రేవంత్ ను అరెస్ట్ చేసి ముచ్చట తీర్చుకోండి

రేవంత్ రెడ్డినీ జైలుకు పంపించాలని ప్రధాని మోదీ భావిస్తున్నారని ఆరోపించారు.

Update: 2024-05-02 15:52 GMT

''ఇప్పటికే ఝార్ఖండ్ ముఖ్యమంత్రి, ఢిల్లీ ముఖ్యమంత్రి జైల్లో ఉన్నారు. ఇక అమిత్ షా కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ముచ్చటగా ముగ్గురు ముఖ్యమంత్రులు అవుతారు. అప్పుడు ముగ్గురు ముఖ్యమంత్రులు జైల్లో ఉన్నట్లు అవుతుంది’’ అని సీపీఐ నేత నారాయణ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి అన్నారు. రేవంత్ రెడ్డినీ జైలుకు పంపించాలని ప్రధాని మోదీ భావిస్తున్నారని ఆరోపించారు.

బీజేపీకి అనుకూలంగా ఉన్న ముఖ్యమంత్రులు దొంగలైనా వారు మంచివారేనని, ఆ పార్టీని వ్యతిరేకిస్తే మాత్రం జైలుకు పంపిస్తున్నారని నారాయణ ఆగ్రహం ప్రకటించారు.

ఈ దేశంలో దేశద్రోహం కింద మొదట అరెస్ట్ చేయాల్సి వస్తే మోదీని, తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాను అరెస్ట్ చేయాలని నారాయణ అన్నారు. నరేంద్ర మోదీ దేశంలో అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నాడని, ప్రతి కార్యకర్త తనను తాను అభ్యర్థిగా భావించుకొని కాంగ్రెస్ గెలుపు కోసం పని చేయాలని నారాయణ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఖమ్మం అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డికి మద్దతుగా ఆయన ప్రచారం చేశారు.

నగరిలో రోజా తమ మీద కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడిందని, అక్కడ ఆమె మొదట ఓడిపోతుందని, మోదీ మూడవసారి ప్రధాని అయ్యి, 400 సీట్లు వస్తే భారతదేశం పూర్తి హిందూ దేశంగా మారుతుందని నారాయణ అభిప్రాయపడ్డాడు.

Tags:    

Similar News