కేసీయార్ జగన్ తేల్చేశారు...బాబు మీదనే అందరి చూపు !

మరోవైపు చూస్తే తెలుగుదేశం పార్టీ మీదనే అందరి చూపు ఇపుడు ఉందని అంటున్నారు.;

Update: 2023-07-26 13:26 GMT

కేంద్రం లోని మోడీ సర్కార్ మీద అవిశ్వాస తీర్మాన అస్త్రాన్ని విపక్షం సంధించింది. దీని ద్వారా చాలా విపక్షం బహుళ ప్రయోజనాలనే ఆశిస్తోంది. 2024 ఎన్నికల ముందు తమకు మిత్రులు ఎవరు ప్రత్యర్ధులు ఎవరు అన్నది తెలియాలి. అంతే కాదు దేశానికి కూడా తెలియచేయాలన్నది ఆలోచనగా ఉంది. ఇక మోడీ ప్రభుత్వం నాలుగేళ్ల రెండవ విడత పాలన ఎండగట్టాలన్నది అతి ముఖ్య ఉద్దేశ్యం.

ఎన్డీయేని వీక్ చేస్తూ తన ఇండియా కూటమి బలాన్ని పెంచుకోవాలన్నది మరో ఆలోచన. ఇవన్నీ ఇలా ఉంటే ఎన్డీయేకు 38 పార్టీల మద్దతు ఉంటే ఇండియాకు 26 పార్టీల మద్దతు ఉంది. ఇక చూస్తే ఏ వైపునకూ వెళ్ళకుండా న్యూట్రల్ గా ఉన్న ఎంపీలు 62 మంది దాకా ఉన్నారు. ఆయా పార్టీలుగా బీయారెస్, వైసీపీ టీడీపీ, ఒడిషాలోని బిజూ జనతాదళ్ ఉన్నాయి.

అయితే కాంగ్రెస్ తో పాటుగా మోడీ ప్రభుత్వం మీద అవిశ్వాసం నోటీసు ఇచ్చి బీయారెస్ తన స్టాండ్ ఏంటో చెప్పేసింది. అవిశ్వాసం నోటీస్ స్పీకర్ ఓం బిర్లాకు చేరడంతోనే వైసీపీ కూడా తన స్టాండ్ ని తేటతెల్లం చేసింది. ఆ పార్టీ పార్లమెంటరీ నాయకుడు విజయసాయిరెడ్డి మోడీ మీద విపక్షాలు ఇపుడు అవిశ్వాసం పెట్టడం అర్ధరహితం అన్నట్లుగా మాట్లాడారు. అంటే అవిశ్వాసానికి తాము వ్యతిరేకం అని వైసీపీ చెప్పకనే చెప్పినట్లు అయింది అన్న మాట.

మరోవైపు చూస్తే తెలుగుదేశం పార్టీ మీదనే అందరి చూపు ఇపుడు ఉందని అంటున్నారు. వైసీపీ మోడీకి మద్దతుగా ఉంటే బీయారెస్ యాంటీ గా ఉంది. తెలుగుదేశం ఏ వైపు అన్నది ఎంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే తెలుగుదేశం స్టాండ్ బట్టి ఏపీ రాజకీయాలు దేశ రాజకీయాలు కూడా తీవ్రంగా ప్రభావితం అవుతాయని అంటున్నారు.

చంద్రబాబు కనుక 2018 నాటి మాదిరిగా బీజేపీ కి మోడీకి దూరం అనుకుంటే మాత్రం అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఆ పార్టీ ఓటేస్తుంది. ఆ పార్టీ పార్లమెంట్ సభ్యులు కూడా మాట్లాడుతారు. అయితే ఇది కనుక జరిగితే దేశం లోనే సంచలనంగా మారుతుంది. ఎందుకంటే విపక్షాల కు ఇపుడు నితీష్ కుమార్ నాయకత్వం వహిస్తున్నారు. ఆయన ఇండియా కూటమికి కన్వీనర్ గా ఉంటున్నారు.

ఇపుడు ఆ పాత్రలోకి చంద్రబాబు చాలా సులువుగానే మారిపోతారు. బాబు కు ఉన్న అనుభవం అలాంటిది. ఆయన కనుక విపక్షం వైపు వస్తే మోడీకి బీజేపీకి అది సవాల్ గా మారినా ఆశ్చర్యం లేదు. బాబుకు జాతీయ స్థాయిలో ఉన్న సంబంధాలు ఆయనకు ఉన్న పరిచాయాలు, ఆయన చాణక్య వ్యూహాలు విపక్ష కూటమికి కచ్చితంగా ఉపయోగపడతాయి.

అదే టైం లో ఏపీ లో కూడా టోటల్ గా రాజకీయం మారుతుంది. బీజేపీ ని దూరం పెడితే కమ్యూనిస్టులు చంద్రబాబు వైపు వస్తారు. ఇక పవన్ కళ్యాణ్ జనసేన కూడా బీజేపీ కావాలా లేక టీడీపీనా అన్నది తేల్చుకోవాల్సి ఉంటుంది. మొత్తానికి చంద్రబాబు డెసిషన్ అన్నది చాలా కీలకం కానుంది. అయితే బాబు అపుడే తన మాటను బయటపెట్టరు. అవిశ్వాస తీర్మానానికి డేట్ ఇచ్చి చర్చ మొదలైన తరువాతనే ఆయన నిర్ణయం ఉంటుంది అని అంటున్నరు. ఇక న్యూట్రల్ గా ఉంటూ టీడీపీ బాయ్ కాట్ చేసినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. ఏది ఏమైనా టీడీపీ రోల్ ఇపుడు కీలకం అవుతోంది.

Tags:    

Similar News