• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  రేవంత్ వేటు ఎవరిపైన ?!

రేవంత్ వేటు ఎవరిపైన ?!

| బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారినే సస్పెండ్ చేయడం రేవంత్ ఉద్దేశం అన్న వాదన వినిపిస్తున్నది.

By - Tupaki Desk
Update: 2024-08-04 07:15 GMT

‘తెలంగాణ శాసనసభ నుండి ఒక ఐదారుగురిని సస్పెండ్ చేస్తే అంతా సమసిపోతుంది’’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో చేసిన వ్యాఖ్యల వెనక ఉద్దేశం ఏంటి ? అసలు రేవంత్ శాసనసభకు రాకుండా చేసే ఐదారుగురు మంది శాసనసభ్యులు ఎవరు ? అన్నది తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది.

బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారినే సస్పెండ్ చేయడం రేవంత్ ఉద్దేశం అన్న వాదన వినిపిస్తున్నది. శాసనసభలో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ నుండి ధీటైన ప్రశ్నలు, సమాధానాలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుండి సీఎం రేవంత్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి, కోమటిరెడ్డి సోదరులు మినహా మిగిలిన మంత్రులు తమ శాఖల అంశాల మీదనే స్పందిస్తున్నారు.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వాదనకన్నా బీఆర్ఎస్ వాదన ప్రజల్లోకి బలంగా వెళ్తుందన్న భావన కాంగ్రెస్ పార్టీలో, రేవంత్ లో ఉంది. గతంలో శాసనసభ, శాసనమండలి సభ్యుల ఉమ్మడి సమావేశంలో గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తున్న సమయంలో కాంగ్రెస్ శాసనసభ్యులుగా ఉన్న కోమటిరెడ్డి, సంపత్ కుమార్ లు హెడ్ ఫోన్లను విసిరికొట్టి దాడి చేయడంతో గవర్నర్ పక్కన ఉన్న అప్పటి శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ కు దెబ్బతగిలింది. దీంతో వారిద్దరిని సమావేశాల నుండి పూర్తిగా బహిష్కరించారు.

దానిని ఆసరాగా చేసుకుని శాసనసభ సమావేశాలలో బలంగా వాణిని వినిపిస్తున్న కేటీఆర్, హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులను సభ నుండి పూర్తిగా సస్పెండ్ చేస్తే బీఆర్ఎస్ వాదన బలహీనపడుతుంది అన్న ఆలోచనలో రేవంత్ ఉన్నట్లు తెలుస్తుంది.

దీంతో శాసనసభ సమావేశాలకు హాజరుకావడం లేదు అన్న అంశం మీద ప్రతిపక్ష నేత కేసీఆర్ ను కూడా సస్పెండ్ చేయాలన్న మరో ఆలోచన కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే సభలో ఎక్కడా బీఆర్ఎస్ నేతలు నిరసన తెలియజేయడం తప్ప దాడులకు యత్నించిన దాఖలాలు లేవు. స్పీకర్ విచక్షణ పరిధిలోనే సస్పెన్షన్ అవకాశం ఉంటుంది. మరి రేవంత్ మాటల వెనక అంతరార్దం ఏమిటి ? ఎవరిని సస్పెండ్ చేస్తారు ? ఎంతకాలం సస్పెండ్ చేస్తారు ? అన్న చర్చ రాజకీయ వర్గాలలో జోరుగా సాగుతున్నది.

Tags:    
  • Telanganaassembly 
  • Telanganassemblysession 
  • Congressparty 
  • Brsparty 
  • Bjp 
  • Revanthreddy 
  • DuddillaSridharBabu 
  • PonnamPrabhakar 
  • Ponguleti 
  • Komatireddybrothers 
  • Sampathkumar 
  • Ktr 
  • Harishrao 

Similar News

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

హైడ్రా రంగనాథ్ నెక్ట్స్ టార్గెట్ ఇదే..

2026-11-05 06:52 GMT

పాతపగలన్నీ మాని ట్రంప్ కు వేల కోట్లు ఇచ్చినా.. పాపం ఎలన్ మస్క్ పరిస్థితి ఇదీ

2026-11-05 06:37 GMT

ఇక.. 100 ప‌ర్సంట్ దూకుడే.. !

2026-11-05 06:27 GMT

అసెంబ్లీ కంటే ఘోర‌మా.. జ‌గ‌న్‌.. నెక్ట్స్ ఏంటి.. ?

2026-11-05 06:25 GMT

వైసీపీలో అంత‌ర్గ‌త పోరు.. నెల్లూరు మునక‌.. !

2026-11-05 06:23 GMT

Copyright @2026

Powered by Blink CMS