'పీ-4': నేరుగా రంగంలోకి చంద్ర‌బాబు

టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు నేరుగా రంగంలోకి దిగారు. కూట‌మి ప్ర‌భుత్వం సంక‌ల్పించిన పీ-4 (ప‌బ్లిక్‌-ప్రైవేటు-పీపుల్-పార్ట‌న‌ర్ షిప్‌) కార్య‌క్ర‌మాన్ని ప్ర‌జ‌ల‌కు స్వ‌యంగా వివ‌రించాల‌ని నిర్ణ‌యించుకున్నారు.;

Update: 2025-04-06 02:30 GMT

టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు నేరుగా రంగంలోకి దిగారు. కూట‌మి ప్ర‌భుత్వం సంక‌ల్పించిన పీ-4 (ప‌బ్లిక్‌-ప్రైవేటు-పీపుల్-పార్ట‌న‌ర్ షిప్‌) కార్య‌క్ర‌మాన్ని ప్ర‌జ‌ల‌కు స్వ‌యంగా వివ‌రించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. దేశంలో తొలిసారిగా పేద‌ల‌ను ఉన్న‌త స్థాయి వ‌ర్గాలుగా తీర్చిదిద్దేందుకు చంద్ర‌బాబు చేసిన ఆలోచ‌నే పీ-4. దీని ద్వారా రాష్ట్రంలో 20 ల‌క్ష‌ల మంది పేద‌ల‌ను ఉన్న‌త‌స్థాయికి తీసుకురావాల‌ని నిర్ణ యించారు. ఇటీవ‌ల దీనిని సీఎం చంద్ర‌బాబు స్వ‌యంగా ప్రారంభించారు.

అయితే.. అనుకున్న స్థాయిలో ప్ర‌జ‌ల నుంచి ఈ పీ-4పై స్పంద‌న రావ‌డం లేదు. పైగా.. ఎవ‌రో వ‌చ్చి.. త‌మ‌పై పెత్త‌నం చేసే అవ‌కాశం పెరుగుతుంద‌ని వారు భావిస్తున్నారు. సాయం చేయ‌డం వ‌ర‌కు అయితే ఓకే.. కానీ.. త‌మ‌పై పెత్త‌నం చేస్తే ఎలా? అన్న‌దివారి భావన‌. ఈ విష‌యాలు తాజాగా రెండు రోజుల నుంచి నిర్వ‌హించి ఐవీఆర్ ఎస్ స‌ర్వేలో తేలాయి. ఈ విష‌యంపై దృష్టి పెట్టిన చంద్ర‌బాబు వెంట‌నే ఈ ప్ర‌చారానికి తెర‌దించాల‌ని నిర్ణ‌యించారు. అనుకున్న వెంట‌నే ఆయ‌న ఎంపిక చేసుకున్న గ్రామానికి ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చేశారు.

తాజాగా సీఎం చంద్ర‌బాబు ఎన్టీఆర్‌ జిల్లాలోని చందర్లపాడు మండలం ముప్పాళ్ల గ్రామంలో ప‌ర్య‌టిస్తు న్నారు. ఈ గ్రామంలోని పేద‌ల‌ను పీ-4 కార్య‌క్ర‌మానికి ప్ర‌భుత్వం ఎంపిక చేసింది. అయితే.. వీరిలో చాలా మందివిముఖ త వ్య‌క్తం చేస్తున్నారు. ఎవ‌రో వ‌చ్చి.. త‌మ‌పై పెత్త‌నం చేయ‌డం త‌మ‌కు ఇష్టం లేద‌ని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే చంద్ర‌బాబు స్వ‌యంగా పీ4 విధానాన్ని గ్రామస్తులకు వివరించను న్నారు. పేద‌రికం నుంచి ప్ర‌జ‌ల‌ను ఎలా బ‌య‌ట‌కు తీసుకురావాల‌నితాను సంక‌ల్పించిందీ.. వారికి వివ‌రించ‌నున్నారు.

అయితే.. ఈ కార్య‌క్ర‌మ ప్ర‌చారానికి మంత్రుల‌ను , అధికారుల‌ను ఆదేశించే అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ.. ప్ర‌ధానంగా తానే రంగంలోకి దిగితే.. ప్ర‌స్తుతం నెల‌కొన్న అపోహ‌లు, ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు బ‌ల‌మైన చెక్ పెట్టిన‌ట్టు అవుతుంద‌ని చంద్ర‌బాబు త‌ల‌పోస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ముప్పాళ్ల‌లో ప‌ర్య‌టించి.. ప్ర‌జ‌ల‌ను చైత‌న్యం చేయ‌నున్నారు. పీ-4 విధానంలో ఈ ఏడాది నుంచి పేద‌ల‌ను ఉన్న‌త‌స్థాయికి చేర్చాల‌న్న ల‌క్ష్యాన్ని పూర్తి చేయాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించిన విష‌యం తెలిసిందే.

Tags:    

Similar News