బాబు మార్క్ న్యూ ప్రోగ్రాం : అదిగో స్వర్ణ గ్రామం.. అక్కడే పల్లె నిద్ర

తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆలోచనలు వేరుగా ఉంటాయి. ఆయన ఏమి చేసినా ప్రజల చుట్టూనే వాటిని తిప్పుతారు.;

Update: 2025-04-04 03:39 GMT

తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆలోచనలు వేరుగా ఉంటాయి. ఆయన ఏమి చేసినా ప్రజల చుట్టూనే వాటిని తిప్పుతారు. మంత్రులను ఎమ్మెల్యేలను జనంలో తిరగమని చెబుతూ వచ్చిన బాబు ఇపుడు ఐఏఎస్ అధికారులను ఉన్నతాధికారులను పల్లె నిద్ర చేయమని కోరుతున్నారు.

ఈ మాట కొద్ది నెలల క్రితం జరిగిన కలెక్టర్ల సమావేశంలోనూ బాబు అన్నారు. మీరు హాయిగా పల్లెలకు వెళ్ళండి అక్కడి పచ్చని వాతావరణం చూడండి, గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ తెలుస్తాయి. బోలెడు విషయం వస్తుంది. మేము ఎటూ జనంలో ఉంటూ అన్నీ చూస్తాం, మీరు కూడా వెళ్తే మంచి పరిపాలన చేయవచ్చు అని చెప్పారు.

అయితే నాడు సరదాగా బాబు అన్నారని చాలా మంది భావించారు. కానీ ఇపుడు దానిని ఒక పాలసీగా బాబు చేస్తున్నారు. స్వర్ణ గ్రామం అని పేరు పెట్టి మరీ ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. దాంతో ఐఏఎస్ అధికారులు ఉన్నతాధికారులూ పల్లెలకు వెళ్ళాల్సిందే అని అంటున్నారు. అంతే కాదు వారు అక్కడ మూడు రోజులు రెండు రాత్రులు గడపాలని బాబు చెబుతున్నారు.

దాని వల్ల ప్రజలతో నేరుగా కనెక్షన్ ఏర్పడుతుందని ప్రభుత్వ పధకాలు ఎలా అమలు అవుతున్నాయో కూడా అధికారులకు తెలుస్తుంది అని అంటున్నారు. ఒక విధంగా ఇది బాబుకు వచ్చిన బెస్ట్ ఆలోచన అని అంటున్నారు. ఎమ్మెల్యేలు పల్లెలకు వెళ్ళినా లేక నాయకులు వెళ్ళినా జనం చెప్పే బాధలను విని తిరిగి అధికారులకే చెప్పాలి. అలా వారి ద్వారానే పనులు చేయించాలి.

అదే అధికారులే నేరుగా పల్లెలకు వెళ్తే వారే వాటిని నోట్ చేసుకుని తిరిగి వచ్చి మంత్రులకు ప్రభుత్వానికి చెబుతారు. ఆ విధంగా పని సులువుగా అవుతుంది. ఇక పాలనలో అధికారుల పాత్ర కీలకం. అలాగే ఐఏఎస్ అధికారులు పాలసీ మేకర్స్ గా ఉంటారు.

వారు వేరే చోట్ల పనిచేసి ఉంటారు కాబట్టి ఒక ప్రాంతంలో ఉండే క్షేత్ర స్థాయి పరిస్థితుల మీద వారు అవగాహన పెంచుకోవాలి అంటే ఈ విధంగా పల్లెలకు వెళ్తెనే అది సాధ్యపడుతుంది అని అంటున్నారు. దాంతో చంద్రబాబు అన్నీ ఆలోచించే ఉన్నతాధికారులను గ్రామాలకు పంపుతున్నారని అంటున్నారు.

స్వర్ణ గ్రామం అన్న పేరు కూడా క్యాచీగా ఉండేలా పెట్టారు తమ వద్దకే కలెక్టర్లు కీలక అధికారులు వస్తే జనాలు వారికి సమస్యలు చెప్పుకుని చాలా వరకూ సంతృప్తి పడతారు. వాటిలో పరిష్కారం అయ్యేవి కూడా ఉంటాయి. ఇక గ్రామాల్లో రెండు రాత్రులు ఐఏఎస్ అధికారులు నిద్ర చేయడం ద్వారా ఎవరూ చెప్పకుండానే అక్కడ పరిస్థితుల మీద పూర్తిగా అవగాహన పెంచుకుంటారు. ఇలా ఇటు పాలనకు అటు ప్రజలకు ఉపయోగపడే విధంగా స్వర్ణ గ్రామం పేరుతో ఒక వినూత్న కార్యక్రమానికి బాబు డిజైన్ చేశారు. మరి దీనిని ఎపుడు ప్రారంభిస్తారో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News