ఉప రాష్ట్రపతిగా రాధాకృష్ణన్...వ్యూహం అదే !

ఇక చూస్తే కనుక రాధాకృష్ణన్ ఎంపికకు అనేక సమీకరణలు దోహదపడ్డాయని అంటున్నారు.;

Update: 2025-08-18 04:03 GMT

మొత్తం మీద ఎన్డీయే కూటమి తన ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా సీపీ రాధాకృష్ణన్ ని ఎంపిక చేసింది. ఎన్నో పేర్లు తెర మీదకు వచ్చాయి. అయితే చివరికి ఈ కీలక పదవి ఆయనను వరించింది. సీపీ రాధాకృష్ణన్ ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్నారు. ఆయన తమిళనాడుకు చెందిన వారు తెలంగాణాకు కూడా కొంతకాలం ఇంచార్జ్ గవర్నర్ గా పనిచేశారు. ఎన్నో పేర్లు ఎంతో కసరత్తు చేసిన మీదట ఈ కీలక నిర్ణయాన్ని బీజేపీ పార్లమెంటరీ బోర్డు తీసుకుంది.

సంఘ్ తో అనుబంధం :

ఇక చూస్తే కనుక రాధాకృష్ణన్ ఎంపికకు అనేక సమీకరణలు దోహదపడ్డాయని అంటున్నారు. ఆయన దక్షిణాది వారు కావడం అందునా తమిళనాడుకు చెందిన వారు కావడం ఒక సమీకరణ. అంతే కాదు ఆయనకు రాష్ట్రీయ స్వయం సంఘ్ తో విడదీయరాని అనుబంధం కలిగి ఉండడం మరో సమీకరణంగా చూస్తున్నారు. ఇక రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒడిశా వాసి, ఆమె ఉత్తరాది వాసిగా ఉన్నారు. దాంతో దక్షిణాది నుంచి ఈసారి ఎంపిక చేయాలని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారు అని అంటున్నారు.

రాజ్ నాథ్ పేరు కూడా :

ఒక దశలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ పేరు కూడా పార్లమెంటరీ బోర్డులో చర్చకు వచ్చింది. అంతా కూడా సంపూర్ణ అంగీకరం తెలిపారని కూడా భోగట్టా. అయితే రాజ్ నాధ్ సింగ్ మాత్రం దానికి నిరాకరించడంతో రాధా క్రిష్ణన్ కి ఈ పదవి దక్కింది అని అంటున్నారు. ఆయన మీద కేంద్ర పెద్దలకు ఎంతో గురి ఉంది. అందుకే ఆయనను గవర్నర్ గా తాము పాలిస్తున్న కీలక రాష్ట్రం అయిన మహారాష్ట్రకు నియమించారు తెలంగాణాకు కొంతకాలం పాటు బాధ్యతలు చూసేలా కూడా అప్పగించారు. ఇక ఇపుడు చూస్తే రాజ్యాంగం ప్రకారం ఎంతో కీలకం అయిన ఉప రాష్ట్రపతి పదవిని కట్టబెడుతున్నారు.

రాజ్యసభలో కీలకం :

రాజ్యసభలో ఎన్డీయే బొటా బొటీ మెజారిటీ ఉంది. రానున్న రోజులలో అది తగ్గవచ్చు కూడా. ఎపుడు ఎలాంటి పరిణామాలు జరిగినా కూడా రాజ్యసభలో సునాయాసంగా బిల్లులు పాస్ కావాల్సి ఉంది. అందుకే అన్ని బాధ్యతలను నిభాయించుకుని అటు విపక్షాన్ని కూడా బ్యాలెన్స్ చేస్తూ రాజ్యసభ చైర్మన్ గా సరైన తీరులో వ్యవహరించాల్సిన వారికే ఈ పదవి అని ఒక కొలమానంగా బీజేపీ పెద్దౌలు పెట్టుకున్నారు అని అంటున్నారు. దాంతోనే ఈ పదవికి రాధాకృష్ణన్ సరైన వారుగా గుర్తించి ఎంపిక చేశారు అని అంటున్నారు.

Tags:    

Similar News