యాక్టివిటీ లేకుంటే.. జగన్ ఇక గతమే ..!
వ్యక్తులకైనా.. వ్యవస్థలకైనా యాక్టివిటీ చాలా ముఖ్యం. వర్కవుట్ లేకపోతే.. ఎంత పని అయినా.. వీగిపో తుంది.;
వ్యక్తులకైనా.. వ్యవస్థలకైనా యాక్టివిటీ చాలా ముఖ్యం. వర్కవుట్ లేకపోతే.. ఎంత పని అయినా.. వీగిపో తుంది. నిజానికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ ఫార్ములాతోనే ముందుకు సాగుతోంది. ప్రతి రెండు రోజులకు ఒకసారి ప్రజల మధ్యకు వచ్చేలా సీఎం చంద్రబాబు ప్లాన్ చేసుకున్నారు. నిన్న మొన్నటి వరకు వారం రోజులుగా ఉన్న ఈ లెక్కను రెండు రోజులకు కుదించుకున్నారు. వారంలో మూడు సార్లు ఖచ్చితంగా ప్రజల మధ్యకు రావాలని.. ఏదో ఒక కార్యక్రమం ద్వారా వారికి చేరువ కావాలని నిర్ణయించా రు.
తద్వారా ప్రజలకు అందుబాటులో ఉన్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగా చూస్తే.. వైసీపీ పరిస్థితి దీనికి భిన్నంగా ఉందనే టాక్ వినిపిస్తోంది. జగన్ యాక్టివి టీని పెంచుకునే విషయంలో ఎక్కడిక్కడే ఉన్నాయి. ఆయన ప్రజల మధ్యకు రావడం లేదు. పైగా పార్టీ కార్యక్రమాలు కూడా ఊపు పెంచడం లేదు. అయితే.. తాడేపల్లిలో కూర్చోవడం.. లేకపోతే.. సుదీర్ఘ పోస్టులు పెట్టి చేతులు దులుపుకోవడం వరకే జగన్ పరిమితం అవుతున్నారు.
ఎన్నికల ఫలితాలువ చ్చేసి ఏడాదిన్నర అయినా.. వైసీపీ తరపున ఇప్పటి వరకు ఒక్క కార్యక్రమాన్ని కూ డా చేయలేదు. రైతులను పరామర్శించే కార్యక్రమాలను కూడా జాతరలా నిర్వహించడం వివాదానికి దారి తీసింది. ఇక, రాజకీయంగా కూడా దూకుడు లేకుండా పోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవైపు కూటమి ప్రభుత్వం బలమైన వాయిస్‌తో విరుచుకుపడుతుంటే.. మరోవైపు వైసీపీ నాయకులు పెద్దగా స్పందించడం కూడా లేదు. ఏదైనా జరిగితే.. వెంటనే స్పందిస్తున్న కూటమి ముందు వైసీపీ తేలిపోతోంది.
అలా కాకుండా.. నిరంతరం ప్రజల మధ్యకు వచ్చేలా వైసీపీ ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా జగన్.. ప్రజల మధ్యకు రావాల్సిన అవసరం ఉంది. గతంలో చంద్రబాబు విపక్షంలో ఉండగా.. ప్రజల మధ్యకు ఎలా వచ్చారో.. ఇప్పుడు జగన్ కూడా అలానే రావాలని వైసీపీ కార్యకర్తలు,, నాయకులు కూడా కోరుతున్నారు. కానీ... జగన్ మాత్రం అయితే.. తాడేపల్లి, లేకపోతే బెంగళూరుకు మాత్రమే పరిమితం అవుతున్నారు. దీంతో యాక్టివిటీ లేకుండా పోయిందన్న చర్చ సాగుతోంది. ఇదే కొనసాగితే..ఆ యనను మరిచిపోవడం పెద్ద దూరంలో లేదన్న వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం.