షాకింగ్.. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా తరఫున ఆ దేశ సైన్యం..

ఇదే సమయంలో రష్యా తరఫున ఉత్తర కొరియా సైనికులు కూడా పోరాడారు. తాజాగా మరో కీలక విషయం బయటకు వచ్చింది.;

Update: 2025-04-09 07:51 GMT

మూడు సంవత్సరాల రెండు నెలలు.. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం మొదలుపెట్టి.. ఈ టైమ్ లో ప్రపంచంలో ఎన్నో మార్పులు జరిగాయి. కానీ, ఈ యుద్ధం మాత్రం ఆగడం లేదు. కేవలం వారం రోజుల్లొ ఉక్రెయిన్ ను ఓడిస్తామని రంగంలోకి దిగిన రష్యా ఇప్పటికీ కిందామీద అవుతోంది.

కొన్నివేల మంది సైనికులను ఉక్రెయిన్ యుద్ధంలో పోగొట్టుకుంది రష్యా. లక్షల కోట్ల రూపాయిలను వ్యయం చేసింది. అయినా యుద్ధం ఇంకా ముగియరాలేదు. ఈలోగా డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కావడంతో పరిస్ధితులు పూర్తిగా రష్యాకు అనుకూలంగా మారాయి.

భారత్, ఉ.కొరియా...

కాగా ఉక్రెయిన్ పై యుద్ధంలో తాము భారీగా సైనికులను నష్టపోవడం రష్యాకు తీవ్ర ఇబ్బందిగా మారింది. దీంతో ఇతర దేశాల నుంచి సైనికులను తీసుకుని యుద్ధ రంగంలోకి దింపుతోంది.

భారత్ నుంచి ఉద్యోగాల పేరిట కొందరిని తీసుకెళ్లి యుద్ధంలో దింపడం.. వారు అక్కడ పనిచేయలేక తీవ్ర సంఘర్షణతో వీడియోలు పంపిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో రష్యా తరఫున ఉత్తర కొరియా సైనికులు కూడా పోరాడారు. తాజాగా మరో కీలక విషయం బయటకు వచ్చింది.

ఉక్రెయిన్ పై రష్యా తరఫున యుద్ధంలో చైనా సైనికులు కూడా పాల్గొంటున్నట్లు తేలింది. ఈ మేరకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆరోపణలు చేశారు. తమ సైనికులు ఇద్దరు చైనా జాతీయలను అదుపులోకి తీసుకున్నారని తెలిపారు.

డాన్ బాస్ లోని డొనెట్స్క్ ప్రాంతంలో రష్యా సైనికులతో తమ బలగాలు యుద్ధం చేస్తుండగా.. చైనీయులు పట్టుబడ్డట్లు పేర్కొన్నారు. చైనీయు తమవాళ్లు వీడియో తీశారని వెల్లడించారు. వారి పర్సనల్ డేటా, బ్యాంకు కార్డుతో సహా ఇతర పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

పోరాడింది ఆరుగురు.. దొరికింది ఇద్దరు..

డొనెట్స్క్ ప్రాంతంలో ఆరుగురు చైనీయులతో పోరాడామని, ఇద్దరు పట్టుబడ్డారని జెలెన్ స్కీ తెలిపారు. అంతేకాదు.. రష్యా సైన్యంలో చైనా వారు ఎందరు ఉన్నారో తమకు తెలుసని చెప్పారు. ఇదంతా చూస్తుంటే యుద్ధం మరింత కాలం కొనసాగించే ఉద్దేశం పుతిన్ లో ఉందని తెలుస్తోందన్నారు. శాంతిని కోరుకునే దేశాలన్నీ దీనిపై స్పందించాలని కోరారు.

సొంతంగా వెళ్లారా??

భారతీయులు ఉద్యోగాల ఆశతో వెళ్లి రష్యా సైన్యంలో చిక్కుకున్నట్లే.. చైనావారూ యుద్ధ రంగంలో చిక్కుకున్నారని భావిస్తున్నట్లు ఉక్రెయిన్ భావిస్తోంది. దీనిపై చైనా స్పందించాని ఉక్రెయిన్ ప్రభుత్వం కోరుతోంది. తమ దేశీయులు ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొంటున్న విషయమై చైనా స్పందించలేదు. కానీ, అమెరికా మాత్రం నోరు విప్పింది. తాము కలవరపాటుకు గురయ్యామని, రష్యాకు చైనా మద్దతు ఉన్న సంగతి తేలిపోయిందని పేర్కొంది.

గతంలో ఇరాన్ యుద్ధంలో రష్యాకు సాయం చేసింది. బెలారస్ కూడా సైన్యాన్ని పంపింది. భారత్, ఉత్తర కొరియా, చైనా ప్రజలూ ఆ యుద్ధంలో పాల్గొన్నారని తేలింది.

Tags:    

Similar News