'చంద్రబాబుని జైల్లో మానసికంగా వేధించారు'.. శివాజీ సంచలన వ్యాఖ్యలు!

అయితే.. అతనిపై భౌతిక దాడి చేయలేదు కానీ.. మానసికంగా దారుణంగా హింసించారంటు సినీనటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-05-08 04:57 GMT

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుని ఏపీ సీఐడీ అరెస్ట్ చేయడం, ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉంచడం తెలిసిందే. ఆ సమయంలో చంద్రబాబు ఇంటి నుంచి భోజనం, మెడిసిన్స్ ఏర్పాటు చేశారు. అయితే.. అతనిపై భౌతిక దాడి చేయలేదు కానీ.. మానసికంగా దారుణంగా హింసించారంటు సినీనటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అవును... గత ఏడాది సెప్టెంబర్ లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో ఏపీ సీఐడీ అరెస్ట్ చేయడం, ఆయనకు కోర్టు సుమారు రెండు నెలల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించడం తెలిసిందే. ఈ సమయంలో ఆయనను మానసికంగా వేదించారంటూ.. తాజాగా ఒక ఇంటరాక్షన్ లో పాల్గొన్న సందర్భంగా శివాజీ తెలిపారు. ఈ విషయం ఇంకెవరికీ తెలియదని అన్నారు!

ఈ సందర్భంగా మాట్లాడిన శివాజీ... "చంద్రబాబు 74 ఏళ్ల యువకుడు.. శీతాకాలం ఎక్కువగా ఉన్న రోజుల్లో అతన్ని సీఐడీ అరెస్టు చేసింది. నాకు తెలిసి మీకెవరికీ తెలియని ఒక విషయం ఉంది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు మానసికంగా వేధించబడ్డారు.. ఈ విషయం ఒక కానిస్టేబుల్ ద్వారా నాకు తెలిసింది" అని అన్నారు.

ఇందులో భాగంగా... "చంద్రబాబు 74ఏళ్ల వయసులొ జైల్లో ఉన్నప్పుడు ఆయనకు ఇండియన్ టాయిలెట్ ఇచ్చారు. వెస్ట్రన్ కమోడ్‌ ను తొలగించి, ఉద్దేశపూర్వకంగా దాని స్థానంలో ఇండియన్ టాయిలెట్‌ ని పెట్టారు. ఈ రోజుల్లో 25-30 ఏళ్ల వారు కూడా ఇండియన్ టాయిలెట్లు ఉపయోగించలేకపోతున్నారు కానీ... చంద్రబాబు ఆ వయసులో వాటిని వాడుకునేలా చేశారు.. స్నానానికి చల్లటి నీళ్లు ఇచ్చారు.." అంటూ సంచలన ఆరోపణలు చేశారు!

Read more!
Full View
Tags:    

Similar News