• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  చైనాలో రాకాసి గాలులు.....

చైనాలో రాకాసి గాలులు.. 50కేజీలు తక్కువ ఉంటే ఎగిరిపోవటమేనట

| రాకాసి గాలుల కారణంగా చైనా రాజధాని బీజింగ్ లో 300 చెట్లు నేలకూలిపోగా.. పలు వాహనాలు దెబ్బ తిన్నాయి.

By - Tupaki Desk
Update: 2025-04-13 06:26 GMT

రాకాసి గాలులు చైనీయులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఆ గాలుల తీవ్రత ఎంతంటే.. 50 కేజీల కంటే తక్కువ బరువు ఉన్న వారు.. బహిరంగ ప్రదేశాల్లో ఉంటే.. గాల్లో ఎగిరిపోయేంత రాకాసి గాలులు వీస్తున్నాయి. గడిచిన యాభై ఏళ్లలో చైనాలో ఎప్పుడూ లేనంత భారీ రాక్షస గాలులు వీస్తున్నాయి. గంటకు 93 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న ఈ గాలుల పుణ్యమా అని అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

ఈ రాక్షసి గాలుల కారణంగా వందలాది విమానాలు.. రైలు సర్వీసులు రద్దయ్యాయి. స్థానిక కాలమానం ప్రకారం శనివారం ఉదయం 11.30 గంటలకు బీజింగ్ లోని రెండు ప్రధాన విమానాశ్రయాల్లో 838 విమాన సర్వీసుల్ని రద్దు చేసినట్లుగా దిగ్గజ మీడియా సంస్థ రాయిటర్స్ వెల్లడించింది. ఈ ప్రచండ గాలుల నేపథ్యంలో ప్రముఖ పర్యాటక ప్రాంతాల్ని మూసేశారు. 50 కేజీల కంటే తక్కువ బరువు ఉండేవారు గాల్లో ఎగిరిపోతారంటూ మీడియాలో వచ్చిన వార్తల నేపథ్యంలో లక్షలాది మంది చైనీయులు ఇళ్లకే పరిమితమయ్యారు.

రాకాసి గాలుల కారణంగా చైనా రాజధాని బీజింగ్ లో 300 చెట్లు నేలకూలిపోగా.. పలు వాహనాలు దెబ్బ తిన్నాయి. వీధులన్ని నిర్మానుష్యమయ్యాయి. ఎయిర్ పోర్టు ఎక్స్ ప్రె్ సబ్ వై లైన్ సహా రైళ్ల సర్వీసులు.. హైస్పీడ్ రైల్ లైన్ సర్వీసుల్ని రద్దు చేశారు. పార్కుల్ని మూసేశారు. అంతేకాదు.. అత్యంత వేగంగా గాలులు వీసే అవకాశాల్ని గుర్తించేందుకు వీలుగా ఏర్పాట్లు చేయటమే కాదు.. ఎప్పటికప్పుడు ప్రజల్ని హెచ్చరిస్తున్నారు.

పెనుగాలుల వేగాన్ని 1 నుంచి 17 వరకు చైనా వాతావరణ శాఖ లెక్కగడుతోంది. పెనుగాలుల కారణంగా తీవ్రమైన నష్టం వాటిల్లింది. 12 లెవెల్ గాలులు వీస్తే మాత్రం తీవ్ర విధ్వంసం తప్పదని హెచ్చరిస్తున్నారు. ఈ వారాంతంలో గాలుల వేగం 11 నుంచి 13 లెవెల్ వరకూ ఉండొచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే మరింత విధ్వంసం ఖాయమని చెప్పక తప్పదు.

Tags:    
  • ChinaStorm 
  • MonsterWinds 
  • ExtremeWeather 
  • BeijingAlerts 
  • ClimateCrisis 
  • ChinaClimateCrisis 
  • NaturalDisaster 

Similar News

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

హైడ్రా రంగనాథ్ నెక్ట్స్ టార్గెట్ ఇదే..

2026-11-05 06:52 GMT

పాతపగలన్నీ మాని ట్రంప్ కు వేల కోట్లు ఇచ్చినా.. పాపం ఎలన్ మస్క్ పరిస్థితి ఇదీ

2026-11-05 06:37 GMT

ఇక.. 100 ప‌ర్సంట్ దూకుడే.. !

2026-11-05 06:27 GMT

Copyright @2026

Powered by Blink CMS