మెదడుకు వృద్ధాప్యం.. కారణం తెలిస్తే షాక్!

ఐదేళ్ల క్రితం మానవాళిని అతలాకుతలం చేసిన మహామ్మారి... ఇప్పుడు కూడా ఏదో ఒక విధంగా తన ప్రతాపం చూపుతూనే ఉందా? కరోనా దుష్ఫలితాలపై జరుగుతున్న అధ్యయనాల్లో వెల్లడవుతున్న సమాచారం ఆందోళనకు గురిచేస్తోంది.;

Update: 2025-07-26 08:30 GMT

ఐదేళ్ల క్రితం మానవాళిని అతలాకుతలం చేసిన మహామ్మారి... ఇప్పుడు కూడా ఏదో ఒక విధంగా తన ప్రతాపం చూపుతూనే ఉందా? కరోనా దుష్ఫలితాలపై జరుగుతున్న అధ్యయనాల్లో వెల్లడవుతున్న సమాచారం ఆందోళనకు గురిచేస్తోంది. కరోనా ఇన్‌ఫెక్షన్ ఏ స్థాయిలో ఉందన్న విషయంతో ప్రమేయం లేకుండా మహమ్మారి బారిన పడిన వ్యక్తుల మెదడు వేగంగా ముసలితనానికి గురవుతోందని, వయసుకు తగ్గట్లు కాకుండా ఎక్కువ వార్థక్యంతో ఉన్నట్లు తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. కోవిడ్ బారిన పడిన 432 మంది మెదడు స్కాన్ చేయగా, మహమ్మారికి ముందు.. ఆ తర్వాత భిన్నమైన ఫలితం వచ్చినట్లు చెబుతున్నారు.

ఇదే సమయంలో 996 మంది ఆరోగ్య వంతుల మెదడను స్కాన్ చేసినట్లు పరిశోధకులు చెబుతున్నారు. వీరితో పోలిస్తే వ్యాధిబారిన పడినవారి మెదడు ఐదున్నర నెలలు ఎక్కువగా వృద్ధాప్యానికి గురైనట్లు గుర్తించారు. కరోనా పీడితులు ఏకాంతంలో గడపాల్సిరావడం, అనిశ్చిత పరిస్థితి ఎదుర్కోవాల్సిరావడం ఇందుకు కారణాలు కావొచ్చని అధ్యయనకర్తలు పేర్కొన్నారు. మహమ్మారి బారిన పడిన వయోవృద్ధులు, పురుషులు, నిరుద్యోగులు, తక్కువ ఆదాయం కలిగిన వారు తగినంతగా చదువుకోనివారు, ఇతర బలహీన నేపథ్యం కలిగినవారి మెదడులో ప్రస్ఫుటమైన మార్పులు సంభవించాయని గుర్తించారు.

మెదడు వార్థక్యానికి గురైనప్పుడు వ్యక్తుల ఆలోచనలు మసకబారడం, సమాచార విశ్లేషణ, సేకరణ, అవగాహనకు కారణమైన దారుణశక్తి కోల్పోవడం, ఏకాగ్రత సన్నగిల్లడం వంటి లక్షణాలు ప్రదర్శిస్తారని పరిశోధకులు చెబుతున్నారు. కరోనా సోకిన వారిలో ఈ లక్షణాలు ఎక్కువగా గమనించినట్లు వారు పేర్కొంటున్నారు.

Tags:    

Similar News