భూమిని చల్లబరచడానికి శాస్త్రవేత్తల వినూత్న ఆలోచన

భూమి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దీంతో మన భూమి వేడెక్కుతోంది. ఈ సమస్యను తగ్గించడానికి శాస్త్రవేత్తలు సరికొత్త ప్రణాళికలు వేస్తున్నారు.;

Update: 2025-06-08 01:30 GMT

భూమి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దీంతో మన భూమి వేడెక్కుతోంది. ఈ సమస్యను తగ్గించడానికి శాస్త్రవేత్తలు సరికొత్త ప్రణాళికలు వేస్తున్నారు. తాజాగా అలాంటి ఒక వినూత్నమైన ఆలోచన తెరపైకి వచ్చింది. భూమిని చల్లబరచడానికి ఒక ప్రొఫెసర్ ఇచ్చిన సూచన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తాజాగా వచ్చిన ఆలోచన ప్రకారం భూమి ఉపరితలంలో 1శాతం ప్రాంతాన్ని తెల్లటి పెయింట్‌తో కవర్ చేయాలి. ఇది భూమిని చల్లబరచడానికి ఒక మంచి పరిష్కారం అవుతుందని ఆ ప్రొఫెసర్ సూచించారు.

ఈ తెల్లటి పెయింట్ 98శాతం సూర్యరశ్మిని తిరిగి అంతరిక్షంలోకి పంపించగలదని, దీని ద్వారా భూమిపై వేడి తగ్గి ప్రపంచ ఉష్ణోగ్రతలు తగ్గుతాయని ఆయన తెలిపారు. ఈ పని కోసం సుమారు 139 బిలియన్ గ్యాలన్ల పెయింట్ అవసరం అవుతుందని అంచనా వేశారు. ఇది చాలా పెద్ద పని అయినప్పటికీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలను తగ్గించడానికి ఇదొక మంచి ఆలోచనగా భావిస్తున్నారు.

ఈ ఆలోచన వినడానికి వింతగా ఉన్నా, భూమిని చల్లబరచడానికి ఇలాంటి 'జియో ఇంజనీరింగ్' ఆలోచనలు ఎప్పటినుంచో ఉన్నాయి. అయితే, ఇంత పెద్ద మొత్తంలో పెయింట్‌ను ఉత్పత్తి చేయడం, దాన్ని భూమి ఉపరితలంపై విస్తరించడం వంటివి సాధ్యమేనా, దీని వల్ల పర్యావరణానికి ఇతర నష్టాలు ఏమైనా ఉంటాయా అనే విషయాలపై ఇంకా పరిశోధనలు, చర్చలు జరగాలి. భూమి వేడెక్కడాన్ని తగ్గించడానికి ఇది ఒక సరికొత్త ప్రయత్నంగా చెప్పుకోవచ్చు.

Tags:    

Similar News