ఇండియాకు వస్తున్నా...కాక్రోచ్ పార్టీ అధినేత సంచలనం !
దేశాన్ని దేశ రాజకీయాలను భారీ షాక్ కి గురి చేసేలా సామాజిక మాధ్యమం ద్వారా సునామీ సృష్టించిన కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ ఈ నెల 6న ఇండియాకు వస్తున్నారు.
దేశాన్ని దేశ రాజకీయాలను భారీ షాక్ కి గురి చేసేలా సామాజిక మాధ్యమం ద్వారా సునామీ సృష్టించిన కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ ఈ నెల 6న ఇండియాకు వస్తున్నారు. ఈ మేరకు ఆయన వీడియో సందేశం ద్వారా తెలిపారు. తాను ఈ నెల 6న అమెరికా నుంచి తన సొంత గడ్డ మీద అడుగు పెట్టబోతున్నట్లుగా అభిజిత్ ప్రకటించడం విశేషం. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించిన అభిజిత్ గత నెల 16న కాక్రోచ్ జనతా పార్టీని స్థాపించి దేశ రాజకీయాలలో పెను సంచలనం రేపారు. ఈ ఆన్ లైన్ పార్టీకి అద్భుతమైన స్పందన లభించడం జెన్ జీ అంతా భారీగా ఫాలోవర్స్ గా మారి కాక్రోచ్ పార్టీకి జై కొట్టడం అందరికీ తెలిసిందే. ఆ మీదట కాక్రోచ్ పార్టీ సామాజిక ఖాతాలను కూడా మూసివేసిన నేపథ్యం అంతా చూశారు.
అరెస్టు చేస్తారంటూ :
అయితే తాను దేశంలో అడుగు పెడుతూనే తనను అరెస్టు చేస్తారేమో అని కూడా అభిజిత్ ఆ వీడియో సందేశంలో అనుమానం వ్యక్తం చేశారు. కానీ తాను దేనికీ భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు. తనను జైలుకు పంపించినా ఎలాంటి పరిణామాలు ఎదురైనా దానిని ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధపడే తాను స్వదేశానికి వస్తున్నట్లుగా అభిజిత్ తెలిపారు.
కేంద్ర మంత్రి రాజీనామా :
ఇదిలా ఉంటే దేశంలో నీట్ పరీక్షల ప్రశ్న పత్రం లీక్ అయినదుకు వివిధ కేంద్ర పరీక్షల నిర్వహణలో విఫలం అయినందున కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని అభిజిత్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఈ నెల 6వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తన మద్దతుదారులతో కలసి భారీ ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నట్లుగా అభిజిత్ ఆ వీడియో సందేశంలో పేర్కొన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం ఇంకా ఉందని తాను నమ్ముతున్నాను అని శాంతియుతమైన ఆందోళనలకు దేశంలో అవకాశాలు అనుమతులు ఉంటాయని తాను భావిస్తున్నట్లుగా అభిజిత్ తెలిపారు.
దేశ భవిష్యత్తు కోసమే :
తాను అమెరికాలో ఉంటే హాయిగా ఎన్నో ఉన్నత ఉద్యోగాలలో స్థిరపడేవాడిని అని చెప్పారు. అయితే తాను తన దేశం దాని భవిష్యత్తు కోసం ఆలోచించే ఇండియా వస్తున్నాను అన్నారు. ఎవరో వచ్చి ఏదో చేస్తారు అని ఆలోచించే కన్నా బొద్దింకలు అంతా కలసి శాంతియుతంగా ఉద్యమించి తమ తల రాతలను మార్చుకోవాలని అభిజిత్ పిలుపు ఇచ్చారు. భవిష్యత్తుని కాపాడుకోవడానికి తనతో కలసి చేతులు కలపాలని ముందుకు అంతా రావాలని అభిజిత్ కోరుతున్నారు. మొత్తానికి అభిజిత్ రాక అయితే ఇపుడు సంచలనంగానే మారబోతోంది. జెన్ జీ అంతా ఆయన వెంట ఉంటారా ఆయన వచ్చాక కేవలం నిరసనతోనే సరిపెడతారా లేక ఆన్ లైన్ పార్టీని కాస్తా అసలైన పార్టీగా మార్చి దేశంలో అధికార పక్షంతో ఢీ కొడతారా అన్నది అతి పెద్ద చర్చగా ఉంది. మొత్తానికి కాక్రోచ్ పార్టీ నిన్నటి దాకా ఆన్ లైన్ సెన్షేషన్. ఇపుడు ఆఫ్ లైన్ లో రియల్ తెర మీద అభిజిత్ తో కలసి చేసే పోరాటం ఎలా ఉంటుందో ఈ నెల 6న అంతా చూడవచ్చు అని అంటున్నారు.