• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  తెలంగాణలో భారీ స్కాం......

తెలంగాణలో భారీ స్కాం... ఆస్పత్రులపై సీఐడీ మెరుపు దాడులు!

| అవును... ఫేక్ బిల్లులు పెట్టి ముఖ్యమంత్రి సహయ నిధి (సీ.ఎం.ఆర్.ఎఫ్.) నిధులను మింగేశారనే ఆరోపణలపై కొన్ని ఆసుపత్రులకు తెలంగాణ నేర పరిశోధన విభాగం (సీఐడీ) షాకిచ్చింది.

By - Tupaki Desk
Update: 2024-08-26 10:40 GMT

తెలంగాణలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. సీ.ఎం.ఆర్.ఎఫ్. నిధుల కోసం నకిలీ బిల్లులు సృష్టించి సర్కారుకు టోపీ పెట్టారనే విషయం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. దీంతో... ఈ వ్యవహారంపై సీరియస్ అయిన ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. దీంతో... సీఐడీ మెరుపు దాడులకు దిగిందని తెలుస్తొంది!

అవును... ఫేక్ బిల్లులు పెట్టి ముఖ్యమంత్రి సహయ నిధి (సీ.ఎం.ఆర్.ఎఫ్.) నిధులను మింగేశారనే ఆరోపణలపై కొన్ని ఆసుపత్రులకు తెలంగాణ నేర పరిశోధన విభాగం (సీఐడీ) షాకిచ్చింది. ఇందులో భాగంగా... 28 ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులపై విస్తృతదాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా ఆసుపత్రులపై కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

సుమారు గత దశాబ్ధ కాలంగా ముఖ్యమంత్రి సహాయ నిధి దరఖాస్తుల్లో గణనీయమైన వ్యత్యాసాలను ఆడిట్ వెలికితీసిన తర్వాత సీఐడీ ఈ దాడులు ప్రారంభించిందని తెలుస్తోంది. పలువురు ఏజెంట్ల సహకారంతో సీ.ఎం.ఆర్.ఎఫ్. నిధులను మోసపూరితంగా పొందేందుకు నకిలీ పత్రాలను రూపొందించినట్లు విచారణలో తేలిందని అంటున్నారు.

దీంతో... ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన సీఐడీ.. సంబంధిత ఆస్పత్రి యాజమాన్యాలపై కేసులు నమోదు చేసిందని తెలుస్తోంది. విచారణలో భాగంగా... రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్, మెదక్ సహా పలు జిల్లాల్లో వేగంగా దాడులు నిర్వహించారని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ ఆరు ఎఫ్.ఐ.ఆర్.లు నమోదయ్యాయని సమాచారం.

వాస్తవనికి తెలంగాణ సచివాలయంలోని రెవెన్యూ శాఖలో పనిచేసే సెక్షన్ ఆఫీసర్ ఫిర్యాదుతో ఈ దర్యాప్తు ప్రారంభమైందని అంటున్నారు. ఇందులో భాగంగా... చాలా మంది ఆస్పత్రుల్లో ఎలాంటి చికిత్సా చేయించుకోకున్నా.. చేయించుకున్నట్లు బిల్లులు సృష్టించారని.. ఆ నకిలీ బిల్లులతో సీ.ఎం.ఆర్.ఎఫ్. కొసం దరఖాస్తు చ్చేస్తుకున్నారని అంటున్నారు.

ఈ వ్యవహారంలో ఆయా ఆస్పత్రి యాజమాన్యాలు, అక్కడ పనిచేసే సిబ్బంది తో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు సహకరించారని తెలుస్తోంది. ఈ వ్యవహారం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా భారీ నష్టం కలిగిందని అధికారులు చెబుతున్నారు!

Tags:    
  • CID 
  • Telanganagovernment 
  • Raids 
  • Hospitals 
  • CMRF 
  • Funds 
  • Revanthreddy 
  • Congress 
  • Revenuedepartment 

Similar News

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

హైడ్రా రంగనాథ్ నెక్ట్స్ టార్గెట్ ఇదే..

2026-11-05 06:52 GMT

పాతపగలన్నీ మాని ట్రంప్ కు వేల కోట్లు ఇచ్చినా.. పాపం ఎలన్ మస్క్ పరిస్థితి ఇదీ

2026-11-05 06:37 GMT

ఇక.. 100 ప‌ర్సంట్ దూకుడే.. !

2026-11-05 06:27 GMT

అసెంబ్లీ కంటే ఘోర‌మా.. జ‌గ‌న్‌.. నెక్ట్స్ ఏంటి.. ?

2026-11-05 06:25 GMT

వైసీపీలో అంత‌ర్గ‌త పోరు.. నెల్లూరు మునక‌.. !

2026-11-05 06:23 GMT

Copyright @2026

Powered by Blink CMS