మారిన బాబు: మోడీ ఖుషీ ఖుషీ ..!

ఉప‌రాష్ట్ర‌పతి ఎన్నిక‌ల్లో ఎన్డీయే అభ్య‌ర్థిగా త‌మిళ‌నాడుకు చెందిన సీపీ రాధాకృష్ణ‌న్‌ను మోడీ సెల‌క్ట్ చేశారు.;

Update: 2025-08-26 08:30 GMT

టీడీపీ అధినేత చంద్ర‌బాబులో స్ప‌ష్ట‌మైన మార్పుక‌నిపించింది. ఇది ఎన్డీయే కూట‌మిలోని బీజేపీకి సంతోషం క‌లిగిస్తోంద‌ని జాతీయ మీడియా వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది. ముఖ్యంగా ప్ర‌ధాని మోడీ ద‌గ్గ‌ర మ‌రిన్ని మంచి మార్కులు కూడాప‌డ్డాయ‌ని అంటున్నారు. వాస్త‌వానికి చంద్ర‌బాబుకు కూట‌ముల విష‌యంలో భిన్నమైన ప‌రిస్థితులు ఉన్నాయి. గ‌తంలో బీజేపీతో విభేదించారు. త‌ర్వాత‌.. నేరుగా పోయి బీజేపీ వ్య‌తి రేకించే కాంగ్రెస్‌తోనూ చేతులు క‌లిపారు. తెలంగాణ ఎన్నిక‌ల్లో క‌లిసిపోటీ చేశారు.

ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు కూట‌మి క‌ట్టినా.. సందేహించే వాతావ‌ర‌ణ ఏర్ప‌డింద‌నే టాక్ ఉంది. ఈ అపప్ర‌దను తుడుచుకునేందుకు చంద్ర‌బాబుకు ఇప్ప‌టి వ‌ర‌కు ఛాన్స్ రాలేదు. అయితే.. ఆయ‌న ప‌దే ప‌దే మాత్రం ఈ కూట‌మి వ‌చ్చే 15 సంవ‌త్స‌రాలు బ‌లంగా ఉంటుంద‌ని మాత్రం చెబుతున్నారు. కానీ, తాజాగా ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల రూపంలో చంద్ర‌బాబుకు మ‌రో చాన్స్ చిక్కింది. కూట‌మిని బ‌ల‌ప‌రిచే అవ‌కాశం ఏర్ప‌డింది. ఇదే ఇప్పుడు మోడీని కూడా ఖుషీ చేసింది.

ఉప‌రాష్ట్ర‌పతి ఎన్నిక‌ల్లో ఎన్డీయే అభ్య‌ర్థిగా త‌మిళ‌నాడుకు చెందిన సీపీ రాధాకృష్ణ‌న్‌ను మోడీ సెల‌క్ట్ చేశారు. తాము ముందుగానే ఫ్రీ హ్యాండ్ ఇచ్చామ‌ని, దేశ ప్ర‌యోజ‌నాల‌ను దృష్టిలో పెట్టుకుని ఎంపిక చేసే అవ‌కాశం క‌ల్పించామ‌ని చంద్ర‌బాబు చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే సీపీ రాధాకృష్ణ‌న్‌ను ఆయ‌న క‌లిసి అభినందించారు. ఈ స‌మ‌యంలో రాధాకృష్ణ‌న్ కూడా టీడీపీ పార్టీ జెండా రంగు ప‌సుపు ను పోలిన చొక్కా ను ధ‌రించి ఉండ‌డంతో చంద్ర‌బాబు మ‌రింత ఖుషీ అయ్యారు.

ఇక‌, సీపీ రాధాకృష్ణ‌న్‌కే త‌మ ఓటు అని చంద్ర‌బాబు తేల్చి చెప్పారు. ఇదేస‌మ‌యంలో ఇండియా కూట‌మి ఎంపిక చేసిన తెలుగు వారైన‌.. బీ. సుద‌ర్శ‌న్‌రెడ్డి విష‌యాన్ని చంద్ర‌బాబు లైట్ తీసుకున్నారు. అస‌లు ఓడిపోయే నాయ‌కుడిని ఎంపిక చేయ‌డం అంటూ.. ఆయ‌న ఆగ్ర‌హం కూడా వ్య‌క్తం చేశారు. ఈ ప‌రిణామాల కు తోడు.. తెలుగు వారే అయినా.. ఆయ‌నకు బ‌లం లేద‌ని.. ఓడిపోతార‌ని.. కాబ‌ట్టి త‌మ మ‌ద్ద‌తు రాధాకృష్ణ న్ కేన‌ని తేల్చి చెప్పారు. ఈ వ్యాఖ్య‌లు చంద్ర‌బాబు నిబ‌ద్ధ‌త‌కు, కూట‌మికి ఐక్యానికి నిద‌ర్శ‌నంగా ఉన్నా య‌ని బీజేపీ నాయ‌కులు కూడా హ్యాపీగా ఫీల‌వుతున్నారు. మోడీ అయితే మ‌రింత సంతోషంతో ఉన్నారు.

Tags:    

Similar News