కాంగ్రెస్ స్లోగన్స్...మోడీకి బ్రహ్మాస్త్రాలు !

చిత్రంగా ఉంది కదూ. మోడీ కోసం కాంగ్రెస్ పనిచేయడమేంటి అని అనుకోవచ్చు. కానీ ఒక్కసారి చరిత్ర చూస్తే మాత్రం అదే నిజం అనిపిస్తుంది.

Update: 2026-10-28 07:30 GMT

చిత్రంగా ఉంది కదూ. మోడీ కోసం కాంగ్రెస్ పనిచేయడమేంటి అని అనుకోవచ్చు. కానీ ఒక్కసారి చరిత్ర చూస్తే మాత్రం అదే నిజం అనిపిస్తుంది. మోడీకి ప్రతీ అయిదేళ్లకూ ఒక బలమైన అద్భుతమైన నినాదాన్ని దగ్గరుండి మరీ కాంగ్రెస్ అందిస్తోంది అంటే ఆశ్చర్యం అయినా అదే నిజం అన్నట్లుగా విశ్లేషణలు ఉన్నాయి. మోడీని విమర్శిస్తున్నామని ఆయనని టార్గెట్ చేస్తున్నామన్న భ్రమలలో భ్రాంతిలో పడి కాంగ్రెస్ అధినాయకులు ఇస్తున్న స్లోగన్స్ మోడీ చేతిలో గన్స్ గా మారి తిరిగి కాంగ్రెస్ నే టార్గెట్ చేస్తున్నాయి. ఇది గత కొన్ని ఎన్నికల నుంచి వరసగా జరుగుతూ వస్తోంది. మోడీని విజేతగా మార్చేందుకు ఈ స్లోగన్స్ పదునైన ఆయుధాలుగా పనిచేస్తున్నాయి అన్నది కఠినమైన విశ్లేషణగా ఉంది.

మోడీ మార్క్ మోడల్ :

ఇక చాలా వెనక్కి వెళ్తే గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా మోడీని కాంగ్రెస్ పార్టీ గట్టిగానే టార్గెట్ చేసింది. దాంతో పాటు మోడీ మోడల్ అభివృద్ధి అంటూ సెటైరికల్ గా విమర్శలు చేసింది. సరిగ్గా దానినే తన నినాదంగా మార్చుకుని గుజరాత్ మోడల్ అంటూ 2014 లో నేరుగా జాతీయ రాజకీయాల్లోకి దిగిపోయిన మోడీ ప్రధాని పీఠం మీద కూర్చునేంతలా ఆ స్లోగన్ పనిచేసింది. మోడీ హయాంలో అభివృద్ధి జరగలేదు అని కాంగ్రెస్ చెప్పబోయింది. కానీ తన మీదకు విసిరిన ఆ రాళ్ళనే పూలుగా మార్చుకుని మోడీ గుజరాత్ మోడల్ అంటూ దేశం మొత్తం జనాలను ఆకట్టుకున్నారు. దటీజ్ మోడీ అనిపించారు. అలా తొలి అస్త్రం కాంగ్రెస్ ది వీగిపోయిన పరిస్థితి ఉంది.

చాయ్ వాలా అంటూ :

అంతే కాదు మోడీని చాయ్ వాలా అంటూ కాంగ్రెస్ నేతలు చేసిన విమర్శలను కూడా మోడీ 2014 లోక్ సభ ఎన్నికల్లో చాలా వ్యూహాత్మకంగా ఉపయోగించుకున్నారు. ఒక చాయ్ వాలాకు ఈ దేశాన్ని పాలించే అర్హత లేదా అంటూ ఆయన రివర్స్ ఎటాక్ చేశరు. అది జనాలకు కూడా ఎంతగానో నచ్చేసింది. ఇక చాయ్ పే చర్చ అంటూ మోడీ బీజేపీ సాగించిన ప్రచారం కూడా కాంగ్రెస్ కూశాలు కదిలించింది. కాంగ్రెస్ నాయకుడు మేధావి అయిన మణి శంకర్ అయ్యర్ మోడీని పట్టుకుని చాయ్ వాలా అన్న మాటలే బీజేపీకి కేంద్రంలో అధికార సోపానానికి వేదికగా మారాయి అన్న విశ్లేషణ ఉంది.

రాహుల్ కామెంట్స్ బూమరాంగ్ :

ఇక 2019 ఎన్నికలకు వచ్చేసరికి రాహుల్ గాంధీ మోడీని పట్టుకుని చౌకిదార్ చోర్ హై అన్నారు. ఆయన ఆయన కాపలాదారు కాదు చోర్ అంటూ తీవ్ర స్థాయిలో చేసినా ఈ వ్యాఖ్యలనే మోడీ అండ్ కో ఆ ఎన్నికల్లో విజయవంతంగా ఉపయోగించుకుని జనంలోకి వెళ్ళింది. తాను చౌకీదార్ నే అంటూ మోడీ చెప్పిన మాటలు సింపతీని క్రియేట్ చేశాయి. అంతే కాదు తన మీద కాంగ్రెస్ చేస్తున్న విమర్శలు ప్రచారాన్ని ఆయన గట్టిగానే ఎండగట్టారు, గాంధీల వంశీకులే రాజ్యాలు ఏలాలా అంటూ ఒక కొత్త పాయింట్ ని జనంలో చర్చకు పెట్టారు.మొత్తానికి ఇది కాంగ్రెస్ కి అతి పెద్ద బూమరాంగ్ గా మారి బీజేపీ ఘన విజయానికి కారణం అయింది.

లాలూ చేసిన వ్యాఖ్యలు :

ఇక 2024 ఎన్నికల వేళ ఇండియా కూటమిగా అంతా ఏర్పడి మోడీకి వ్యతిరేకంగా పోటీ చేశారు. ఆ కూటమిలో అతి ముఖ్య భాగస్వామి అయిన ఆర్జేడీ అధినేత బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ అయితే మోడీకి కుటుంబమే లేదు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దానికి బీజేపీ చాలా సక్సెస్ ఫుల్ గా తమకు అనుకూలంగా మార్చుకుంది. అవుని మోడీకి కుటుంబం లేదు, దేశ ప్రజలు అంతా ఆయన కుటుంబమే అని రివర్స్ ఎటాక్ చేస్తూ ఇండియా కూటమిని వెనక్కి తోసి మరీ ఆ ఎన్నికల్లో ఎన్డీయే వరసగా మూడవసారి గెలిచి అధికారం అందుకుంది. ఒక విధంగా ఇది మోడీకి కలసి వచ్చిన బలమైన నినాదం అయింది అని గుర్తు చేస్తారు.

ఖర్గే విమర్శలతో :

ఇక చూస్తే తాజాగా బీహార్ లోని పాట్నాలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మోడీ మీద ఘాటు విమర్శలు చేశారు. ఈ కామెంట్స్ ఇపుడు బీజేపీకి అంది వచ్చిన అస్త్రాలుగా మారుతాయా అన్న చర్చ సాగుతోంది. 2029 ఎన్నికల్లో బీజేపీకి ప్రస్తుతానికి అయితే ఏ రకమైన ఆయుధాలు లేవు, కాంగ్రెస్ మాత్రం వాటిని తయారు చేసి అందిస్తోంది. ఇపుడు వాటిని దగ్గర పెట్టుకుని జనంలో సెంటిమెంట్ అందించేలా తమకు అనుకూలంగా మార్చేలా రెడీ చేసేందుకు బీజేపీ టీం సిద్ధంగా ఉంది అని అంటున్నారు. మోడీ కహిన్ నహీ జయేగా అనేది బీజేపీ కొత్త నినాదం అవుతుంది అని కూడా జోస్యాలు చెబుతున్నారు.

ఇప్పటికే మోడీతో పాటు వారి పూర్వీకులను కూడా ఎందుకు విమర్శిస్తారు అని బీజేపీ గట్టిగానే కాంగ్రెస్ ని నిందిస్తోంది. ఇది ఇక్కడితో ఆగదు, తన కన్న వారిని కూడా విమర్శిస్తున్నారు అని మోడీ జనంలోకి వెళ్ళి దీని మీద బిగ్ డిబేట్ పెడితే మరోసారి కాంగ్రెస్ కి అది బూమరాంగ్ అవుతుందా అన్న చర్చ అయితే ఉంది. ఇంతకీ కాంగ్రెస్ పీఆర్ టీం మరీ ఇంత వీక్ నా లేక అది బీజేపీ చేతిలో అస్త్రాలను అందించేందుకే ఉందా అన్న సెటైర్లు అయితే పడుతున్నాయి.

Tags:    

Similar News