్య్సకారులు కూడా జాగ్రత్తగా ఉండాలని కోరారు ఏ మాత్రం పంట నష్టం జరగకుండా రైతులు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. అలాగే ఇప్పటికే వరి కోతలు పూర్తిచేసిన రైతులు, తమ ధాన్యాన్ని తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అచ్చెన్న కోరారు. ధాన్యం తడవకుండా కాపాడుకునేందుకు ప్రభుత్వం తరఫున రైతులకు ఉచితంగా టార్పలిన్ పట్టాలు పంపిణీ చేస్తున్నామని ఆయన వెల్లడించారు. రైతులంతా జిల్లా యంత్రాంగాన్ని సంప్రదించి వాటిని పొందవచ్చని ఆయన చెప్పారు అలాగే గ్రౌండ్ లెవెల్ లో వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో ఉండి తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలని మంత్రి వారిని ఆదేశించారు.