• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పౌర విమానాలపై నుంచి అగ్ని...

పౌర విమానాలపై నుంచి అగ్ని గోళాలు... అప్రమత్తమైన పైలట్లు!

| ప్రస్తుతం ప్రపంచం ముందు భారీ యుద్ధం పొంచి ఉందనే చర్చ తీవ్రంగా మొదలైన సంగతి తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2024-11-23 01:30 GMT

ప్రస్తుతం ప్రపంచం ముందు భారీ యుద్ధం పొంచి ఉందనే చర్చ తీవ్రంగా మొదలైన సంగతి తెలిసిందే. మరోపక్క.. మూడో ప్రపంచ యుద్ధం ఇప్పటికే మొదలైనట్లే అని ఉక్రెయిన్ మాజీ సైనికాధికారి తెలిపారు. ఈ సమయంలో ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు పౌర విమానాలకు ప్రాణాంతకంగా మారాయనే భయంకరమైన విషయం తెరపైకి వచ్చింది.

అవును... ఇజ్రాయెల్ పై అక్టోబరులో ఇరాన్ పలు క్షిపణులను ప్రయోగించిన సంగతి తెలిసిందే. వీటిలో రెండు క్షిపణులు ఇజ్రాయెల్ ప్రధాని నివాసానికి సమీపంలో పడ్డాయనే కథనాలు వచ్చాయి! అయితే.. ఇరాన్ ప్రయోగించిన ఆ క్షిపణులు పౌర విమానాలకు ప్రాణాంతకంగా మారిన విషయం తాజాగా వెల్లడింది.

ఆ సమయంలో ఈ మార్గంలో సుమారు డజను విమానాలు ఉన్నట్లు తెలిసింది. ఈ మేరకు వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనంలో కీలక విషయాలు వెల్లడించింది. ఇందులో భాగంగా... ఇజ్రాయెల్ పై అక్టోబర్ లో ఇరాన్ ప్రయోగించిన వాటిలో సుమారు 200 బాలిస్టిక్ మిసైల్స్ పౌర విమానాలపై నుంచి ఎగురుతూ వెళ్లినట్లు తెలిపింది.

ఆ సమయంలో ఈ విమానాలన్నీ ఇరాన్, ఇరాక్ గగనతలంలో ఉన్నాయని తెలిపింది. పైగా.. వాటిని కొంతమంది పైలట్లు, ప్యాసింజర్లు స్వయంగా చూసినట్లు వెల్లడించింది. అయితే... ఈ సమయంలో ఇరాన్ నుంచి విమానాలకు ఎలాంటి హెచ్చరికలు లేవని.. అయినప్పటికీ పరిస్థితిని పసిగట్టిన చాలామంది పైలట్లు మార్గాలను మళ్లించుకున్నారని పేర్కొంది.

కాగా.. అక్టోబర్ మొదటి వారంలో ఇజ్రాయెల్ పై ఇరాన్ భారీగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిన సంగతి తెలిసిందే. వీటిని ఇజ్రాయెల్ ఐరన్ డోం వ్యవస్థ పూర్తిగా అడ్డుకోలేకపోయింది. "ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 2" పేరిట ఈ దాడులు జరిపినట్లు ఇరాన్ ప్రకటించింది.

Tags:    
  • Ballisticmissiles 
  • Civilianaircraft 
  • Wallstreetjournal 
  • Israeliranwar 
  • Israelmissiles 
  • Operationtruepromise2 

Similar News

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS