చైనా ఆయుధాలు: మరోసారి ఇరాన్ యుద్ధంలో అట్టర్ ఫ్లాప్
చైనాకు, మరేదేశానికి మధ్య యుద్ధం లేదు. యుద్ధ వాతావరణమూ లేదు. కానీ చైనా భయపడుతోంది. అమెరికా, ఇజ్రాయిల్ - ఇరాన్ మధ్య యద్ధం.;
చైనాకు, మరేదేశానికి మధ్య యుద్ధం లేదు. యుద్ధ వాతావరణమూ లేదు. కానీ చైనా భయపడుతోంది. అమెరికా, ఇజ్రాయిల్ - ఇరాన్ మధ్య యద్ధం. పాకిస్థాన్, ఆప్ఘనిస్థాన్ మధ్య బాంబు దాడులు . రష్యా, ఉక్రెయిన్ మధ్య ఏళ్ల తరబడి యుద్ధం. ఈ యుద్ధాల్లో చైనా ఎక్కడా ప్రత్యక్షంగాను, పరోక్షంగాను పాల్గొనలేదు. కేవలం తన మిత్రుదేశాలకు మద్దతుగా మాత్రమే మాట్లాడుతోంది. కానీ చైనాలో భయం మొదలైంది. ఎందుకు చైనా భయపడుతోందన్నది అసలు ప్రశ్న. చైనా భయపడుతోంది అమెరికాను చూసి కాదు. ఇంకేదో దేశాన్ని చూసి కాదు. తాను తయారు చేసిన ఆయుధాలను చూసి. ఎందుకు భయపడుతోందన్న వివరం ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మూడో స్థానంలో చైనా :
ప్రపంచ ఆయుధ తయరీ పరిశ్రమలో చైనా మూడో భారీ ఎగుమతిదారు. తక్కువ ధరకు ఆయుధాలను తయారు చేసి చాలా దేశాలకు అమ్ముతుంది. తక్కువ ధరకు అమ్ముతుంది కాబట్టే.. చైనా ఆయుధాలకు డిమాండ్ కూడా ఎక్కువ. అమెరికా మొదటి స్థానంలో ఉంది. కానీ అమెరికా ఆయుధాలు ఎక్కువ ధరకు విక్రయిస్తారు. అందుకే చైనా ఉత్పత్తులకు డిమాండ్ ఎక్కువ. అమెరికా ఖరీదైన ఆయుధాలను కొనుగోలు చేయలేని దేశాలు.. చైనా ఆయుధాలపైనే ఎక్కువగా ఆధారపడుతాయి. ఇదే చైనాను ఆయుధ అమ్మకాల్లో మూడో ఎగుమతిదారుగా నిలిపింది. పాకిస్థాన్, ఇరాన్, వెనుజువెలాతో పాటు చైనాతో సత్సంబంధాలు ఉన్న దేశాలు చైనా ఆయుధాలను కొనుగోలు చేస్తాయి. తక్కువ ధర.. ఎక్కువ డిమాండ్, మిత్ర దేశాలతో వ్యాపారం చైనాకు ప్రపంచ ఆయుధ తయారీ, అమ్మకాల్లో కొత్త మార్కెట్ ను ఏర్పరించింది.
ఇప్పుడు భయపడుతోంది
చైనా ఆయుధాలకు డిమాండ్ బాగానే ఉంది. తనకంటూ ప్రత్యేక మార్కెట్ సృష్టించుకుంది. కానీ ఇప్పుడు ఆ ఆయుధాలను చూసి భయపడుతోంది. ఎందుకంటే, యుద్ధ భూమిలో చైనా తయారు చేసిన ఆయుధాల పర్ఫార్మెన్స్ దారుణంగా ఉంది. వాటిని చూసే చైనా భయపడుతోంది. అమెరికా వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను కిడ్నాప్ చేసినప్పుడు.. చైనా ఆయుధాల పనితీరు పేలవంగా ఉంది. అమెరికా సేనలను చైనా ఆయుధాలు ఆపలేకపోయాయి. ఆ తర్వాత ఇరాన్- అమెరికా, ఇజ్రాయిల్ మధ్య యుద్ధంలో కూడా ఇదే పరిస్థితి. చైనా ఆయుధాల పనితీరు ఏమాత్రం కూడా చెప్పుకోదగినదిగా లేవు. ఇండియా, పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్ని సమయంలో కూడా చైనా ఆయుధాల పనితీరు ప్రపంచ దేశాల ముందు వాటి సామర్థ్యాన్ని, స్థాయిని బట్టలిప్పి నిలబెట్టాయి. అందుకే వాటిని చూసి చైనా భయపడుతోంది.
ఎందుకు భయపడుతోంది
తక్కువ ధరకు ఆయుధాలు తయారు చేసి తనకంటూ ప్రత్యేక మార్కెట్ సృష్టించుకున్న చైనా.. వాటి పనితీరులో మాత్రం ప్రపంచ దేశాల నమ్మకాన్ని పొందలేకపోతోంది. తయారు చేస్తోంది. అమ్ముతోంది. కానీ అసలు యద్ధం జరిగినప్పుడు వాటి పేలవ పనితీరు బయటపడుతోంది. దీంతో ప్రపంచ దేశాల్లో చైనా ఆయుధాలపై నమ్మకం పోతోంది. ఈ నమ్మకం పోతే చైనా మార్కెట్ కుచించుకుపోతుంది. మూడో స్థానంలో ఉన్న చైనా.. తన స్థానాన్ని కోల్పోవాల్సి ఉంటుంది. అదే సమయంలో వాటి నుంచి వచ్చే రెవెన్యూ కూడా కోల్పోవాల్సి వస్తుంది. అందుకే చైనా ఇప్పుడు తాను తయారు చేసిన ఆయుధాలను చూసి భయపడుతోంది.