దక్షిణాది రాష్ట్రాలకు చంద్రబాబు దిశానిర్దేశం.. ఏమన్నారంటే!
ఈ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. దక్షిణాది రాష్ట్రాల మధ్య కీలకమైన రెండు విషయాల్లో వివా దాలు కొనసాగడం సరికాదన్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు దక్షిణాది రాష్ట్రాలకు కీలక దిశానిర్దేశం చేశారు. తమిళనాడులోని చెన్నైలో గురు వారం జరిగిన `సదరన్ కౌన్సిల్` భేటీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా, దక్షిణాది రాష్ట్రాలైన తమి ళనాడు, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి, తెలంగాణల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. అలానే.. ఇతర ముఖ్య నేతలు కూడా హాజరయ్యారు. ఈ సమావేశం 31వది కావడం గమనార్హం. దక్షిణాది రాష్ట్రాల మధ్య నెలకొ న్న సమస్యలను ఈ సమావేశంలో చర్చించి పరిష్కరించడమే ప్రధాన ఉద్దేశం.
ఈ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. దక్షిణాది రాష్ట్రాల మధ్య కీలకమైన రెండు విషయాల్లో వివా దాలు కొనసాగడం సరికాదన్నారు. ప్రధానంగా నదీ జలాల వివాదం ఏళ్ల తరబడి కొనసాగుతోందని.. అలా కాకుండా.. ఉమ్మడి ప్రణాళికలు వేసుకుని.. ముందుకు వెళ్తే సముద్రంలో కలుస్తున్న నీరు కూడా ఉపయో గపడేలా చేసుకోవచ్చని తెలిపారు. అలానే.. రాష్ట్రాలు-రాష్ట్రాల మధ్య సహకారం కూడా లోపిస్తోందని ఆయన తెలిపారు. అన్ని రంగాల్లోనూ పోటీ తత్వం ఉండాలని.. అదేసమయంలో పరస్పర సహకారం కూడా ఉండాలని దిశానిర్దేశంచేశారు.
పెట్టుబడుల కల్పన విషయంలో దక్షిణాది రాష్ట్రాలు ఉత్తరాదితో పోటీ పడుతున్నాయని బాబు తెలిపారు. అయితే.. ఈ విషయంలో మరింతగా రాష్ట్రాలు ఆలోచన చేయాల్సి ఉందన్నారు. పెట్టుబడులు, పరిశ్రమ ల విషయంలో పోటీగా ఉంటూనే.. మరికొన్ని అంశాల్లో సహకారం అవసరమని పేర్కొన్నారు. ముఖ్యంగా రహదారుల నిర్మాణం, లాజిస్టిక్స్ ఏర్పాటు, కీలక రంగాల్లో ఉమ్మడిగా పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.ఈ విషయంలో రాష్ట్రాలు ఆలోచన చేయాలని సూచించారు.
పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన అంశంపై మాట్లాడుతూ.. జనాభా ప్రాతిపదికన చేపట్టే నియోజ కవర్గాల ఏర్పాటు విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కేంద్రాన్ని కోరారు. అయితే.. ఏ విషయంపైనైనా లోతుగా అధ్యయనం చేయాలని ఆయన రాష్ట్రాలకు సూచించారు. రాజకీయ లబ్ధి కోసం.. ఒక బృహత్తర కార్యక్రమాన్ని విమర్శించడం సరికాదన్నారు. మహిళా రిజర్వేషన్ అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా అత్యంత ముఖ్యమని వ్యాఖ్యానించారు.