సీఎం రేవంత్ రెడ్డి జీతం.. దేశంలోనే ఏ సీఎంకీ లేనంత!
సమాచార హక్కు చట్టం కింద ఎవరైనా అడిగితే వెంటనే ఇవ్వాల్సిన నేపథ్యంలో ఈ విషయంపై ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చింది.;
తెలంగాణలో కొత్తగా అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అనుముల రేవంత్‌రెడ్డి జీతం విష యం ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇంకా ఆయన ఈ పదవిని స్వీకరించి నెలరోజులు కాకపోయినా..తాజాగా ఆర్థిక శాఖ సీఎం సహా మంత్రుల వేతనంపై కసరత్తు ముమ్మరం చేసింది. సమాచార హక్కు చట్టం కింద ఎవరైనా అడిగితే వెంటనే ఇవ్వాల్సిన నేపథ్యంలో ఈ విషయంపై ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చింది.
దీని ప్రకారం.. ప్రస్తుతం రేవంత్‌రెడ్డి తీసుకోబోయే వేతనం..దేశంలో ఏ ముఖ్యమంత్రీ తీసుకోనంత ఉందని తెలుస్తోంది. అదేవిధంగా మంత్రులకు కూడా.. అలానే వేతనాలు ఉండనున్నాయి. వాస్తవానికి కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే.. మంత్రులు, సీఎం వేతనాలను భారీగా పెంచేసుకున్నారు. ఒకేదశలో 100 శాతం పెంచారు. దీనిపై విమర్శలు వచ్చినా.. ఆయన ఖాతరు చేయలేదు. మంత్రులు సంతృప్తిగా గౌరవంగా పనిచేయాలంటే.. ఈ మాత్రం పెంపు ఉండాలని అప్పట్లో కేసీఆర్ సభలోనే చెప్పారు.
దీంతో తెలంగాణ ఏర్పడినప్పుడు ఎమ్మెల్యే జీతం 12 వేల రూపాయలు ఉండగా.. కేసీఆర్ దానిని 20 వేలకు పెంచారు. తర్వాత.. తర్వాత మరింత పెంచుకుంటూ వెళ్లారు. నియోజకవర్గ అలవెన్సులు రూ.83,000 నుంచి రూ.2.3 లక్షలు అయ్యాయి. ఈ లెక్క ప్రకారం 163% పెరిగి తెలంగాణలోని ప్రతి ఎమ్మెల్యే దేశంలోనే ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేల కంటే అత్యధిక వేతనాన్ని పొందుతున్నారు.
ఇప్పుడు లెక్కలు ఇవీ..
సీఎం రేవంత్ వేతనం = రూ.4.21 లక్షలు
స్పీకర్ గడ్డం ప్రసాద్ జీతం = రూ.4.11 లక్షలు
మంత్రులుగా ఉన్నవారికి జీతం = రూ..3.55 లక్షలు
ఎమ్మెల్యేల వేతనం = రూ.35 వేలు
ఇతర అలవెన్సులు
+ వాహన రుణాలు రూ.40 లక్షలు
+ ఏవ్యాధికైనా ఉచిత వైద్యం
+ ఆఫీసు ఖర్చులకు ఎమ్మెల్యేలకు నెలకు 15 వేలు
+ మంత్రులకు ఆఫీసు ఖర్చు = 50 వేలు
+ ముఖ్యమంత్రి ఆఫీసు నిర్వహణ ఖర్చు = 3 లక్షలు
+ స్పీకర్ ఆఫీసు నిర్వహణ ఖర్చు = 3 లక్షలు
+ ప్రతి ఆరు మాసాలకు రెనోవేషన్ కోసం = 1.5 లక్షలు