ఎప్పుడు లెటర్ వస్తుందా అని ...బాబు ఇంట్రెస్టింగ్ ఫ్లాష్ బ్యాక్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వయసు ఏడున్నర పదులు. రాజకీయ అనుభవం అయిదు దశాబ్దాలు.;
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వయసు ఏడున్నర పదులు. రాజకీయ అనుభవం అయిదు దశాబ్దాలు. ఆయన జీవితంలో ఎన్నో అనుభవాలు ఉన్నాయి. అవి వర్తమాన తరానికి అనుభవ సారాలుగా కూడా ఉంటాయి. చంద్రబాబు తన మనసులో మాటలను వేదిక మీద ఒక్కోసారి చెబుతూ ఉంటే అంతా ఆసక్తిగా వింటారు. ఎంతో కష్టపడి పైకి వచ్చి ఏపీకి నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. అంతే కాదు ఆయన జాతీయ స్థాయిలో ఈ రోజుకు ఒక డైనమిక్ లీడర్ గా ఉన్నారు. ఇప్పటికీ ఎంతో చురుకుగా ఉంటూ రాజకీయంగా గట్టిగా ఉండే నేత బాబు మాత్రమే. అలాంటి నాయకుడు ఫ్లాష్ బ్యాక్ ముచ్చట్లు చెబితే అందరికీ ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. వినాలని కూడా ఉంటుంది.
గుర్తొస్తున్నాయి :
ఇదిలా ఉండగా గుంటూరులో జరిగిన డాక్ సేవక్ సమ్మేళన్ కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు పోస్ట్ మెన్ ల గురించి మాట్లాడుతూ అనేక విషయాలు చెప్పుకొచ్చారు. గ్రామీణ డాక్ సేవకులను చూస్తుంటే నాకు పాతరోజులు గుర్తొస్తున్నాయి అని ఆయన మొదలెట్టి తమ విద్యార్ధి దశలోకి వెళ్ళారు. మేం చదువుకున్న రోజుల్లో పోస్ట్ మేన్ పైనే ఆధార పడేవాళ్లమని ఆయన నాటి తీపి సంగతులు చెప్పుకొచ్చారు. ఇంటి నుంచి ఎప్పుడు లెటర్ వస్తుందా అని తాము అంతా ఎదురు చూసేవాళ్లమని అన్నారు. అంతే కాదు మనీ ఆర్డర్ కోసం కూడా పోస్ట్ మేన్ కోసం ఎదురు చూసేవాళ్లమని సరదాగా వ్యాఖ్యానించారు. అలాగే ఏదన్నా కంప్లెయింట్ పెట్టాలన్నా పోస్టాఫీసుకు వెళ్తేవాళ్లం మని చెప్పారు. ఇక అప్పట్లో టెలీ కమ్యునికేషన్ ఉండేది కాదని ఏ వార్త రావాలన్నా పోస్టాఫీసు ఆధారమని బాబు గతంలోని విషయాలను జనం ముందుంచారు. డాక్ సేవకులు అందించే సేవలు దేశ స్థాయిలో నిలుస్తాయని కూడా ఆయన ప్రశంసించారు.
సింధియా కుటుంబంతో పనిచేశా :
ఇక ఈ కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గురించి కూడా బాబు మాట్లాడారు. తాను రాజమాతా వసుంధర రాజే సింధియాతో కలిసి పని చేశాను అని చెప్పారు. ఎన్టీఆర్ అంటే వసుంధర రాజే ఎంతో అభిమానంగా ఉండేవారని అన్నారు. ఇక జ్యోతిరాదిత్య సింధియా తండ్రి మాధవరావు సింధియాతోనూ పనిచేశానని ఆయన చాలా సింపుల్ గా ఉంటారని చెప్పారు. విశాఖ జిల్లాలోని గాజువాకలో సింధియా అనే గ్రామం ఉంది. త్వరలోనే ఆ గ్రామాన్ని జ్యోతిరాధిత్య సందర్శించాలని కోరుకుంటున్నానని బాబు చెప్పడం విశేషం.
ఎలక్ట్రిక్ సైకిల్ ఇవ్వాలి :
తమ కష్టంతో ప్రజలకు సేవలు అందిస్తున్న డాక్ సేవకులకు ఒక ఎలక్ట్రిక్ సైకిల్ ఇవ్వాలని కేంద్రమంత్రి జ్యోతిరాదిత్యాను చంద్రబాబు కోరారు. దీని ద్వారా పొల్కూషన్ ఉండదు. ఒక వ్యాయామం కూడా అవుతుందని అన్నారు. అలాగే ఈ రోజున బాగా చదువుకున్నవాళ్లు గ్రామాలలో ఉంటూ ప్రజలకు సేవ చేసేందుకు పోస్టల్ జాబ్ చేస్తున్నారని బాబు చెప్పారు. డాక్ సేవకులకు 150 ఏళ్ల చరిత్ర ఉందని, స్వాతంత్ర్య పోరాటంలో పరోక్షంగా కీలకంగా పని చేశారని బాబు గుర్తు చేశారు. స్వాతంత్ర్య సమరయోధులకు లేఖలు అందించేవారని అన్నారు. ఎంత టెక్నాలజీ వచ్చినా మానవత్వంతో పని చేసేది డాక్ సేవకులే అని చంద్రబాబౌ చెప్పారు. డాక్ సేవకులు లేకపోతే గ్రామీణ ప్రాంతంలో లాజిస్టిక్ వ్యవస్థ ఉండదని చెప్పడం విశేషం.
హ్యూమన్ టచ్ అంటే :
ఈ రోజున భారత దేశం నెంబర్ వన్ స్థానంలో ఉండాలంటే డాక్ సేవకులూ అవసరమని బాబు చెప్పారు. మెషిన్లు, ఏఐ ద్వారా ఏ పనైనా జరుగుతుందని, కానీ మనిషి ఇచ్చే హ్యూమన్ టచ్ డాక్ సేవకులు మాత్రమే ఇవ్వగలరని బాబు చెపారు. అంతే కాదు ఎక్కడికైనా ఒక పార్శిల్ వెళ్లాలంటే అది డాక్ సేవకుల ద్వారానే సాధ్యమని అన్నారు. ఇక ఏపీలో చూస్తే 1.64 లక్షల పోస్టాఫీసులు ఉన్నాయని, 3 లక్షల మంది గ్రామీణ డాక్ సేవకులు ఉన్నారని, 9,100 పోస్టాఫీసులు, 17 వేలకు పైగా సేవకులు ఉన్నారని బాబు వివరించారు.