ఫస్ట్ టైం ఒకే వేదిక మీద చంద్రబాబు విజయ్ !
ఇక తమిళనాడులోని మహాబలిపురం వేదికగా గురువారం జరగనున్న 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరుకానున్నారు.
ఒకరేమో ఏపీ ముఖ్యమంత్రి, మరొకరు తమిళ దళపతి అక్కడ కొత్త సీఎం విజయ్. ఈ ఇద్దరూ ఇప్పటిదాకా ఎక్కడైనా కలుసుకున్నారో లేదో తెలియదు విజయ్ అయితే రాజకీయాల్లోకి వచ్చారు. సంచలన విజయం సాధించారు. ఆయన ఇపుడు దక్షిణాదినే అతి పెద్ద రాష్ట్రం అయిన తమిళనాడుకు ముఖ్యమంత్రి. ఇక సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన వారు ఏపీకి నాలుగవ సారి సీఎం అయిన చంద్రబాబు ఉన్నారు. ఈ ఇద్దరూ ఒకే వేదికను పంచుకునే అరుదైన సందర్భం అయితే చోటు చేసుకోనుంది. ఆ వేదిక ఏమిటి అంటే మహాబలిపురం వేదికగా గురువారం జరగనున్న 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం. దీనికి దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ హాజరవుతున్నారు. ఏపీ నుంచి చంద్రబాబు కూడా వెళ్తున్నారు.
అమిత్ షా నేతృత్వంలో :
ఇక తమిళనాడులోని మహాబలిపురం వేదికగా గురువారం జరగనున్న 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరుకానున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. ఇదే సమావేశంలో విజయ్ కూడా పాల్గొంటారు కాబట్టి ఇది ఒక అరుదైన కలయిక అంటున్నారు. మిగిలిన ముఖ్యమంత్రులతో బాబు గతంలో పాలుపంచుకున్నారు. ఇక డీకే శివకుమార్ తో బయట కూడా బాబు ముచ్చట్లు పెట్టిన నేపథ్యం ఉంది. కేరళ తమిళనాడు సీఎంలే ఈ సదరన్ జోనల్ కౌన్సిల్ లొ కొత్త. ఇక అందరి కంటే సీనియర్ మోస్ట్ లీడర్ ఎవరు అంటే అది ముఖ్యమంత్రి చంద్రబాబు అని అంటున్నారు. ఒక విధంగా బాబు ఈ సమావేశంలో ప్రత్యేక ఆకర్షణగా ఉంటే సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి తొలి అటెంప్ట్ తోనే సీఎం అయిన విజయ్ మరో ఆకర్షణ. దాంతో ఈ ఇద్దరూ కలసి పాల్గొనే ఈ సదరన్ జోనల్ కౌన్సిల్ మీట్ మీఅ ఇంత పెద్ద చర్చ అని అంటున్నారు.
కీలక అంశాలతో బాబు :
ఇక ఏపీకి సంబంధించిన కీలక అంశాలను సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో చంద్రబాబు ప్రస్తావించనున్నారు. దక్షిణాది రాష్ట్రాల మధ్య సమన్వయం అంతర్రాష్ట్ర సమస్యల పరిష్కారంతో పాటు ఏపీ పునర్విభజన చట్టం అమలు పెండింగ్‌లో ఉన్న విభజన అంశాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై బాబు కూలంకషంగా చర్చించనున్నారని భోగట్టా. ఉమండి ఏపీ రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు పూర్తవుతున్నా పునర్విభజన చట్టంలోని వివిధ అంశాలు ఓ కొలిక్కి తీసుకువచ్చే అంశాన్ని సైతం బాబు ప్రస్తావించనున్నారు. షెడ్యూల్-9-10లోని సంస్థల విభజన ఆస్తులు అప్పుల పంపకం పెండింగ్ ఆర్థిక అంశాల పరిష్కారంపై కేంద్రం చొరవ తీసుకోవాలని బాబు గట్టిగానే సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో కోరనున్నారు. అలాగే రెవెన్యూ గ్యాప్, పన్ను సంబంధిత అంశాలను ముఖ్యమంత్రి ప్రస్తావించనున్నారని అంటున్నారు.
కేంద్రం దృష్టికి కూడా :
అదే విధంగా రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు దుగరాజపట్నం పోర్టు విశాఖపట్నం విజయవాడ మెట్రో ప్రాజెక్టులు రైల్వే కనెక్టివిటీ విమానాశ్రయాల అభివృద్ధి పారిశ్రామిక కారిడార్ల వంటి అంశాలను కేంద్రం దృష్టికి ముఖ్య్మంత్రి హోదాలో చంద్రబాబు తీసుకెళ్లనున్నారు. విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేయడంతో పాటు పోలవరం ప్రాజెక్టుకు తగినన్ని నిధులు కేటాయించిన కేంద్రం విషయంలో ధన్యవాదాలను బాబు తెలియచేస్తారు అని అంటున్నారు. ఇక ఏపీలో విభజన హామీలు పరిష్కరించడంతో పాటు మిగిలిన ప్రాజెక్టులకు వేగంగా అనుమతులకు నిధుల కోసం కేంద్ర సహకారాన్ని చంద్రబాబు గట్టిగా కోరనున్నారని తెలుస్తోంది.