ముగ్గురు మూడు విధాలుగా.. చంద్రబాబు, పవన్, లోకేశ్ వ్యవహారంపై హాట్ టాపిక్

ముఖ్యమంత్రి చంద్రబాబు తొలుత తుఫాన్ బాధితుల పరామర్శకు వెళ్లి ఆ తర్వాత దైనందన ప్రభుత్వ కార్యక్రమాలల్లో బిజీ అయిపోయారు.;

Update: 2025-10-31 13:09 GMT

ఏపీలో కూటమి ప్రభుత్వం మంచి సమన్వయంతో పనిచేస్తోంది. కూటమిలో గిల్లికజ్జాలు తేవడానికి ప్రత్యర్థులు ఎంతగా ప్రయత్నిస్తున్నా.. ముగ్గురు ముఖ్యనేతలు అవగాహనతో పనిచేస్తూ వివాదాలు దూరంగా ఉంటున్నారని అంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్, యువనేత, మంత్రి లోకేశ్ పనితీరును గమనిస్తే వారి ముగ్గురి మధ్య బాండింగ్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోందని, ఇదే పద్ధతి కొనసాగితే ప్రత్యర్థులు త ఆశలపై నీళ్లు కుమ్మరించుకుని మరికొన్నేళ్లు వెయిట్ చేయక తప్పదని అంటున్నారు.

కూటమిలో మూడు పార్టీలు ఉన్నప్పటికీ ప్రధానంగా ముగ్గురు నాయకుల చుట్టూనే రాజకీయం తిరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్, మంత్రి లోకేశ్ పర్యవేక్షణలోనే ప్రభుత్వం నడుస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే ఉప ముఖ్యమంత్రి పవన్, మంత్రి లోకేశ్ ఇద్దరూ ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద రాజకీయ పాఠాలు నేర్చుకోడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే ఈ విషయంలో ఇద్దరూ ఒకరితో ఒకరి పోటీపడకండా సర్దుకుపోయేలా వ్యవహరించడమే రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.

ఇటీవల ఏపీని వణికించిన మొంథా తుఫాన్ తర్వాత ముగ్గురు నేతల వ్యవహరంపై రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ నడుస్తోంది. తుఫాన్ ముందస్తు సన్నద్ధతలో ముగ్గురు నేతలు కలిసి పనిచేయగా, ఆ తర్వాత ఒక్కొక్కరు ఒక్కో బాధ్యతను తీసుకోవడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తొలుత తుఫాన్ బాధితుల పరామర్శకు వెళ్లి ఆ తర్వాత దైనందన ప్రభుత్వ కార్యక్రమాలల్లో బిజీ అయిపోయారు. ఇదే సమయంలో పవన్ పూర్తిగా క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లి రైతులు, ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే బాధ్యత తీసుకున్నారని చెబుతున్నారు. అదే సమయంలో మంత్రి నారా లోకేశ్ ఆర్టీజీఎస్ ద్వారా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు, మరమ్మతు పనుల పర్యవేక్షణ చూసుకున్నారు.

దీనివల్ల క్షేత్రస్థాయిలో పరిస్థితులు చక్కదిద్దడం ఒక ఎత్తైతే.. ఉప ముఖ్యమంత్రితో పోటీ పడకుండా ఆయనకు నైతిక మద్దతు ఇస్తూ పొత్తు ధర్మాన్ని పాటిస్తున్నారని అంటున్నారు. ఈ విధానాల వల్ల కూటమిలో భేదాభిప్రాయాలకు చోటు లేకుండా పోతుందని అంటున్నారు. ప్రధానంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు పూర్తి స్వేచ్ఛనిచ్చినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ సంకేతాలు పంపుతుండటం కూడా రాజకీయ ప్రత్యర్థులు మింగుడు పడటం లేదని అంటున్నారు.

Tags:    

Similar News